ETV Bharat / sports

'ప్రభుత్వం అనుమతిస్తే హైదరాబాద్​లో శిక్షణ ప్రారంభం' - తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే జులై 1 నుంచి బ్యాడ్మింటన్​ శిక్షణా శిబిరాలను తిరిగి ప్రారంభిస్తామని భారత బ్యాడ్మింటన్​ సంఘం కార్యదర్శి అజయ్​ సింఘానియా తెలిపారు. లాక్​డౌన్​ విరామం తర్వాత దేశంలో కొన్ని చోట్ల క్రీడా కార్యకలాపాలు ప్రారంభమైనా.. తెలంగాణలో కరోనా సంక్షోభం పెరుగుతున్న కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుమతించలేదు.

BAI plans training camp in Hyderabad from July 1, no domestic event till September
'ప్రభుత్వం అనుమతిస్తే జులై 1 నుంచి శిక్షణ ప్రారంభిస్తాం'
author img

By

Published : Jun 26, 2020, 6:12 PM IST

జులై 1 నుంచి బ్యాడ్మింటన్​ శిక్షణా శిబిరాన్ని హైదరాబాద్​లో తిరిగి ప్రారంభించాలని యోచిస్తోంది భారత బ్యాడ్మింటన్​ సంఘం (బీఏఐ). దీని కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోసం ఎదురుచూస్తోంది. ఇప్పటికే బెంగళూరులోని ప్రకాశ్ పదుకొణె బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణా శిబిరాలు పునఃప్రారంభం కాగా.. హైదరాబాద్​లో కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న కారణంగా ఆటగాళ్ల ట్రైనింగ్​కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించలేదు.

"కరోనా సంక్షోభం కారణంగా బ్యాడ్మింటన్​ శిక్షణా శిబిరాలకు విరామాన్ని ఇచ్చాం. తాజాగా వాటిని జులై 1 నుంచి హైదరాబాద్​లో పునఃప్రారంభించాలని నిర్ణయించాం. అయితే అందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కావాల్సి ఉంది. అన్ని రాష్ట్రాల సెక్రటరీలతో ప్రస్తుత పరిస్థితుల గురించి చర్చంచిన తర్వాత దేశవాళీ టోర్నీలను నిర్వహిస్తాం. అయితే ప్రస్తుతానికి సెప్టెంబర్ వరకు ఎలాంటి టోర్నీలు జరపలేం. సెప్టెంబరులో పరిస్థితులకు అనుగుణంగా తిరిగి కార్యకలాపాలను మొదలుపెట్టాలని చూస్తున్నాం".

-అజయ్​ సింఘానియా, భారత బ్యాడ్మింటన్​ సంఘం సెక్రటరీ

దేశంలో జరిగే సీనియర్​ ర్యాంకింగ్​ టోర్నీల స్థానంలో బహుళ స్థాయి దేశవాళీ టోర్నీల ప్రణాళికలను రూపొందించింది బాయ్. దాదాపు రూ.2 కోట్ల ప్రైజ్​మనీతో ఈ టోర్నీ జరిపేందుకు సిద్ధమైంది. అందులో మూడు స్థాయిల్లో మ్యాచ్​ల జరగాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాటిని నిర్వహించలేదు.

భారత్​లో జరగాల్సిన రెండు ప్రపంచస్థాయి బ్యాడ్మింటన్​ టోర్నీలను ఇప్పటికే రద్దు చేశారు. పుణెలో జరగాల్సిన ఇండియా జూనియర్​ ఇంటర్నేషనల్​ గ్రాండ్​ ప్రిక్స్​ (ఆగస్టు 4-9), హైదరాబాద్​ ఓపెన్​ సూపర్​ 100 (ఆగస్టు 11-16) టోర్నీలు కరోనా నేపథ్యంలో పూర్తిగా రద్దయ్యాయి.

ఇదీ చూడండి... 'వన్డేలో సూపర్​ ఓవర్ వద్దు.. ట్రోఫీ షేరింగ్​ ముద్దు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.