ETV Bharat / sports

నా ఫైనల్​ టార్గెట్​ అదే: షట్లర్​ కిదాంబి శ్రీకాంత్​ - paris olympics 2024

Kidambi Srikanth Paris Olympics: ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్​లో రజక పతకంతో మెరిసిన భారత స్టార్​ షట్లర్​ కిదాంబి శ్రీకాంత్​ తన అంతిమ లక్ష్యం ఏమిటో చెప్పాడు. ప్రస్తుతం ఛాంపియన్​షిప్​లో దక్కిన విజయాన్ని తాను ఆస్వాదిస్తున్నట్లు తెలిపాడు. ఫైనల్​లో ఓడిపోవడం, టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించలేకపోవడం వంటి విషయాల గురించి కూడా మాట్లాడాడు. అవన్నీ అతడి మాటల్లోనే..

కిదాంబి శ్రీకాంత్​ పారిస్​ ఒలింపిక్స్​, paris olympics 2024
కిదాంబి శ్రీకాంత్​ పారిస్​ ఒలింపిక్స్​
author img

By

Published : Dec 25, 2021, 5:38 PM IST

Kidambi Srikanth Paris Olympics: తన అంతిమ లక్ష్యం పారిస్​ ఒలింపిక్స్ 2024లో పతకం సాధించడమేనని తెలిపాడు ప్రపంచ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్​ రజత పతక విజేత కిదాంబి శ్రీకాంత్​. ప్రస్తుత ఛాంపియన్​షిప్​లో దక్కిన విజయాన్ని తాను ఆస్వాదిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇంకా తన కెరీర్​ గురించి పలు విషయాలను చెప్పాడు. ఆ సంగతులు మీకోసం..

ప్రపంచ ఛాంపియన్​షిప్​లో భారత్​ తరఫున సిల్వర్​ మెడల్​ సాధించిన తొలి భారత పురుష ప్లేయర్​ మీరు. ఇంకా ఆ ఆనందంలోనే ఉన్నారా?
శ్రీకాంత్​: అవును. ప్రస్తుతం దేని గురించి ఆలోచించట్లేదు. ప్రపంచ ఛాంపియన్​షిప్​లో గెలిచిన ఆనందాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నిస్తున్నాను.

సెమీఫైనల్​లో మరో భారత ఆటగాడు లక్ష్యసేన్​తో తలపడటం ఎలా అనిపించింది? మ్యాచ్ తర్వాత మీ సంభాషణ ఎలా సాగింది?
శ్రీకాంత్​: మన దేశం తరఫున ఆడేవాళ్లతో తలపడటం ఎప్పుడూ కష్టమైనదే. ఇద్దరం గెలవడానికే ఆడతాం. మ్యాచ్​లో నేను గెలవడం ఆనందంగా ఉంది. మ్యాచ్​ ముగిసిన తర్వాత మాములుగానే మాట్లాడుకున్నాం. టోర్నీ, పోటీ గురించి ఏమీ మాట్లాడుకోలేదు.

ఫైనల్​లో కీన్​ యూ చేతిలో ఓడిపోవడంపై బాధగా ఉందా?
శ్రీకాంత్​: అలా ఏమీ లేదు. ఫైనల్​లో అతడితో నేను ఆడిన విధానంపై ఆనందంగానే ఉంది. కాకపోతే ఇంకాస్త బెటర్​గా ఆడాల్సింది. ఏదేమైనప్పటికీ మన తప్పుల్ని తెలుసుకుని మరింత ఉత్తమంగా ఆడేందుకు ప్రయత్నించాలి.

ఈ ఛాంపియన్​షిప్​కు ముందు సుదిర్మన్​ కప్​, థామస్​, ఉబర్​ కప్​ సహా పలు టోర్నీలు ఆడారు. మీరు ఉత్తమంగా ఆడుతున్నారని ఎప్పుడు గ్రహించారు?
శ్రీకాంత్​: ప్రతి టోర్నీకి మెరుగుపడుతూనే ఉన్నాను. జర్మన్​ ఓపెన్​, ఫ్రెంచ్​ ఓపెన్​ ఆడేటప్పుడు నా ఆటలో డిఫరెన్స్​ను గమనిస్తాను. ఇండోనేషియాలో ఆడేటప్పుడు మరింతగా గమనిస్తాను. ప్రపంచ ఛాంపియన్​షిప్స్​లో పాల్గొనేటప్పుడు మెడల్​ సాధించాలని ఉన్నప్పటికీ దాని​ గురించి ఆలోచించను. ఉత్తమంగా ఆడటంపైనే దృష్టి పెడతాను. బాగా ఆడితే తప్పకుండా పతకం సాధిస్తాం.

