ETV Bharat / sports

ICC Rankings: దూసుకెళ్లిన హార్దిక్​, పంత్.. ​కోహ్లీ, బుమ్రా డౌన్​ - వన్డే ర్యాంకింగ్స్​ పంత్​

ICC ODI rankings: ఐసీసీ.. తాజా వన్డే ర్యాంకింగ్స్​ను విడుదల చేసింది. ఇందులో టీమ్​ఇండియా ప్లేయర్స్​ కోహ్లీ, బుమ్రా ర్యాంకుల్లో కిందకు పడిపోగా.. హార్దిక్​, పంత్​ మాత్రం దూసుకెళ్లారు.

ICC Rankings
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్​
author img

By

Published : Jul 20, 2022, 5:01 PM IST

ICC ODI rankings: ఇంగ్లాండ్​తో జరిగిన ఆఖరి వన్డేలో అద్భుత సెంచరీతో అదరగొట్టిన పంత్.. ఐసీసీ ర్యాంకింగ్స్​లో సత్తా చాటాడు. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్​లో బ్యాటింగ్ విభాగంలో ఏకంగా 25స్థానాలు ఎగబాకి 52వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక ఈ మ్యాచ్​లోనే ఆల్​రౌండ్​ ప్రదర్శనతో ఆకట్టుకున్న పాండ్యా.. 8 ర్యాంకులు ముందుకు జరిగి 42వ స్థానంలో నిలిచాడు. ఇక పాక్ కెప్టెన్ బాబర్​ 892 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. ఇమామ్​ ఉల్​ హక్​, వాండర్ డుసెన్​ రెండు, మూడు ర్యాంకుల్లో ఉన్నారు. కోహ్లీ ఓ స్థానం దిగజారి నాలుగులో నిలవగా.. రోహిత్​ శర్మ ఐదులో కొనసాగుతున్నాడు.

బౌలింగ్ విభాగంలోనూ టీమ్​ఇండియా పేసర్​ బుమ్రా రెండో స్థానానికి పడిపోయాడు. ట్రెంట్‌ బౌల్ట్‌, బుమ్రా, షాహిన్‌ అఫ్రిది ఒకటి, మూడు స్థానాల్లో నిలాచరు. ఆల్‌రౌండర్ల విభాగంలో షకీబ్‌ అల్‌ హసన్‌, మహ్మద్‌ నబీ, రషీద్‌ ఖాన్‌లు తొలి మూడు ర్యాంకుల్లో ఉన్నారు. అయితే టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ హార్దిక్‌ పాండ్యా 13 స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానంలోకి దూసుకొచ్చాడు.

ఇదీ చూడండి: 'పంత్‌ లాంటి కెప్టెన్‌ ఉంటే టీమ్‌ఇండియాకు మంచిది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.