2022-23 ఏడాదికి గాను టీమ్ఇండియా ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను బీసీసీఐ ఆదివారం విడుదల చేసింది. నాలుగు గ్రేడ్స్‌లో మొత్తం 26 మంది భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్ట్‌లో చోటు కల్పించింది. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో అదరగొట్టిన భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు ప్రమోషన్ దక్కింది. ఏ ప్లస్ గ్రేడ్ ప్లేయర్‌గా జడేజా స్థానం సొంతం చేసుకున్నాడు.
మరోవైపు గత కొంతకాలంగా వరుసగా విఫలమవుతున్న కేఎల్ రాహుల్‌కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. ఏ గ్రేడ్ నుంచి అతడిని తొలగించి బీ గ్రేడ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. మరో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య బీ గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్‌కు ప్రమోషన్ పొందాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ ఏ గ్రేడ్‌లో స్థానం నిలుపుకోగా.. వెన్ను గాయంతో జట్టుకు దూరంగా ఉన్నా బుమ్రాకు ఏ ప్లస్ గ్రేడ్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.
సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాతో పాటు గ్రేడ్ల వారీగా వార్షిక రెమ్యునరేషన్స్ కూడా ప్రకటించింది బీసీసీఐ. ఏ ప్లస్ గ్రేడ్ ఆటగాళ్లకు రూ. ఏడు కోట్లు, ఏ గ్రేడ్ ఆటగాళ్లకు రూ. ఐదు కోట్లు, బీ గ్రేడ్ ఆటగాళ్లకు రూ. 3 కోట్లు, సీ గ్రేడ్ క్రికెటర్స్‌కు రూ. కోటి రూపాయలుగా ఫీజును నిర్ణయించింది.
సెంట్రల్ కాంట్రాక్ట్‌లో చోటు దక్కించుకున్న ప్లేయర్స్ వీళ్లే!
- ఏ ప్లస్ గ్రేడ్- విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా, రవీంద్ర జడేజా
- ఏ గ్రేడ్- హార్దిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమీ, రిషభ్ పంత్, అక్షర్ పటేల్
- బీ గ్రేడ్- ఛెతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్
- సీ గ్రేడ్- ఉమేశ్ యాదవ్, శిఖర్ ధావన్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, యజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, అర్షదీప్ సింగ్, కేఎస్ భరత్
ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ ఓటమిపాలైంది. చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన జరిగిన మూడో వన్డేలో 21 పరుగుల తేడాతో టీమ్ఇండియా ఓడిపోయింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-2 తేడాతో భారత్ కోల్పోయింది. గత నాలుగేళ్లలో స్వదేశంలో టీమ్ఇండియా.. సిరీస్‌ను కోల్పోవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం టీమ్ఇండియా ఆటగాళ్లు.. ఐపీఎల్ ప్రాక్టీస్ సెషన్లో బిజీగా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కానుంది.