ETV Bharat / sitara

తెలుగునాట వినోదాల వీచిక.. 'ఈటీవీ' రజతోత్సవ వేడుక - ETV Silver Jubilee Celebrations news

దక్షిణ భారత టెలివిజన్‌ రంగంలో సంచలనాలకు శ్రీకారం చుట్టిన మీటీవీ- ఈటీవీ.. గురువారంతో 25ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. తెలుగునాట వినోదానికి సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చిన ఈటీవీ.. ఈ రెండున్నర దశాబ్దాల ప్రయాణంలో ప్రేక్షక జనరంజకమైన ఎన్నో కార్యక్రమాలతో అలరించింది. మరెన్నో ప్రయోగాలకు వేదికగా నిలిచింది. డైలీ సీరియల్స్‌, పౌరాణిక ధారావాహికలు, రియాల్టీ షోలు, క్విజ్‌ పోటీలు, ఆటలు, పాటలతో అన్ని వర్గాలను అలరిస్తూ.. ఎన్నో విజయశిఖరాలను అధిరోహించింది. తెలుగు రాష్ట్రాల్లో అమితంగా విశ్వసించే ఈటీవీ-న్యూస్‌.. నిజాయితీగా, నిష్పక్షపాతంగా వార్తలు అందిస్తూ తెలుగు ప్రజల గుండెచప్పుడుగా మారి పల్లెపల్లెలో సుప్రభాతమై భాసిస్తోంది.

Telugu Entertainment Breeze -'ETV' Silver Jubilee Celebration
తెలుగునాట వినోదాల వీచిక.. 'ఈటీవీ' రజతోత్సవ వేడుక
author img

By

Published : Aug 27, 2020, 6:04 AM IST

Updated : Aug 27, 2020, 9:57 AM IST

సరిగ్గా 25 సంవత్సరాల క్రితం..

రమ్యమైన అందాలను - రంగు రంగుల ఆనందాలను అపురూప కానుకలుగా ఏర్చి కూర్చి.. ఆకాశమార్గం నుంచి తొలిసారిగా తెలుగు నేల మీదకు వాలిందొక వినోదాల హరివిల్లు..

1995 ఆగష్టు 27

ఈటీవీ పుట్టిన రోజు..

దక్షిణ భారతీయ టెలివిజన్ రంగంలో సరికొత్త సంచలనాలకు శ్రీకారం చుట్టిన రోజు..

తెలుగునాట వినోదాల వీచిక.. 'ఈటీవీ' రజతోత్సవ వేడుక

ఓ కొత్త చరిత్రకు అది ఆరంభం.. క్వీన్ ఆఫ్ ఇండియన్ సినిమా.. స్టార్ హీరోయిన్ శ్రీదేవి.. జ్యోతి వెలిగించి ఈటీవీకి శుభారంభం పలికారు. ఈనాడు గ్రూప్ ఛైర్మన్ రామోజీరావు తెలుగు ప్రజల్ని ఉద్దేశించి - “ఆరోగ్యకరమైన వినోదానికి ఈటీవీ చిరునామాగా నిలుస్తుంద”ని మాట ఇచ్చారు. ఆ రోజు నుంచే తెలుగు వినోద రంగం రూప స్వరూపాలు మారిపోయాయి. అంతవరకూ ఎన్నడూ లేని కొత్త టెక్నాలజీని, అనేక మంది సాంకేతిక నిపుణుల్ని పరిచయం చేసి అత్యున్నత ప్రమాణాలతో ప్రసారాలను ప్రారంభించింది ఈటీవీ. ఈటీవి అడుగుపెట్టిన నాటి నుంచే తెలుగునాట కేబుల్ టీవీ కనెక్షన్లు ఊహకు అందనంతగా పెరిగిపోయాయి. నగరాలు, పట్టణాలు, పల్లెలు... ఒకటేమిటి... ఒక ప్రాంతమేమిటి... ఎక్కడ చూసినా ఈటీవీ ప్రభంజనమే.

ఈటీవీ మేనేజింగ్ డైరెక్టర్ సుమన్ సారధ్యంలో..

ఈటీవీ మేనేజింగ్ డైరెక్టర్ సుమన్ సారధ్యంలో సమర్ధులైన కార్యనిర్వాహక బృందం ఈటీవీని ఆసాంతం జనరంజకంగా మలచింది. తెలుగులో మొట్టమొదటి 24 గంటల శాటిలైట్ ఛానల్​గా అవతరించిన ఈటీవీ.. ఎన్నో కొత్త ప్రయోగాలకు వినూత్న వేదికగా నిలిచింది.

ఆరు సినిమా పాటలు చూసేందుకు ఒక వారం మొత్తం ఎదురుచూడాల్సిన కాలంలో, ప్రతిరోజూ ఒక చలన చిత్రాన్ని ప్రసారం చేస్తూ ప్రేక్షకులకు కనువిందు చేసింది. రియాలిటీ షో అంటే ఏమిటో కూడా దక్షిణాది ప్రేక్షకులకు తెలియని రోజుల్లో, తొలిసారిగా మధుర గానగంధర్వుడు పద్మభూషణ్ డా.శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో ‘పాడుతా తీయగా’ కార్యక్రమాన్ని ప్రారంభించి సంగీతాభిమానుల్ని తన్మయత్వంలో ముంచెత్తింది.

