Bombblast In Stadium: అఫ్గానిస్థాన్‌లోని కాబూల్‌లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆత్మాహుతి పేలుడు జరిగింది. వెంటనే ఆటగాళ్లందరనీ సురక్షితంగా బంకర్‌లోకి తరలించారు అధికారులు. పేలుడు తర్వాత గందరగోళం ఏర్పడడం వల్ల భయాందోళనలకు గురైన వీక్షకులంతా పరుగులు తీశారు. పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. బ్యాండ్-ఎ-అమీర్ డ్రాగన్స్, పామిర్ జల్మీ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పేలుడు జరిగినప్పుడు ఐరాస ప్రతినిధులు స్టేడియంలోనే ఉన్నారు.
-
Footage : There have been casualties in the blast at the Kabul international cricket stadium. #Afghanistan pic.twitter.com/wM7qMsVDpR
— Abdulhaq Omeri (@AbdulhaqOmeri) July 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Footage : There have been casualties in the blast at the Kabul international cricket stadium. #Afghanistan pic.twitter.com/wM7qMsVDpR
— Abdulhaq Omeri (@AbdulhaqOmeri) July 29, 2022Footage : There have been casualties in the blast at the Kabul international cricket stadium. #Afghanistan pic.twitter.com/wM7qMsVDpR
— Abdulhaq Omeri (@AbdulhaqOmeri) July 29, 2022
అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు.. ఏటా ష్పగీజా టీ20 క్రికెట్ లీగ్ నిర్వహిస్తోంది. ఈ లీగ్‌లో ఎనిమిది ఫ్రాంచైజీలు పాల్గొంటాయి. ఈ టోర్నమెంట్లో జాతీయ జట్టు, విదేశీ ఆటగాళ్లు, 'A' జట్టు ఆటగాళ్లు, అండర్ 19 జట్టులోని ఆటగాళ్లతో పాటు సంబంధిత ప్రాంతాల నుంచి ఎలైట్ ప్రదర్శనకారులు కూడా పాల్గొంటారు. అయితే ప్రతి జట్టుకు డ్రాఫ్ట్ ద్వారా ఆటగాళ్లను ఎంపిక చేస్తారు.
"ష్పగీజా లీగ్‌లో రెండు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో పేలుడు జరిగింది. నలుగురు పౌరులు గాయపడ్డారు" అని ఏసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నాసిబ్ ఖాన్ తెలిపారు. కాబూల్‌లోని గురుద్వారా కార్తే పర్వాన్ గేట్ సమీపంలో పేలుడు జరిగిన రెండు రోజుల తర్వాత ఈ పేలుడు సంభవించిడం గమనార్హం.
ఇవీ చదవండి: 2 రోజుల్లోనే మళ్లీ టాప్‌లోకి హిట్‌మ్యాన్.. పాపం గప్తిల్!
'కామన్వెల్త్' తొలిరోజు మెరుగ్గానే.. టీటీ, బ్యాడ్మింటన్‌లో భారత్ శుభారంభం