ETV Bharat / sports

Asia Cup 2023 : ఆసియా కప్​నకు రంగం సిద్ధం.. ఈ టోర్నీలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్స్​ వీరే! - ఆసియా కప్​ 2023 టీమ్స్​

Asia Cup 2023 : మినీ టోర్నీకి సర్వం సిద్ధమైంది. ఆసియా ఖండంలోని ఆరు దేశాలు తలపడే ఆసియా కప్‌ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. తొలిసారి 1984లో మొదలైన ఆసియా కప్ ఎన్నో కష్టాలను ఓర్చి మరీ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఈ ఫార్మాట్​లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన టాప్​ ప్లేయర్స్​ ఎవరంటే ?

Asia Cup 2023
Asia Cup 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 29, 2023, 10:16 PM IST

Updated : Aug 30, 2023, 8:24 AM IST

Asia Cup 2023 : ఆ మినీ టోర్నీ మొదలై ఇప్పటికి దాదాపు 40 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో అడ్డంకులను దూరం చేసుకుంటూ తన ఉనికిని కాపాడుకుంటూ వచ్చిన ఆ టోర్నీ ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా ముందుకు సాగుతోంది. అదే ఆసియా కప్​ టోర్నీ. ఆసియా దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు ఉన్నతస్థాయికి చేరుకొనేందుకు 'ఆసియా క్రికెట్‌ కౌన్సిల్' అమలు చేసిన ఓ మహత్తరమైన ఆలోచనే ఈ ఆసియా కప్​. అయితే కేవలం మూడు జట్లతోనే ప్రారంభమైన ఈ టోర్నీ ఇప్పుడు.. ఆరు టీమ్‌లతో పోటీలు నిర్వహించే స్థాయికి ఎదిగింది.

1984లో తొలిసారిగా ఈ ఆసియా కప్‌ ప్రారంభమైంది. ఇక ఆ తర్వాత 1986, 1988, 1990 వరకు ప్రతి రెండేళ్లకొకసారి ఈ టోర్నీని నిర్వహించేవారు. అయితే 1990లో గ్యాప్​ తీసుకున్న ఈ టోర్నీ దాదాపు ఐదేళ్ల తర్వాత 1995లో మళ్లీ పునఃప్రారంభమైంది. మళ్లీ రెండేళ్లకు 1997లో జరిగింది. మరోసారి మూడేళ్ల గ్యాప్​ తీసుకుని 2000లో మరోసారి నిర్వహించారు.

ఆ తర్వాత వివిధ కారణాల వల్ల మరో టోర్నీని 2004లో నిర్వహించారు. ఇలా షెడ్యూల్​లో కీలక మార్పులు జరిగాక.. ఈ టోర్నీని నాలుగేళ్ల తర్వాత 2008లో నిర్వహించారు. ఆ తర్వాత ప్రతి రెండేళ్లకొకసారి (2010, 2012, 2014, 2016) నిర్వహించడం జరిగింది. అయితే మళ్లీ నాలుగేళ్ల గ్యాప్​ రావడం వల్ల 2022లో ఓ ఆసియా కప్‌ టోర్నీని నిర్వహించారు. వీటన్నింటిలో కేవలం రెండుసార్లు మాత్రమే (2016, 2022) టీ20 ఫార్మాట్‌లో ఆడారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఈ ఫార్మాట్​లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన టాప్​ ప్లేయర్స్​ ఎవరంటే ?

