ETV Bharat / sports

ఈ ఐదు మార్పులతో టెస్టు క్రికెట్​కు మరింత మజా!

author img

By

Published : Sep 6, 2021, 11:57 AM IST

టెస్టు క్రికెట్​ను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఐదు మార్పులు చేస్తే సుదీర్ఘ ఫార్మాట్​ను అభిమానులు మరింతగా ఆదరిస్తారని నిపుణులు చెబుతున్నారు. మరి ఏ మార్పులు చేస్తే టెస్టు క్రికెట్ ఆదరణ పెరుగుతుందో తెలుసుకుందాం.

test match
టెస్టు మ్యాచ్

వన్డే, టీ20 ఫార్మాట్​కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో టెస్టు క్రికెట్​ మరుగున పడుతుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సుదీర్ఘ ఫార్మాట్​ను ఆదరించే అభిమానుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని చెబుతున్నారు. అయితే.. ఈ ఫార్మాట్​ను సజీవంగా ఉంచేందుకు చాలా మార్పులు తీసుకొస్తున్నారు నిర్వాహకులు. టెస్టు క్రికెట్​ను మరింత ఆసక్తికరంగా మలిచేందుకు ఓ ఐదు మార్పులు తీసుకురావాలని కొందరు చెబుతున్నారు. ఆ ఐదు మార్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఫ్రీ హిట్

పరిమిత ఓవర్ల మ్యాచ్​లో.. బౌలర్​ నో బాల్​ వేసినప్పుడు 'ఫ్రీ హిట్'(Free hit Rules)​ అవకాశం ఉంటుంది. అంటే బౌలర్​ ఎక్స్​ట్రా బంతి వేయాల్సి ఉంటుంది. ఈ బంతిని బ్యాట్స్​మన్​ ఎదుర్కొన్నప్పుడు కేవలం రనౌట్​ అయితేనే దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. మిగతా విధానాల్లో ఔటయితే దాన్ని ఔట్​గా నిర్ధరించరు.

కానీ, సుదీర్ఘ ఫార్మాట్​లో ఇలా కాదు. బౌలర్​ చేసిన తప్పిదానికి బ్యాట్స్​మన్​ ఇబ్బందుల్లో పడే సందర్భాలు ఎదురవుతాయి. ఒకవేళ బౌలర్​ నోబాల్ వేస్తే.. ఆ బంతిని లెక్కలోకి పరిగణించకుండా ఎక్స్​ట్రా బంతి వేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎక్స్​ట్రా బంతికి ఔట్​ అయినా బ్యాట్స్​మన్​ పెవిలియన్​కు చేరాల్సిందే.

2. లెగ్​ సైడ్ వైడ్​లు

టెస్టులతో పోల్చితే.. వన్డే, టీ 20ల్లో లెగ్​ సైడ్​ వైడ్​ల పరిమితులు భిన్నంగా ఉంటాయి. టెస్టుల్లో బంతిని వైడ్​గా పరిగణించడం చాలా అరుదుగా చూస్తుంటాం. అదే వన్డే, టీ20ల్లో అయితే.. బంతి కాస్త లెగ్​ సైడ్​ దిశగా వెళితే చాలు దాన్ని వైడ్​గానే పరిగణిస్తారు.

ఈ క్రమంలో సుదీర్ఘ ఫార్మాట్​లో.. షార్ట్​ పిచ్​ బంతులు, బౌన్సర్లు వేసి బ్యాట్స్​మన్​ను టార్గెట్​ చేస్తుంటారు బౌలర్లు. లెగ్​సైడ్​ వైడ్ నిబంధనలను టెస్టుల్లో పెడితే బౌలర్లకు ఈ అవకాశం ఉండదు.

3. రిజర్వ్​ డే

వరల్డ్​ టెస్టు ఛాంపియన్​షిప్​(World Test Championship) ఫైనల్లో వర్షం కారణంగా ఐదు రోజులు జరగాల్సిన మ్యాచ్​కు అంతరాయం ఏర్పడితే రిజర్వ్​ డే అనేది పెడతారు. కానీ, క్వాలిఫయింగ్ స్టేజ్​లో ఈ అవకాశం లేదు. ఈ నియమాన్ని కూడా అమలు చేస్తే సుదీర్ఘ ఫార్మాట్​పై ఆసక్తి పెరుగుతుంది.

4. సబ్​స్టిట్యూట్ రూల్

2005లో సూపర్​-సబ్​(Substitute Rule in Cricket) అనే నియమాన్ని క్రికెట్​కు పరిచయం చేశారు. దీంతో.. రిజర్వ్ బెంచ్ ఆటగాడు ఎప్పుడైనా జట్టులోకి సబ్​స్టిట్యూట్​గా చేరే అవకాశం ఉంటుంది. అయితే.. ఈ నియమంపై విమర్శలే ఎక్కువగా వచ్చాయి. దీనివల్ల ఒకటీమ్​కు ఎక్కువగా లాభం జరుగుతుందని చాలా మంది అభిప్రాయపడ్డారు.

5. స్టంప్ మైక్ కామెంట్రీ

స్పిన్​ బౌలింగ్ సమయంలో స్టంప్​ మైక్​ వాల్యూమ్​ను పెట్టే అవకాశం బ్రాడ్​కాస్టర్ల చేతిలో ఉంటుంది. ఈ సమయంలో కీపర్​కు బౌలర్​కు మధ్య లేదా కీపర్​కు టీమ్ వాళ్లకు మధ్య జరిగే సంభాషణలు ఫన్నీగా ఉంటాయి. ఇది మ్యాచ్​ చూసే వాళ్లకు మరింత ఉత్సాహాన్నిస్తుంది.

ఇదీ చదవండి:

'కోహ్లీసేన టెస్ట్​ క్రికెట్​కు ప్రాణం పోసింది'

Paralympics 2021: మనోళ్లు పతకాల ప్రభంజనం.. చరిత్రలోనే తొలిసారి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.