ETV Bharat / sports

Olympics: సింధు గెలుపు.. ప్రీ క్వార్టర్స్​లోకి ఎంట్రీ - ఒలింపిక్స్ న్యూస్ లేటెస్ట్

ఒలింపిక్స్​లో సింధు దూసుకెళ్తోంది. గ్రూప్ దశలో చెయుంగ్​పై విజయం సాధించి, ప్రీ క్వార్టర్స్​లోకి ప్రవేశించింది.

PV Sindhu Eases Past Cheung NY, Advances to Knockout
సింధు
author img

By

Published : Jul 28, 2021, 8:56 AM IST

Updated : Jul 28, 2021, 11:43 AM IST

ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు మరో ఘన విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్ దశలో హాంకాంగ్‌కు చెందిన చెయుంగ్‌ ఎంగన్‌పై 21-9, 21-16తో వరుస సెట్లల్లో విజయం సాధించింది.

తొలి సెట్‌ను 21-9తో సునాయసంగా గెలిచిన సింధుకు.. రెండో సెట్‌లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైంది. కానీ సింధు వరుస పాయింట్లు సాధించి 21-16తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. స్మాష్‌లు, క్రాస్‌ కోర్టు రిటర్న్స్‌, తో సింధు.. కోర్టు చుట్టూ పరుగులు పెట్టించింది.

PV Sindhu
పీవీ సింధు

ప్రపంచ 34 వ ర్యాంకర్ అయిన చెయుంగ్‌తో సింధుతో ఏడు సార్లు తలపడగా.. ఆరు సార్లు సింధునే విజయం సాధించింది. ఈ గెలుపుతో సింధు ఒలింపిక్స్‌ ప్రి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ప్రీ క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్‌ మియా బ్లిచ్‌ ఫెల్డ్‌తో సింధు తలపడనుంది.

ఇవీ చదవండి:

Last Updated : Jul 28, 2021, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.