ETV Bharat / sports

Team India Coach 2021: టీమ్​ఇండియా కొత్త కోచ్​ ఎవరు..? - ప్రధానకోచ్ రవిశాస్త్రి​

టీమ్​ఇండియా తర్వాత కోచ్​ ఎవరు? అనే విషయం ప్రస్తుతం హాట్​ టాపిక్​గా మారింది. దిగ్గజ క్రికెటర్లు కుంబ్లే, లక్ష్మణ్​లను బీసీసీఐ త్వరలో ఈ విషయమై కలవనుంది. వారిద్దరిలో ఎవరు అంగీకారం తెలిపినా సరే ప్రధాన కోచ్​గా వారు బాధ్యతలు స్వీకరించే అవకాశముంటుంది.

Team India Coach
టీమ్​ఇండియా కొత్త కోచ్​
author img

By

Published : Sep 18, 2021, 8:22 AM IST

వచ్చే నెలలో టీ20 ప్రపంచకప్ పూర్తవగానే టీమ్ఇండియా ప్రధానకోచ్(Team India Coach)​ రవిశాస్త్రి​ పదవీ కాలం పూర్తవుతుంది. దీంతో అప్పుడే కొత్త కోచ్ వేటలో పడింది బీసీసీఐ. ఈ మేరకు స్పిన్​ దిగ్గజం అనిల్​ కుంబ్లే, మాజీ క్రికెటర్​ వీవీఎస్‌ లక్ష్మణ్‌లను సంప్రదించనున్నట్లు సమాచారం.

కుంబ్లే.. గతంలో ఏడాది పాటు (2016-17) భారత జట్టు ప్రధాన కోచ్​గా(Team India Coach)​ పనిచేశాడు. ఆ సమయంలో సచిన్‌ తెందూల్కర్‌, లక్ష్మణ్‌, గంగూలీలతో కూడిన క్రికెట్​ సలహా కమిటీ.. కుంబ్లేను నియమించింది. అయితే.. ఛాంపియన్స్​ ట్రోఫీ ఫైనల్​లో పాక్​ చేతిలో భారత్​ ఓడిపోవటం వల్ల ఆయన కోచ్​ పదవి నుంచి తప్పుకున్నాడు.

మొదటి ప్రాధాన్యం ఎవరికి?

కుంబ్లేతో పాటు మాజీ క్రికెటర్​ వీవీఎస్‌ లక్ష్మణ్‌నూ.. సంప్రదించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. లక్ష్మణ్​ ప్రస్తుతం ఐపీఎల్ హైదరాబాద్​ టీమ్ సన్​రైజర్స్​కు మెంటార్​గా ఉన్నాడు. వీరిద్దరిలో కుంబ్లేకే బీసీసీఐ మొదటి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.

"విరాట్ కోహ్లీ ఒత్తిడి వల్లే అప్పటి క్రికెట్​ సలహా కమిటీ కుంబ్లేను తొలగించింది. కానీ అది సరైన ఉదాహరణ కాదు. అయితే.. ప్రధాన కోచ్​కు(Team India Coach)​దరఖాస్తు చేసుకునేందుకు కుంబ్లే, లక్ష్మణ్​ సిద్ధంగా ఉన్నారో లేదో తెలియదు"అని బీసీసీఐ సీనియర్​ అధికారి తెలిపారు. టీ20 వరల్డ్​కప్​ తర్వాత.. టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలుగుతానని ఇదివరకే కోహ్లీ ప్రకటించాడు.

విక్రమ్ రాఠోడ్ రేస్​లో ఉన్నారా?

బ్యాటింగ్​ కోచ్ విక్రమ్​ రాథోడ్​ కూడా కోచ్​ రేస్​లో ఉన్నారా? అని అడిగిన ప్రశ్నకు.. అతను కావాలంటే దరఖాస్తు చేసుకోవచ్చని.. కానీ టీమ్​ఇండియా హెడ్​కోచ్ అయ్యే ప్రధాన లక్షణాలు ఆయనలో లేవని బీసీసీఐ సీనియర్ అధికారి తెలిపారు. ఆయన అసిస్టెంట్​ కోచ్​గా సరిగ్గా సరిపోతారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కోహ్లీ సన్నిహితుడే కాబోయే ప్రధాన కోచ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.