ETV Bharat / sports

ఆ మైదానం పాత జ్ఞాపకాల్ని గుర్తు చేస్తోంది: బుమ్రా - బుమ్రా కేప్​టౌన్​

Bumrah Cape Town: టీమ్ఇండియా స్టార్​ బౌలర్​ బుమ్రా టెస్టుల్లో అరంగేట్రం చేసి నాలుగేళ్లు పూర్తవుతోంది. ఇంతకాలం తర్వాత తను తొలి టెస్టు ఆడిన కేప్​టౌన్​లోనే దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో కేప్​టౌన్​ తన మధుర స్మృతులను గుర్తు చేస్తోందని పేర్కొన్నాడు బుమ్రా.

Bumrah test debut
Bumrah test debut
author img

By

Published : Jan 10, 2022, 9:23 AM IST

Bumrah Cape Town: టీమ్​ఇండియా స్టార్​ ఫాస్ట్ బౌలర్​ జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా రాణిస్తున్నాడు. కేప్​టౌన్​ వేదికగా టెస్టుల్లో బుమ్రా అరంగేట్రం చేసి నాలుగేళ్లు పూర్తయింది. మళ్లీ అదే జట్టు(దక్షిణాఫ్రికాపై), అదే వేదికలో కీలక మ్యాచ్​ ఆడనున్నాడు బుమ్రా. ఈ నేపథ్యంలో కేప్​టౌన్​లో తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. మంగళవారం నుంచి ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.

"2018 జనవరిలో కేప్​టౌన్​లో జరిగిన మ్యాచ్​తో టెస్టు​ కెరీర్​ను మొదలుపెట్టాను. నాలుగేళ్ల నుంచి ఆటగాడిగా ఎదిగాను. నాకంటూ ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ మైదానానికి తిరిగి రావడం సంతోషంగా ఉంది. పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి" అని బుమ్రా పేర్కొన్నాడు.

దక్షిణాఫ్రికాపై అరంగేట్ర మ్యాచ్​లోనే నాలుగు వికెట్లు తీశాడు బుమ్రా. అందులో ఏబీ డివిలియర్స్​ వికెట్​ కూడా ఒకటి. అయితే ఆ మ్యాచ్​లో భారత్​ ఓడిపోయింది. తర్వాత జోహన్నెస్​బర్గ్​లో జరిగిన టెస్ట్​ మ్యాచ్​లో ఐదు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ సిరీస్​లో మొత్తం 14 వికెట్లు తీశాడు. అప్పటి నుంచి భారత్​ పేస్​ దళానికి నాయకుడిగా ఎదిగాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రత్యర్థి బ్యాటర్లకు చెమటలు పట్టించే బుమ్రా.. విదేశాల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్​గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు 26 టెస్టులు ఆడిన బుమ్రా.. 107 వికెట్లు దక్కించుకున్నాడు.

ఇదీ చూడండి: పంత్​ ఇకనైనా ఆటతీరును మార్చుకుంటాడా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.