ETV Bharat / sports

Asia Cup 2023 India VS Nepal : సూపర్ క్యాచెస్​.. కోహ్లీ సింగిల్ హ్యాండ్​తో​.. రోహితేమో.. - ఆసియా కప్ రోహిత్ క్యాచ్ వైరల్​

Asia Cup 2023 India VS Nepal : ఆసియా కప్​ 2023లో భాగంగా నేడు(సెప్టెంబర్ 4) నేపాల్​తో జరుగుతున్న మ్యాచ్​లో టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ కోహ్లీ రెండు సూపర్ క్యాచ్​లు పట్టారు. ఆ వీడియోలు చూశారా?

Asia Cup 2023 India VS Nepal : సూపర్ క్యాచెస్​.. కోహ్లీ సింగిల్ హ్యాండ్​తో​.. రోహితేమో..

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 4, 2023, 7:35 PM IST

Asiacup 2023 IND VS Nepal : ఆసియా కప్​ 2023లో భాగంగా నేడు(సెప్టెంబర్ 4) జరుగుతున్న మ్యాచ్​లో టీమ్​ఇండియా ఫీల్డర్లు పేలవ ప్రదర్శన చేశారు. దీంతో ఈ అవకాశాన్ని నేపాల్ ఓపెనర్లు వినియోగించుకుంటూ మంచి స్కోర్ చేశారు. ఓపెనర్లు కుశాల్‌ భుర్తాల్‌(38), ఆసిఫ్‌ షేక్‌(58) మంచి స్కోర్లను అందుకుని జట్టును మెరుగైన స్థితిలో నిలిపారు. అయితే ఈ క్రమంలోనే టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ కోహ్లీ మాత్రం రెండు సూపర్ క్యాచ్​లు పట్టారు.

Asiacup 2023 IND VS Nepal Kohli Catch : టీమ్​ఇండియా మాజీ కెప్టెన్‌, స్టార్ బ్యాటర్​ విరాట్‌ కోహ్లీ మరో రికార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్​లో ఆసిఫ్‌ షేక్‌ క్యాచ్‌ పట్టడంతో విరాట్​ మల్టీ నేషనల్‌ వన్డే టోర్నమెంట్లలో 100 క్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు. భారత మాజీ సారథి మొహ్మద్​ అజహారుద్దీన్‌ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో నాన్‌ వికెట్‌కీపర్‌గా రికార్డుకెక్కాడు. నేపాల్‌ ఇన్నింగ్స్‌ 30వ ఓవర్‌లో మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌లో కోహ్లీ ఈ క్యాచ్‌ను పట్టుకున్నాడు. బంతి బ్యాట్‌ ఎడ్జ్‌కు తాకి గాల్లోకి ఎగరగా విరాట్​ ఒంటి చేత్తో ఆ క్యాచ్‌ను అందుకున్నాడు. అంతకుముందు కోహ్లీ ఓసారి ఆసిఫ్‌ షేక్‌ బాదిన సునాయాస క్యాచ్‌ను జారవిడిచాడు. ఫైనల్​గా హాఫ్‌ సెంచరీ సాధించి క్రీజులో పాతుకుపోయిన ఆసిఫ్‌ (58; 8 ఫోర్లు) వికెట్‌ దక్కడంతో టీమ్​ఇండియా బ్రేక్‌ లభించినట్టైంది.

Asiacup 2023 IND VS Nepal Rohith Catch : ఈ మ్యాచ్​లో రోహిత్‌ శర్మ అందుకున్న క్యాచ్‌ కూడా హైలైట్‌గా నిలిచింది. నేపాల్‌ ఇన్నింగ్స్‌ 20వ ఓవర్​లో.. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో వన్‌డౌన్‌ బ్యాటర్‌, కెప్టెన్‌ రోహిత్‌ పౌడేల్‌ బంతిని కాస్త తప్పుగా అంచనా వేశాడు. బ్యాక్‌ఫుట్‌ షాట్‌ ఆడబోయి ఫస్ట్‌ స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న హిట్​ మ్యాన్​​ వైపు బాదాడు. దీంతో ఈ సింపుల్‌ క్యాచ్‌ను హిట్​ మ్యాన్ రోహిత్ పట్టేసి.. సంబరాలు చేసుకున్నాడు. దీంతో ఇక నేపాల్‌ కెప్టెన్‌ రోహిత్‌(5) నిరాశగా పెవిలియన్‌ చేరాడు. అయితే ఇక్కడ రోహిత్ రియాక్షన్ బాగా ట్రెండ్ అయింది. ఈ రెండు క్యాచ్​లకు సంబంధించిన వీడియోలు సోషల్​మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. అభిమానులు వీటిని తెగ షేర్ చేస్తున్నారు.

మూడు గోల్డెన్ క్యాచ్​లు డ్రాప్​.. శ్రేయస్‌ అయ్యర్‌, విరాట్‌ కోహ్లీ, వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ మూడు గోల్డెన్‌ క్యాచ్‌లను డ్రాప్‌ చేశారు. ఆసిఫ్‌, కుశాల్‌ బాదిన ఈజీ క్యాచ్‌లను వదిలేశారు. నేపాల్‌ ఇన్నింగ్స్‌ మొదటి, రెండో, ఐదో ఓవర్లో ఈ తప్పిదాలు జరిగాయి. ఈ క్రమంలోనే లైఫ్‌ పొందిన కుశాల్‌(38) చేశాడు. కానీ చివరికి పదో ఓవర్‌లో శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో ఇషాన్‌ కిషన్‌ చేతికే చిక్కాడు. ఇక ఆసిఫ్‌(58) క్యాచ్​ను మొదటి సారి మిస్ చేసిన కోహ్లీ రెండో సారి సింగిల్ హ్యాండ్​తోనే పట్టేశాడు.

Asia Cup 2023 : నేపాల్‌తో మ్యాచ్‌.. టాస్‌ గెలిచిన భారత్.. తుది జట్లు ఇవే

Jasprit Bumrah Baby : తండ్రిగా బుమ్రాకు ప్రమోషన్.. పేరేంటో తెలుసా?

Asia Cup 2023 Ban vs Afg : బంగ్లా సూపర్ పంచ్.. అఫ్గాన్​పై బంపర్ విక్టరీAsia Cup 2023 Ban vs Afg : బంగ్లా సూపర్ పంచ్.. అఫ్గాన్​పై బంపర్ విక్టరీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.