ETV Bharat / sports

బెంగాల్​ అదుర్స్​.. తొలి 9 మంది 50 ప్లస్​.. 129 ఏళ్ల రికార్డు బద్దలు

Ranzi trophy Bengal players record: రంజీ ట్రోఫీలో.. చరిత్రలో నిలిచిపోయే రికార్డు నమోదైంది. సూమరు 129 ఏళ్ల రికార్డును బెంగాల్​ జట్టు ఆటగాళ్లు బద్దలు కొట్టారు. అదేంటంటే..

ranzi trophy
రంజీ ట్రోఫీ
author img

By

Published : Jun 9, 2022, 10:04 AM IST

Updated : Jun 9, 2022, 10:30 AM IST

Ranzi trophy Bengal players record: రంజీ ట్రోఫీలో భాగంగా ఝార్ఖండ్​తో జరుగుతున్న క్వార్టర్​ ఫైనల్​లో బెంగాల్​​ జట్టు అరుదైన రికార్డు నమోదు చేసింది. ఈ మ్యాచ్​లో టాస్​ కోల్పోయి బ్యాటింగ్​ ఎంచుకున్న బెంగాల్​.. చరిత్రలో నిలిచిపోయే ఆట ఆడింది. మ్యాచ్​లో భాగంగా మూడో రోజు (బుధవారం) నాటికి 7 వికెట్ల నష్టానికి 773 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్​ డిక్లేర్​ చేసింది.

ఓపెనర్​తో మొదలు తొమ్మిదో ఆటగాడి వరకు ప్రతిఒక్కరూ అర్ధసెంచరీ చేయడం విశేషం. గతంలో 1893లో సుమారు 129 ఏళ్ల కిందట కేంబ్రిడ్జ్​ యూనివర్సిటీపై 8 మంది ఆస్ట్రేలియా బ్యాటర్లు అర్ధశతకాలు చేశారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఆ రికార్డు బద్దలైంది. బెంగాల్​ బ్యాటర్లలో సుదీప్​(186), అనుస్తుప్​ మజుందార్​(117) సెంచరీలతో అదరగొట్టగా.. అభిషేక్​ రమన్​(61), అభిమన్యు ఈశ్వరన్​(65), మనోజ్​ తివారి (73), అభిషేక్​ పోరెల్​(68), షాబాజ్​ అహ్మద్​(78), సయన్(53*), ఆకాశ్ దీప్​(53*) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. అనంతరం బ్యాటింగ్​కు దిగిన ఝార్ఖండ్​ మూడో రోజు ఆట ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 139 రన్స్ చేసి 634 పరుగుల వెనుకంజలో నిలిచింది.

ఇదీ చూడండి: దటీజ్ మిథాలీ రాజ్​.. అతివల క్రికెట్‌ను అందలమెక్కించి

Last Updated : Jun 9, 2022, 10:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.