Asian Games 2023 : ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్‌జౌ నగరంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ఆసియా గేమ్స్ ఆర్గనైజింగ్ కౌన్సిల్ అధ్యక్షుడు జావో ఝిదాన్, ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా తాత్కాలిక అధ్యక్షుడు రణ్‌ధీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇతర దేశాల ప్రతినిధులతోపాటు చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అథ్లెట్ల కవాతులో భారత క్రీడాకారుల బృందానికి.. పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ నేతృత్వం వహించారు. ఈ వేడుకల్లో భారత ప్లేయర్లంతా.. ఖాకీ రంగు గల సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. భారత మహిళలు ఖాకీరంగు చీర, పురుషులు ఖాకీరంగు కుర్తాలో వేడుకకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఈ దుస్తులను రూపొందించింది.
ఈ పోటీల్లో ఆయా క్రీడల్లో ప్రాతినిధ్యం వహించనున్న తెలుగు అథ్లెట్లు..
- బ్యాడ్మింటన్ - కిదాంబి శ్రీకాంత్, పీవీ సింధు,పుల్లెల గాయత్రి, సిక్కి రెడ్డి, సాత్విక్ సాయిరాజ్
- బాక్సింగ్ - నిఖత్ జరీన్
- ఆర్చరీ - వెన్నం జ్యోతి సురేఖ
- క్రికెట్ - తిలక్ వర్మ, బారెడ్డి అనూష
- చెస్ - పెంటేల హరికృష్ణ,హారిక ద్రోణవల్లి, కోనేరు హంపి
- టేబుల్ టెన్నిస్- ఆకుల శ్రీజ.
ఇక 45 దేశాలకు చెందిన 12 వేలకుపైగా క్రీడాకారులు 40 విభాగాల్లో పోటీపడనున్నారు. ఈసారి భారత్ నుంచి అత్యధికంగా 655 మంది ఆటగాళ్లు బరిలోకి దిగుతున్నారు. ఇక 16 రోజుల పాటు జరగనున్న ఆసియా క్రీడా సంబరాలు అక్టోబర్ ఎనిమిదో తేదీన ముగియనున్నాయి.
తొలిసారి క్రికెట్.. ఫుట్‌బాల్ తర్వాత ప్రపంచంలో అత్యంత ప్రేక్షకాదరణ కలిగిన క్రికెట్‌ను ఈసారి ఆసియా క్రీడల్లో ప్రవేశపెట్టారు. ఇక ఈ క్రీడల్లో భారత మహిళల, పురుషుల క్రికెట్ జట్లు పోటీలో ఉండనున్నాయి. అయితే ఇప్పటికే ప్రారంభమైన క్రికెట్ పోటీల్లో భారత మహిళల జట్టు.. అద్భుత విజయంతో సెమీస్‌లోకి దూసుకెళ్లింది. ఆదివారం సెమీస్ పోరులో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఇక భారత్‌లో ఆసియా క్రీడలను సోనీ స్పోర్ట్స్ టెన్ బ్రాడ్‌కాస్టింగ్ ఛానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షంచవచ్చు. ఇక ఈ ప్రతిష్ఠాత్మక క్రీడల్లో పాల్గొంటున్న భారత ప్లేయర్లకు.. ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా ఆల్ ది బెస్ట్ చెప్పారు.
-
Athletes from across the continent march with pride in the #ParadeOfTheAthletes! 🌏
— Olympic Council of Asia (@AsianGamesOCA) September 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Each NOC showcases their unique spirit and unity under the grand umbrella of sport.
Let's cheer them on as they embark on their #19thAsianGames journey! 🎉🚶♀️🚶🥳 #Hangzhou2022 #AsianGames pic.twitter.com/Be7x4b3uLe
">Athletes from across the continent march with pride in the #ParadeOfTheAthletes! 🌏
— Olympic Council of Asia (@AsianGamesOCA) September 23, 2023
Each NOC showcases their unique spirit and unity under the grand umbrella of sport.
Let's cheer them on as they embark on their #19thAsianGames journey! 🎉🚶♀️🚶🥳 #Hangzhou2022 #AsianGames pic.twitter.com/Be7x4b3uLeAthletes from across the continent march with pride in the #ParadeOfTheAthletes! 🌏
— Olympic Council of Asia (@AsianGamesOCA) September 23, 2023
Each NOC showcases their unique spirit and unity under the grand umbrella of sport.
Let's cheer them on as they embark on their #19thAsianGames journey! 🎉🚶♀️🚶🥳 #Hangzhou2022 #AsianGames pic.twitter.com/Be7x4b3uLe
-
As the Asian Games commence, I convey my best wishes to the Indian contingent. India’s passion and commitment to sports shines through as we send our largest ever contingent in the Asian Games. May our athletes play well and demonstrate in action what true sporting spirit is. pic.twitter.com/KLlsBj0C3e
— Narendra Modi (@narendramodi) September 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">As the Asian Games commence, I convey my best wishes to the Indian contingent. India’s passion and commitment to sports shines through as we send our largest ever contingent in the Asian Games. May our athletes play well and demonstrate in action what true sporting spirit is. pic.twitter.com/KLlsBj0C3e
— Narendra Modi (@narendramodi) September 23, 2023As the Asian Games commence, I convey my best wishes to the Indian contingent. India’s passion and commitment to sports shines through as we send our largest ever contingent in the Asian Games. May our athletes play well and demonstrate in action what true sporting spirit is. pic.twitter.com/KLlsBj0C3e
— Narendra Modi (@narendramodi) September 23, 2023
Asian Games 2023 : అతి పెద్ద క్రీడా పండగ వచ్చేసింది.. మనోళ్లు పతకాల సెంచరీని అందుకుంటారా?
Asian Games Cricket : షెఫాలీ వర్మ మెరుపులు.. సెమీస్‌కు దూసుకెళ్లిన టీమ్ఇండియా!