  1. ఇప్పటి వరకు జరిగిన టోర్నీల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన టాప్​ ప్లేయర్​గా శ్రీలంక జట్టుకు చెందిన మహేల జయవర్థెనె రికార్డుకెక్కాడు. అతను ఈ టోర్నీలో మొత్తం 28 మ్యాచ్‌లు ఆడాడు. ఆ తర్వాత సనత్ జయసూర్య 25 మ్యాచులు ఆడి 1,220 పరుగులు చేయగా.. ఈ రికార్డుతో ఆసియా కప్‌లో టాప్‌ స్కోరర్​గా జయసూర్య చరిత్రకెక్కాడు.
  2. కెప్టెన్‌గా ఎక్కువ మ్యాచ్​లకు సారథ్యం వహించిన ప్లేయర్​గా ఎంఎస్​ ధోనీ.. తన పేరిట ఓ రికార్డును లిఖించుకున్నాడు. ఆసియా కప్‌లో భారత్ ఆడిన 14 మ్యాచులకు ధోని కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు.
  3. ఇక రోహిత్ శర్మ ప్లేయర్‌గా ఇప్పటి వరకు 22 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో గతేడాది కెప్టెన్‌గా చేసిన ఐదు మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ సారి కూడా రోహిత్ నాయకత్వంలోనే భారత్ ఆడనుంది.
  4. క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ ఇప్పటి వరకు భారత్‌ తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడాడు. సచిన్ 23 మ్యాచుల్లో 971 పరుగులు సాధించాడు. ఇవన్నీ వన్డేలు కావడం విశేషం.
  5. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ ఆసియా కప్‌లో 22 వన్డేలు ఆడాడు. అయితే, మరో పది మ్యాచ్‌లు టీ20 ఫార్మాట్‌లో ఆడటం విశేషం. అన్ని మ్యాచ్‌లను లెక్కలోకి తీసుకుంటే మహేల జయవర్థెనె (28 మ్యాచ్‌లు) కంటే రోహిత్ శర్మనే అత్యధిక మ్యాచ్‌లు ఆడినట్లు.
  6. ఆసియా కప్​లో 19 వన్డేలు, ఐదు టీ20లు ఆడిన ధోనీ.. ఇందులో 14 వన్డేలకు కెప్టెన్‌గా చేశాడు. ఐదు టీ20లూ అతడి సారథ్యంలోనే టీమ్‌ఇండియా తలపడింది.
  7. మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ కూడా 18 ఆసియా కప్‌ వన్డే మ్యాచ్‌లు ఆడాడు. మిడిలార్డర్‌లో వచ్చే ఈ టాప్​ ప్లేయర్​.. మొత్తం 468 పరుగులు చేశాడు. కొన్ని మ్యాచ్‌లకు నాయకత్వ బాధ్యతలను కూడా చేపట్టాడు.
  8. స్పిన్‌ దిగ్గజం అనిల్‌ కుంబ్లే ఆసియా కప్‌లో 15 మ్యాచ్‌లు ఆడాడు. అయితే, ఇక్కడ కుంబ్లే ప్రదర్శన ఏమంత గొప్పగా లేదు. కేవలం 14 వికెట్లను మాత్రమే పడగొట్టాడు.
  9. ప్రస్తుత ఆసియా కప్‌ జట్టులో ఉన్న రవీంద్ర జడేజా ఇప్పటి వరకు 14 వన్డేలు ఆడాడు. ఆల్‌రౌండర్ పాత్ర పోషించే జడ్డూ 157 పరుగులు, 19 వికెట్లు తీశాడు. ఏడు టీ20లు కూడా జడ్డూ ఆడాడు.
  10. టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ 11 వన్డేలు ఆడాడు. మరో పది టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో కొన్ని మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. వన్డేల్లో మొత్తం 613 పరుగులు చేసిన విరాట్.. ఈసారి మరింత దూకుడుగా ఆడతాడనడంలో సందేహం లేదు.
  11. ప్రస్తుత ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్ (13)తోపాటు సౌరభ్ గంగూలీ, గౌతమ్‌ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్‌ కూడా పదమూడేసి మ్యాచ్‌లు ఆడారు. దినేశ్ కార్తిక్ (12), ఇర్ఫాన్‌ పఠాన్ (12) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
  • Get ready to witness cricketing brilliance as India unveils its power-packed squad for the upcoming Men's ODI #AsiaCup2023!

    The mix of experience and youth, guided by stellar leadership, is primed to dominate the cricketing arena! 🇮🇳#ACC pic.twitter.com/ch6Fj6fQG6

    — AsianCricketCouncil (@ACCMedia1) August 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Asia Cup 2023 : భారత్​ 7.. శ్రీ లంక 6.. ఈ సారి ఆసియా కప్​ ఎవరికి దక్కనుందో ?

Rohit Sharma ODI World Cup 2023 : 'ఆ విషయం తెలిసి నా గుండె బద్ధలైంది'

Last Updated : Aug 30, 2023, 8:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.