ETV Bharat / sports

బీసీసీఐకి మరో చిక్కు.. మూడో టెస్టు పిచ్​పైనా..!

ఇప్పటికే తొలి రెండు టెస్ట్​ పిచ్​లపై విమర్శలు రాగా ఇప్పుడు మూడో టెస్ట్ మ్యాచ్​ పిచ్​లపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ పిచ్​కు బిలో యావరేజ్ రేటింగ్ ఇవ్వాలంటూ డిమాండ్​లు వినిపిస్తున్నాయి. దీంతో బీసీసీఐకి మరో సమస్య ఎదురైనట్టైంది. ఆ వివరాలు..

Border Gavaskar trophy thrid test pitch
బీసీసీఐకి మరో చిక్కు.. మూడో టెస్టు మ్యాచ్​ పిచ్​పైనా..
author img

By

Published : Mar 3, 2023, 6:59 AM IST

బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమ్​ఇండియా తడబడుతూ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఓటమి దిశగా ముందుకెళ్తోంది. టర్నింగ్ ట్రాక్‌పై భారత బ్యాటర్లు చేతులెత్తేయడం వల్ల.. ప్రస్తుతం ప్రత్యర్థి జట్టు ఆస్ట్రేలియా ముందు 76 పరుగుల స్వల్ప లక్ష్యం మాత్రమే ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే ఈ మ్యాచ్‌లో టీమ్​ఇండియా గెలుస్తుంది. లేదంటే ఓటమిని నుంచి తప్పించుకోవడం కష్టమే.

అసలే ఇప్పుడు ఓ వైపు ఓటమి భయం వెంటాడుతుంటే.. మరోవైపు బీసీసీఐకి కొత్త చిక్కు వచ్చి పడింది! ఇండోర్ పిచ్ వల్ల బోర్డుకు కొత్త సమస్య ఎదురైంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్​ల పిచ్​లపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మూడో మ్యాచ్​ పిచ్​పై కూడా సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ పిచ్​పై.. తొలి రోజు ఆటలో 14 వికెట్లు నేలకూలగా.. రెండో రోజు 16 వికెట్లు పడ్డాయి. ఈ పిచ్​పై బంతి యావరేజ్‌గా 4.8 డిగ్రీలు టర్న్ అయింది. అలాగే గరిష్టంగా 8.8 డిగ్రీల వరకు తిరిగింది. దీంతో ఈ పిచ్‌పై మాజీ క్రికెటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆసీస్ మాజీ క్రికెటర్లు మాథ్యూ హెడెన్, ఇయాన్ చాపెల్‌తో పాటు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ కూడా ఈ పిచ్‌కు బిలో యావరేజ్ రేటింగ్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక జరిగితే టీమ్​ఇండియా డబ్ల్యూటీసీ పాయింట్స్‌లో కోతపడుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

ఇకపోతే చాపెల్ మాట్లాడుతూ.. ఈ పిచ్‌కు ఐసీసీ మ్యాచ్ రిఫరీ బిలో యావరేజ్ రేటింగ్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. బ్యాటర్లకు ఏమాత్రం అనుకూలంగా లేని ఇటువంటి పిచ్​లను తయారు చేయకూడదంటూ మండిపడ్డాడు. పిచ్​లను ఇలా తయారచేయడం వల్ల టెస్టు క్రికెట్‌ను అపహస్యం చేసినట్టు అవుతుందని పేర్కొన్నాడు.

దిలీప్ వెంగ్‌ సర్కార్ కూడా ఇదే అభిప్రాయాన్ని తెలిపాడు. "మంచి క్రికెట్‌ను వీక్షించాలనుకున్నవారికి ఇలాంటి పిచ్‌లు బాగా నిరాశను కలిగిస్తాయి. బౌలర్లు, బ్యాటర్లకు అనుకూలించేలా పిచ్​లనే సిద్ధం చేయాలి. అప్పుడే బ్యాట్ బంతికి మధ్య ఆసక్తికర పోరు జరుగుతుంది. అసలు మొదటి రోజు ఆట తొలి గంటలోనే బాల్​ ఆ రేంజ్​లో టర్న్ అవుతే అది టెస్టు క్రికెట్‌ను అవమానించినట్టే అవుతుంది" అని విమర్శించాడు.

అందుకే ఇలాంటి పిచ్​.. వాస్తవానికి ధర్మశాల వేదికగా ఈ మూడో టెస్ట్​ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ ఈ మ్యాచ్‌ను చివరి నిమిషంలో ఇక్కడకు మార్చారు. ఇప్పుడదే సమస్యగా మారినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఓ టెస్ట్ మ్యాచ్‌కు పిచ్ సిద్ధం చేయాలంటే కనీసం నెల రోజుల సమయం పడుతుంది. కానీ ఇండోర్ వేదికగా రీసెంట్​గా రంజీ మ్యాచ్‌లు నిర్వహించడం.. చివరి నిమిషంలో ఇదే వేదికకు మూడో టెస్ట్‌ మ్యాచ్​ను తరలించడంతో క్యూరేటర్‌కు పిచ్​ను సిద్ధం చేసేందుకు తగిన సమయం దొరకలేదు. అందుకే ఇలాంటి వికెట్​ను తయారు చేయాల్సి వచ్చిందని మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు చెబుతున్నాయి.

ఇదీ చూడండి: లైయన్ స్పిన్​ పంజా​.. భారత్​ ఆలౌట్​.. ఆసీస్​ టార్గెట్​ ఎంతంటే?

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.