2023 Asia Cup Schedule: దాయాదుల మధ్య సమరం ఎందుకు అంత రసవత్తరంగా ఉంటుందో చెప్పడానికి ప్రత్యేకించి పరిచయాలు అక్కర్లేదు. గతేడాది ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా ముగిసిన మ్యాచ్ ఇరు దేశాల మధ్య మ్యాచ్‌లకు ఉండే క్రేజ్‌కు సజీవ సాక్ష్యం. ఈ మెగా పోరు తర్వాత మళ్లీ భారత్-పాక్ లు ఎప్పుడు తలపడతాయి..? అన్న ప్రశ్నకు బీసీసీఐ కార్యదర్శి జై షా సమాధానాలు చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ ఏడాది ఆసియా కప్‌లో ఇండియా-పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయని ఆయన ఖాయం చేశాడు.
ఆసియా కప్-2023 (వన్డే ఫార్మాట్)లో భాగంగా ఈ రెండు జట్లూ తలపడనున్నాయి. సెప్టెంబర్‌లో జరగాల్సి ఉన్న ఈ మెగా టోర్నీలో భారత్, పాక్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. గతేడాది మాదిరిగానే ఆరు జట్లతో ఈ టోర్నీని నిర్వహించనున్నారు. భారత్, పాక్‌తో పాటు క్వాలిఫయిర్ ఓ గ్రూప్‌లో ఉండగా శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లు మరో గ్రూప్‌లో ఉన్నాయి.
ఈ మేరకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడిగా ఉన్న జై షా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని స్పష్టం చేశాడు. 2023, 2024 సంవత్సరాలకు గాను ఏసీసీ నిర్వహించబోయే షెడ్యూల్ వివరాలను ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ సందర్భంగా షా తన ట్వీట్లో.. '2023, 2024 సంవత్సరాలకు గాను ఏసీసీ క్రికెట్ క్యాలెండర్‌ను మీకు పరిచయం చేస్తున్నా. ఆటను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు గాను మా అసమానమైన ప్రయత్నాలను ఇది సూచిస్తుంది...'అని పేర్కొన్నాడు. 2023తో పాటు 2024లో జరగబోయే ఆసియా కప్ (టీ20 ఫార్మాట్)లో కూడా భారత్, పాక్‌లు ఒకే గ్రూప్ లో ఉండటం గమనార్హం. కానీ అప్పుడు ఈ టోర్నీలో 8 దేశాలు పాల్గొననున్నాయి.
-
Presenting the @ACCMedia1 pathway structure & cricket calendars for 2023 & 2024! This signals our unparalleled efforts & passion to take this game to new heights. With cricketers across countries gearing up for spectacular performances, it promises to be a good time for cricket! pic.twitter.com/atzBO4XjIn
— Jay Shah (@JayShah) January 5, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Presenting the @ACCMedia1 pathway structure & cricket calendars for 2023 & 2024! This signals our unparalleled efforts & passion to take this game to new heights. With cricketers across countries gearing up for spectacular performances, it promises to be a good time for cricket! pic.twitter.com/atzBO4XjIn
— Jay Shah (@JayShah) January 5, 2023Presenting the @ACCMedia1 pathway structure & cricket calendars for 2023 & 2024! This signals our unparalleled efforts & passion to take this game to new heights. With cricketers across countries gearing up for spectacular performances, it promises to be a good time for cricket! pic.twitter.com/atzBO4XjIn
— Jay Shah (@JayShah) January 5, 2023
వేదికపై రాని స్పష్టత..
ఏసీసీ రెండేళ్ల షెడ్యూల్ విడుదల చేసిన జై షా మరి ఈ ఏడాది ఆసియా కప్ ఎక్కడ నిర్వహిస్తారనేది మాత్రం ప్రస్తావించలేదు. ట్వీట్లో ఆయన షేర్ చేసిన సమాచారంలో కూడా లేదు. వాస్తవానికి ఈ ఏడాది ఆసియా కప్‌కు పాక్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే పాక్‌లో ఈ టోర్నీ జరిగితే భారత్ రాదని ఇప్పటికే జై షా ప్రకటన చేశారు. పాక్‌కు వచ్చే ప్రసక్తే లేదని, తటస్థ వేదికపై అయితేనే ఆసియా కప్ ఆడతామన్న బీసీసీఐ.. మరి ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.