ETV Bharat / sports

రామ్​చరణ్​ అలా చేసేవారు.. నాటి సంగతుల్ని గుర్తుచేసుకున్న యువ హీరో - ఆలీతో సరదాగా ఆకాశ్ పూరీ

తాను నటించిన 'చోర్​బజార్'​ త్వరలోనే రిలీజ్​ అవ్వనున్న నేపథ్యంలో ఆలీతో సరదాగా కార్యక్రమానికి విచ్చేసి పలు ఇంట్రెస్టింగ్​ విషయాలు చెప్పాడు పూరి జగన్నాథ్​ తనయుడు, యువ హీరో ఆకాశ్. మెగాహీరో రామ్​చరణ్​తో తనకు ఉన్న బంధాన్ని తెలిపాడు! దానికి సంబంధించిన ప్రోమో చూసేయండి..

ramcharan
రామ్​చరణ్​
author img

By

Published : Jun 9, 2022, 9:02 AM IST

Updated : Jun 9, 2022, 10:49 AM IST

ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడిగా తెరంగేట్రం చేసి.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఆకాశ్‌. పలు సూపర్‌హిట్‌ చిత్రాల్లో బాల నటుడిగా మెరిసిన ఆయన 'ఆంధ్రాపోరి' సినిమాతో హీరోగా మారాడు. ఆయన నటించిన తాజా చిత్రం 'చోర్‌ బజార్‌' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆకాశ్‌ 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేశాడు. వ్యక్తిగత, వృత్తిపరమైన విశేషాలు పంచుకున్నాడు.

'ధోనీ' సినిమాకుగానూ తొలిసారి పారితోషకం అందుకున్నానని చెప్పాడు ఆకాశ్​. తన తండ్రి దర్శకుడుకాక ముందు ఓ సీనియర్‌ నటిని చూసేందుకు ప్రయత్నించగా సెక్యూరిటీ అక్కడి నుంచి పంపించేశారని, ఇప్పుడు ఆ నటితో తాను కలిసి నటించడం అదృష్టమని పేర్కొన్నాడు. పదో తరగతికే ఎంబీబీఎస్‌ చేసినట్టు ఫీలయ్యానని, అందుకే జిమ్‌లో పార్ట్‌టైమ్‌ జాబ్‌ చేశానని తెలిపాడు. నటుడు రామ్‌చరణ్‌ తనకు పలు రకాలుగా హెయిర్‌ స్టైల్‌ చేసేవారని నాటి సంగతులు గుర్తుచేసుకున్నాడు. ఈ ఆసక్తికర ఇంటర్వ్యూ జూన్‌ 13న 'ఈటీవీ'లో రాత్రి 9: 30 గం.లకు ప్రసారంకానుంది.

ఇదీ చూడండి: 'రూ.10 కోసం అమ్మ పడిన కష్టం చూశా.. అందుకే ఆ లక్ష్యంతో పనిచేస్తున్నా...'

Last Updated : Jun 9, 2022, 10:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.