అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో పాకిస్థాన్‌కు ఘోర పరాభవం ఎదురైంది. షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో పసికూన చేతిలో పాక్ జట్టు.. ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అయితే సీనియర్లు లేని లోటు.. పాకిస్థాన్ టీమ్‌పై గట్టి ప్రభావం చూపించింది. షాదాబ్‌ఖాన్ కెప్టెన్సీలో ఆ జట్టు ఘోర ప్రదర్శన కనబరించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. ఇమాద్ వసీమ్(18), షాదాబ్ ఖాన్(23), సయీమ్ అయూబ్(17), తయూబ్ తాహిర్(16) మాత్రమే రెండు అంకెల స్కోరు దాటారు. మిగతావారు దారుణంగా విఫలమయ్యారు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్, నబీ, ఫజల్లా ఫరుఖీలు రెండు వికెట్లు పడగొట్టారు. అజ్మతుల్లా, నవీన్ హుల్ హక్, రషీద్ ఖాన్లు తలా ఒక వికెట్ తీశారు.
స్పల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్ జట్టు 17.5 ఓవరల్లోనే నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించేసింది. మహ్మద్ నబీ 38 పరుగుల నాటౌట్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. నజీబుల్లా జర్దన్ 17 నాటౌట్, రహమనుల్లా గుర్బాజ్ 16 పరుగులు చేశారు. ఇషానుల్లా రెండు వికెట్లు పడగొట్టగా.. నసీమ్ షా, ఇమాద్ వసీమ్‌లు చెరొక వికెట్ తీశారు.
కాగా, టీ20ల్లో పాకిస్థాన్‌ను ఓడించడం అఫ్గానిస్థాన్‌కు ఇదే తొలిసారి కావడం విశేషం. పాక్‌కు కూడా టీ20ల్లో ఇది ఐదో అత్యల్ప స్కోరు. ఆల్‌రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టిన మహ్మద్ నబీ.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే ఆదివారం.. ఇరు జట్ల మధ్య రెండో వన్డే.. ఆదివారం జరగనుంది.
గెలిచి ఓడిన పాక్!
సుమారు ఆరు నెలలుగా భారత, పాక్ క్రికెట్ బోర్డుల మధ్య నలుగుతున్న ఆసియా కప్ నిర్వహణ వివాదం ఓ కొలిక్కి వచ్చినట్టే ఉంది. ఈ మెగా టోర్నీని పాకిస్థాన్‌లో జరిపితే తాము వెళ్లే ప్రసక్తే లేదని పంతం పట్టిన బీసీసీఐ.. అందుకు అనుకూలంగానే తన మాట నెగ్గించుకుంది. ఇక టీమ్ఇండియా పాకిస్థాన్‌కు రావాల్సిందేనని, లేకుంటే తాము కూడా వన్డే వరల్డ్ కప్‌కు అక్కడికి వెళ్లబోమని చెప్పిన పాక్.. భారత్ లేకుండానే తమ దేశంలో ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.
షెడ్యూల్ ప్రకారమైతే టోర్నీ.. ఈ ఏడాది పాకిస్థాన్ వేదికగా జరగాల్సి ఉంది. అయితే ఈ టోర్నీని పాక్‌లో నిర్వహిస్తే తాము ఆడబోమని, తటస్థ వేదిక అయితేనే ఆసియా కప్ ఆడతామని బీసీసీఐ తేల్చి చెప్పింది. అందుకు అనుకూలంగానే నిర్ణయం వచ్చింది. గురువారం రాత్రి దుబాయ్ వేదికగా బీసీసీఐ, పీసీబీలతో ఏసీసీ కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం అనంతరం.. ఆసియా కప్ షెడ్యూల్ ప్రకారమే పాక్‌లోనే జరుగుతుందని, కానీ భారత్ ఆడబోయే మ్యాచ్‌లు మాత్రం తటస్థ వేదికలపై జరుగుతాయని ఏసీసీ వర్గాలు తెలిపాయి!