ETV Bharat / sports

BCCI President Pakistan Visit : పాక్​కు BCCI బాస్​లు.. 'నో పాలిటిక్స్.. కేవలం క్రికెట్​ కోసమే​!' - ఆసియా కప్​ 2023 బీసీసీఐ

BCCI President Pakistan Visit : బీసీసీఐ అధ్యక్షుడు రోజర్​ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్​ శుక్లా.. ఆసియా కప్​ మ్యాచ్​లు చేసేందుకు పాకిస్థాన్​కు వెళ్లారు. తమ రెండు రోజుల పర్యటన పూర్తిగా క్రికెట్​ కోసమేనని.. రాజకీయానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2023, 4:49 PM IST

Updated : Sep 4, 2023, 5:11 PM IST

BCCI President Pakistan Visit : బోర్డ్​ ఆఫ్​ కంట్రోల్​ ఫర్​ క్రికెట్​ ఇన్​ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు రోజర్​ బిన్నీ, వైస్​ ప్రెసిడెంట్​ రాజీవ్​ శుక్లా.. పాకిస్థాన్​ పర్యటనకు వెళ్లారు. ఆ దేశ క్రికెట్​ బోర్డు (పీసీబీ)తోపాటు ఆసియా క్రికెట్​ కౌన్సిల్​ (ఏసీసీ) ఆహ్వానం మేరకు ఆసియా కప్ మ్యాచ్​లు చూసేందుకు వారిద్దరూ వెళ్లారు. అయితే తమ రెండు రోజుల పర్యటన పూర్తి క్రికెట్​ కోసమేనని.. రాజకీయాలకు సంబంధం లేదని రాజీవ్​ శుక్లా తేల్చి చెప్పారు.

Asia Cup 2023 BCCI : పంజాబ్​లోని అమృత్​సర్​ సమీపంలోని ఉన్న భారత్​-పాక్​ సరిహద్దు ప్రాంతం అట్టారీ-వాఘా బోర్డర్​ ద్వారా పాక్​లోకి రోజర్​ బిన్నీ, రాజీవ్​ శుక్లా సోమవారం ప్రవేశించారు. అంతకుముందు, అమృత్​సర్​ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆ సమయంలో రోజర్​ బిన్నీ, రాజీవ్​ శుక్లా మీడియాతో మాట్లాడారు. "ఈ రెండు రోజుల పర్యటన పూర్తిగా క్రికెట్ కోసమే.. రాజకీయంగా ఏమీ లేదు. విందుకు హాజరుకానున్నాం. పాకిస్థాన్​, అఫ్గానిస్థాన్​, బంగ్లాదేశ్​ జట్లు అందులో పాల్గొంటాయి" అని రాజీవ్​ శుక్లా తెలిపారు.

  • #WATCH | BCCI President Roger Binny, Vice -President Rajeev Shukla arrive at Punjab's Amritsar airport to visit Pakistan for Asia Cup 2023

    "This two-day visit is purely from the point of view of cricket, nothing political...," says Shukla.

    Roger Binny says "I am looking forward… pic.twitter.com/7TiKlBHexA

    — ANI (@ANI) September 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

టోర్నమెంట్​ కోసం భారత్​ జట్టు.. ఎందుకు పాకిస్థాన్​కు వెళ్లలేదని విలేకరులు ప్రశ్నించారు. తాము కేంద్ర ప్రభుత్వ సలహా ప్రకారమే నడుచుకుంటామని.. సర్కార్​ ఏది నిర్ణయిస్తే అదే చేస్తామని రాజీవ్​ శుక్లా బదులిచ్చారు. శ్రీలంకలో మ్యచ్​లను చూసేందుకు కొలంబో వెళ్లినప్పటి నుంచి పాక్​ పర్యటన కోసం తానెంతో ఎదురు చూస్తున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ తెలిపారు. 2006 తర్వాత రోజర్ బిన్నీ పాక్​కు వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం.

Asia Cup 2023 Teams : భారత్‌ వేదికగా ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్‌నకు సన్నాహకంగా భావిస్తున్న ప్రతిష్టాత్మక ఆసియా కప్‌ ఆగస్టు 30న ప్రారంభమైంది. సెప్టెంబర్​ 17 వరకు ఈ టోర్నీ జరగనుంది. పాక్‌లోని ముల్తాన్‌, లాహోర్​తో పాటు శ్రీలంకలో పల్లెకెల్లె, కొలొంబో స్టేడియాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. భారత్‌, పాకిస్థాన్​, నేపాల్‌ గ్రూప్‌-ఏలో, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ గ్రూప్‌-బిలో ఉన్నాయి.

Asia Cup 2023 Points Table : టోర్నీలో భాగంగా ఆగస్టు 30న నేపాల్​తో జరిగిన మ్యాచ్​లో పాకిస్థాన్​ గెలిచింది. ఆ తర్వాత భారత్​- పాక్ మధ్య జరిగిన హైఓల్టేజ్​ మ్యాచ్​ను.. టీమ్​ఇండియా ఇన్నింగ్స్​ తర్వాత వర్షం కారణంగా నిలిపివేయడం వల్ల ఇరు జట్లకు రెండు పాయింట్లు లభించాయి. దీంతో పాక్​.. ఇప్పటికే సూపర్​-4కు చేరుకుంది. సోమవారం.. భారత్​ తన చివరి గ్రూప్​ మ్యాచ్​లో పసికూన నేపాల్​తో తలపడింది. మరోవైపు, ఆసియా కప్​లో నేపాల్ ఆడటం ఇదే తొలిసారి.

Asia Cup Controversies : వినోదంలోనే కాదు.. వివాదాల్లోనూ ఆసియా కప్​ టాపే.. ఈ కాంట్రవర్సీలు గుర్తున్నాయా?

Ind vs Pak Asia Cup 2023 : డోంట్​ వర్రీ ఫ్యాన్స్​.. టోర్నీలో మరో ఇండో-పాక్ మ్యాచ్​.. డేట్ ఫిక్స్​!

Last Updated : Sep 4, 2023, 5:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.