ETV Bharat / sports

IND VS AUS: జడ్డూ చేసిన ఆ మ్యాజిక్ చీటింగా? - జడేజా వేలికి ఏం పుశాడు

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్న రవీంద్ర జడేజా.. మ్యాచ్ మధ్యలో చేసిన ఓ పని ప్రస్తుతం వైరల్ గా మారింది. అతడు చీటింగ్ చేసి ఈ ఫీట్​ను అందుకున్నాడా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పలువురు మాజీ క్రికెటర్లు. ఇంతకీ అతడు ఏం చేశాడంటే?

Border Gavaskar trophy ind vs Aus Ravindra jadeja cheating finger
IND VS AUS: జడ్డూ చేసిన ఆ మ్యాజిక్ చీటింగా
author img

By

Published : Feb 10, 2023, 7:16 AM IST

దాదాపు ఐదు నెలల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టి అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్న రవీంద్ర జడేజా మంచి ప్రదర్శన కనబరిచాడు. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆసీస్​తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో తన మ్యాజిక్​తో ఐదు వికెట్లు పడగొట్టాడు. మార్నస్‌ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, మాట్‌ రెన్‌షా, పీటర్‌ హ్యాండ్స్‌కోబ్‌, టాడ్‌ మార్ఫేను పెవిలియన్ పంపించి ఐదు వికెట్ల ఫీట్‌ను సాధించాడు. టెస్టుల్లో అతడు ఐదు వికెట్ల హాల్‌ అందుకోవడం ఇది 11వ సారి కావడం విశేషం. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజాకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే?

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 45 ఓవర్లు ముగిసేసరికి 120/5 స్కోరుతో ఉంది. అప్పటికే జడేజా మూడు వికెట్లు పడగొట్టి జోరు మీదున్నాడు. ఈ క్రమంలో 46వ ఓవర్‌ను జడేజా వేశాడు. ఈ ఓవర్‌ ప్రారంభానికి ముందు జడ్డూ బంతిని అందుకుని సిరాజ్‌ దగ్గరికి వెళ్లాడు. అతడి దగ్గరి ఏదో పదార్థాన్ని తీసుకుని బంతిని స్పిన్‌ చేసే వేలికి రాసుకున్నాడు.

అనంతరం కెప్టెన్‌ రోహిత్‌తో కలిసి ఫీల్డింగ్‌ సెట్‌ గురించి మాట్లాడి బౌలింగ్‌ని కొనసాగించాడు. అయితే, జడేజా తన వేలిపై ఏం రాసుకున్నాడనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌ ట్విటర్‌ వేదికగా స్పందించాడు. 'జడేజా తన వేలికి ఏం పూసుకున్నాడు? ఇలాంటి దాన్ని ఎప్పుడూ చూడలేదు' అని ట్వీట్‌ చేశాడు. ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ టిమ్‌ ఫైన్‌ కూడా ఈ వీడియో గురించి 'ఇంట్రెస్టింగ్‌' అని కామెంట్ చేశాడు. మరికొంతమంది నెటిజన్లు చీటింగ్ చేశాడా అంటూ కామెంట్లు చేశాడు. ఇంకొంతమంది అతడికి మద్దతు పలుకుతున్నారు. మరి ఇంతకీ తాను ఏం చేశాడో జడ్డూకే తెలియాలి.

ఇదీ చూడండి: IND VS AUS: రోహిత్​ హాఫ్​ సెంచరీ.. తొలి రోజు ఆట పూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.