2017లో మీరు సాధించిన ఘనతలకన్నా ఇది ఎక్కువ అని భావిస్తున్నారా?
శ్రీకాంత్​: అవును.

కరోనా కారణంగా పలు టోర్నీలు రద్దు అయ్యాయి. దీని వల్ల మీ ర్యాంకింగ్స్​పై ప్రభావం పడి టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించలేకపోయారు? ఇది మిమల్ని ఎంత వరకు నిరాశపరిచింది?
శ్రీకాంత్​: నిజం చెప్పాలంటే కాస్త డీలాపడ్డాను. కానీ నేను చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే ఆ సమయంలో 7-8 టోర్నీలు రద్దు అయ్యాయి. అప్పటివరకు ప్రపంచ ర్యాంకింగ్స్​లో 14న స్థానంలో ఉన్నాను. ఒలింపిక్స్​కు అర్హత సాధించాలంటే టాప్​-16లో ఉండాలి. కానీ కరోనాతో పలు టోర్నీలు రద్దు అవ్వడం వల్ల ప్రపంచ బ్యాడ్మింటన్​ సంఘం ర్యాంకింగ్స్​ విధానంలో పలు మార్పులు చేసింది. అందువల్ల నాకు అవకాశం లేకుండా పోయింది. అది నా పరిధిలో లేని అంశం. నేను అనుకున్న ప్రకారం జరగకపోవడం వల్ల కాస్త బాధపడ్డాను. కానీ ఏమి జరిగినా ముందుకు సాగిపోవాలి కదా.

మీరు గెలిచిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రెసిడెంట్​ రామ్​నాథ్ కోవింద్ మిమ్మల్ని ప్రశంసించారు. అవి మీలో స్ఫూర్తినింపాయా?
శ్రీకాంత్​: నన్ను ప్రశంసిస్తూ ట్వీట్​ చేయడం ఎంతో సంతోషాన్నిచ్చింది. నాలో స్ఫూర్తిని నింపాయి. వాళ్లు నా ఆటను ఫాలో అవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.

  • Congratulations Kidambi Srikanth on becoming the first Indian to win a silver medal in men's singles at BWF World Badminton Championship. This is an outstanding feat. Your hard work and dedication are an inspiration for our youth. My best wishes for your bright future!

    — President of India (@rashtrapatibhvn) December 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇప్పటి నుంచి మీ ప్రయాణం ఎలా ఉండబోతుంది?
శ్రీకాంత్​: జనవరిలో ఇండియా ఓపెన్​ ప్రారంభంకానుంది. ఆ టోర్నీలో బాగా ఆడేందుకు దృష్టి పెడతా.

మీ అంతిమ లక్ష్యం ఏమిటి?
శ్రీకాంత్​: 2024 పారిస్​ ఒలింపిక్స్​లో మెడల్​ సాధించడం నా అంతిమ లక్ష్యం. కానీ పూర్తిగా దాని మీదే దృష్టి పెట్టి మిగతా విషయాల్ని పక్కనపెట్టాలని భావించట్లేదు. ఆ ఒలింపిక్స్​ సమయంలో దాని కోసం ప్రాక్టీస్​ చేస్తూ అదే అంతిమ లక్ష్యంగా శ్రమిస్తా.

ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో కిదాంబి శ్రీకాంత్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ప్రకాశ్‌ పదుకొణె (1983), భమిడిపాటి సాయిప్రణీత్‌ (2019) కాంస్యాలు సాధించగా.. రజత పతకంతో మెరిసిన శ్రీకాంత్‌ భారత బ్యాడ్మింటన్‌ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాడు.

ఇదీ చూడండి: kidambi srikanth BWF: ఫైనల్​లో ఓడినా చరిత్రే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.