ETV Bharat / sports

లిఫ్టులో ఇరుక్కున్న స్మిత్.. గంటసేపు అందులోనే!

Smith stuck in Lift: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ లిఫ్టులో ఇరుక్కుపోయాడు. దాదాపు గంటసేపు లిఫ్టు పనిచేయకపోవడం వల్ల అందులోనే ఉండిపోయాడు.

author img

By

Published : Dec 31, 2021, 1:04 PM IST

Steve Smith stuck in Lift, Steve Smith latest news, లిఫ్టులో ఇరుక్కున్న స్మిత్, స్మిత్ లేటెస్ట్ న్యూస్
Steve Smith

Smith stuck in Lift: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్​కు విచిత్ర పరిస్థితి ఎదురైంది. ప్రస్తుతం యాషెస్ సిరీస్​లో ఆడుతున్న ఇతడు టీమ్ హోటల్​లోని ఓ లిఫ్టులో ఇరుక్కున్నాడు. దాదాపు గంటసేపు లిఫ్టు పనిచేయకపోవడం వల్ల అందులోనే ఉండిపోయాడు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశాడు స్మిత్.

ఏం జరిగిందంటే?

మెల్​బోర్న్ పార్క్ హయాత్ హోటల్​లో ప్రస్తుతం ఆస్ట్రేలియా ఆటగాళ్లు బస చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ పని మీద లిఫ్టు ఉపయోగించుకున్న క్రమంలో అది కాస్తా పనిచేయకుండా పోయింది. దీంతో 55 నిమిషాల పాటు లిఫ్టులోనే ఇరుక్కుపోయాడు స్మిత్. ఈ సమయంలో లబుషేన్ డోర్ల గ్యాప్ లోంచి అతడికి జెమ్స్ ఇచ్చాడు. ఇవి తింటూ, ఫోన్​తో కాలక్షేపం చేశాడు స్మిత్. టెక్నీషియన్ వచ్చి మరమ్మతులు చేశాక అతడు బయటకు వచ్చాడు.

ఇవీ చూడండి: యాషెస్​లో కరోనా కలవరం.. ఆసీస్ స్టార్ బ్యాటర్​కు పాజిటివ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.