Asia Cup 2023 IND VS BAN : 2023 ఆసియా కప్‌లో భారత్ తొలి ఓటమిని చవిచూసింది. బంగ్లాతో ఆసక్తిగా సాగిన నామమాత్రపు పోరులో ఆరు పరుగుల తేడాతో ఓడింది. గిల్(121; 133 బంతుల్లో 8×4, 5×6) అద్భుత పోరాటం చేసినా వృథా అయింది. దీంతో బంగ్లా విజయం సాధించింది.
266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియాలో ఇతర బ్యాటర్ల నుంచి ఎలాంటి సహకారం రాకపోయినా.. గిల్ మాత్రం అద్భుత సెంచరీతో టీమ్‌ఇండియాను గెలిపించడానికి విశ్వప్రయత్నం చేశాడు. అక్షర్ పటేల్(42; 34 బంతుల్లో 3×4, 2×6) కూడా చివర్లో గొప్పగా పోరాడాడు. కానీ ఛేదనలో టీమ్‌ఇండియా కొద్ది దూరంలో ఆగిపోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఇక తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, జడేజా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. కేఎల్ రాహుల్ (19), సూర్యకుమార్ యాదవ్ (26), అక్షర్ పటేల్ ఫర్వాలేదనిపించారు. దీంతో భారత్.. 49.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్లలో ముస్తఫిజుర్ 3 వికెట్లు పడగొట్టగా... అరంగేట్ర బౌలర్ తన్‌జీమ్, మెహదీ హసన్ చెరో 2 వికెట్లు తీశారు. ఇకపోతే ఈ మ్యాచ్‌లో కోహ్లీ, బుమ్రా, హార్దిక్, సిరాజ్, కుల్‌దీప్‌లకు విశ్రాంతి నిచ్చారు. తిలక్ వర్మ, షమి, సూర్యకుమార్, శార్దూల్, ప్రసిద్ధ్ కృష్ణలకు అవకాశమిచ్చారు. ఈ మ్యాచ్‌తోనే తిలక్ వన్డే అరంగేట్రం చేశాడు. కానీ ఇతడు తన అరంగేట్ర మ్యాచ్‌లోనే నిరాశపరిచాడు. కాగా, టీమ్‌ఇండియా ఆదివారం జరిగే ఫైనల్లో శ్రీలంకతో తలపడనుంది.
ఇకపోతే అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు చేసింది. షకీబ్ (80; 85 బంతుల్లో 6×4, 3×6) కెప్టెన్ ఇన్సింగ్స్ ఆడి అదరగొట్టాడు. హృదయ్ (54; 81 బంతుల్లో 5×4, 2×6) హాఫ్ సెంచరీతో రాణించగా.. నసుమ్ అహ్మద్ (44*; 45 బంతుల్లో 6×4, 1×6), మెహెది హసన్ (29*) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో శార్దుల్ ఠాకుర్ 3 వికెట్లు పడగొట్టాడు. షమీ రెండు వికెట్లు తీయగా.. ప్రసిద్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.
-
A fine innings calls for a finer celebration 👏💪⚡️
— BCCI (@BCCI) September 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Keep at it, @ShubmanGill.#TeamIndia #AsiaCup2023 pic.twitter.com/3e7F4tPnA6
">A fine innings calls for a finer celebration 👏💪⚡️
— BCCI (@BCCI) September 15, 2023
Keep at it, @ShubmanGill.#TeamIndia #AsiaCup2023 pic.twitter.com/3e7F4tPnA6A fine innings calls for a finer celebration 👏💪⚡️
— BCCI (@BCCI) September 15, 2023
Keep at it, @ShubmanGill.#TeamIndia #AsiaCup2023 pic.twitter.com/3e7F4tPnA6