ETV Bharat / sports

'వ్యాయామాలతో రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చు'

వ్యాయామాలతో రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చని చెబుతోంది భారత షట్లర్​ పీవీ సింధు. ప్రస్తుతం కరోనాకు మందు లేని కారణంగా మనలోని ఇమ్యూనిటీ పవర్​ను పెంచుకోవడమే ఉత్తమమని తెలిపింది. దానికి తగ్గట్లుగా ప్రతి ఒక్కరూ రోజూ కసరత్తులు చేయాలని విజ్ఞప్తి చేసింది.

Sports can help win battle against COVID-19 pandemic: Sindhu
'వ్యాయామాలతో రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చు'
author img

By

Published : Jun 22, 2020, 6:24 PM IST

కరోనాపై పోరాటంలో క్రీడలు ఎంతగానో తోడ్పడతాయని తెలిపింది భారత బ్యాడ్మింటన్​ స్టార్​ పీవీ సింధు. రోజులో కొంత సమయం వ్యాయామానికి కేటాయించడం వల్ల మనలోని రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని సూచించింది. తాజాగా వర్చువల్​ హెల్త్​కేర్​ , హైజీన్​ ఎక్స్​పో-2020 ప్రారంభోత్సవంలో పాల్గొన్న సింధు క్రీడల ప్రాముఖ్యాన్ని తెలియజేసింది.

"కరోనాకు ప్రస్తుతం మెడిసిన్ అందుబాటులో లేని కారణంగా మనలోని రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే ఉత్తమమైన మార్గం. క్రీడలు, ఇతర శారీరక శ్రమ వల్ల రోగనిరోధక శక్తిని మరింతగా పొందవచ్చు. 300 నిమిషాల పాటు ఏరోబిక్​ పనులు చేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, అధిక రక్తపోటు, కేన్సర్​ బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) ఇటీవలే ప్రకటించింది. ప్రస్తుత విరామ సమయంలో కసరత్తులు చేయమని ప్రతి ఒక్కరికీ సూచిస్తున్నా. క్రీడాకారిణిగా చెప్పాలంటే రోజుకు 45 నిమిషాల పాటు వ్యాయామం ముఖ్యమని భావిస్తా".

- పీవీ సింధు, భారత బ్యాడ్మింటన్​ క్రీడాకారిణి

లాక్​డౌన్​ కారణంగా ఇంటికే పరిమితమైన షట్లర్​ సింధు.. తెలంగాణ ప్రభుత్వం క్రీడలపై ఎప్పుడు ఆంక్షలను ఎత్తివేస్తుందా అని ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా 90 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. 4 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. భారతదేశంలో ఇప్పటివరకు 4.25 లక్షలకుపైగా కరోనా బాధితులు ఉండగా.. దాదాపు 13,700 మంది మృతి చెందారు.

ఇదీ చూడండి... 'అర్జున అవార్డుకు ప్రణయ్​ను నామినేట్​ చేయాలి'

For All Latest Updates

TAGGED:

P V Sindhu
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.