కుటుంబసభ్యులందరినీ, మరీ ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకునే డైలీ సీరియల్స్​ను తెలుగులో తొలిసారిగా ప్రవేశపెట్టిన ఘనత ఈటీవీదే. బలమైన కథాకథనాలతో పాటు ప్రఖ్యాత తారలెందరో నటించిన ధారావాహికలు.. ఈటీవీకి పెట్టని ఆభరణాలుగా మారాయి.

నవ్యత– ప్రత్యేకత కలిగిన ఈటీవీ కార్యక్రమాలు– ఆబాలగోపాలాన్నీ అలరించాయి. పిల్లల కోసం క్విజ్​లు, ఆటలు, యువత కోసం సరదాలు-సందళ్లు, పెళ్లైన జంటల కోసం మనసైన ప్రోగ్రాములు..అన్నీ వినోదాల వర్షాలు కురిపించాయి.

మారుతున్న ప్రపంచానికి సమగ్ర దర్పణం

విశేషంగా చెప్పుకోవాల్సిన మరో విశిష్ట కార్యక్రమం అన్నదాత. స్వేదం చిందించే రైతన్నలకు సేద్యపు సమాచారం, అమూల్య సహకారం అందిస్తూ పల్లెపల్లెలో వ్యవసాయ సుప్రభాతమై భాసించింది ఈటీవీ అన్నదాత. ఇక తెలుగువారు అమితంగా విశ్వసించే అద్వితీయ వార్తా కదంబం.. ఈటీవీ న్యూస్. మన చుట్టూ జరిగే వార్తా విశేషాలను ఏ అభూత కల్పనలూ లేకుండా, నిజాయితీగా, నిష్పక్షపాతంగా అందిస్తూ ఈటీవీ న్యూస్ తెలుగు ప్రజల గుండె చప్పుడుగా మారింది. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ విశేషాలతో పాటు, వ్యాఖ్యలు, విశ్లేషణలు, నిజ జీవనగాధలు అన్నీ ఈటీవీ న్యూస్​లో నిరంతరం ప్రత్యక్షం. మారుతున్న ప్రపంచానికిది సమగ్ర దర్పణం.

వెండితెర ప్రముఖుల్ని టెలివిజన్ రంగానికి..

ఈటీవీ ప్రయాణంలో సృష్టించిన సంచలనాలు.. లెక్కలేనన్ని. అధిరోహించిన విజయశిఖరాలు.. మరెవరూ ఎక్కలేనన్ని! ఎందరెందరో వెండితెర ప్రముఖుల్ని టెలివిజన్ రంగానికి స్వాగతించి నటనకు, మాటలకు, పాటలకు, వారి ప్రతిభా పాటవాలకు పెద్దపీట వేసింది ఈటీవీ. నరేశ్, మురళీమోహన్, గొల్లపూడి, గీతాంజలి, రాధిక, కవిత, యుమున, జయసుధ, రోజా, శుభలేఖసుధాకర్, తరుణ్, సాయికుమార్, ఆలీ, దర్శకరత్న దాసరి, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, దిగ్దదర్శకులు బాలచందర్, బాపు-రమణ, కె.విశ్వనాథ్, సింగితం శ్రీనివాసరావు, ఏస్ డైరెక్టర్ రాజమౌళి, క్రిష్, టాప్ ప్రొడ్యూసర్స్ మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఆర్కామీడియా శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, వైజయంతి స్వప్నాదత్, మంచు లక్ష్మి, డాన్సింగ్ కింగ్ ప్రభుదేవా, అన్నపూర్ణ స్టూడియోస్ సుప్రియ, లెజండరీ సింగర్స్ శంకర్ మహదేవన్, వాణీజయరాం లాంటి ప్రముఖులు అందులో ఉన్నారు.

ఈటీవీ ధారావాహికలన్నీ ప్రేక్షకులకు అభిమాన దీపికలే..

చిత్ర, మనో, కార్తీక్, ఎస్.పి.శైలజ, సునీత, టాప్ యాంకర్స్ సుమ, ఉదయభాను, ఝూన్సీ, అనసూయ, రష్మి, ప్రదీప్ .. ఇలా ఈటీవీ కార్యక్రమాల రూపకల్పనలో భాగస్వాములైన వారి పేర్లు చెబితే ఆ లిస్టు ఎవరెస్టు అంత! ఆనాటి అంతరంగాలు, అన్వేషిత, స్నేహ, లేడీ డిటెక్టివ్, గుప్పెడు మనసు, పద్మవ్యూహం, విధి, శాంతినివాసం, ఎండమావులు నుంచి, నిన్నటి చంద్రముఖి, అంతఃపురం, ఈనాటి అభిషేకం, అత్తారింటికి దారేది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమతి, అమ్మ, మనసు మమత, స్వాతిచినుకులు, నా పేరు మీనాక్షి వరకూ.. ఈటీవీ ధారావాహికలన్నీ ప్రేక్షకులకు అభిమాన దీపికలే !

ఆనాటి సూపర్ హిట్ షోలు సరిగమలు, మనసుమనసై, కౌంట్ డౌన్, మాస్టర్ మైండ్స్ నుంచి నిన్నటి ఝుమ్మంది నాదం, అదుర్స్, జీన్స్, సూపర్, సౌందర్యలహరితో పాటు అన్ని రికార్డులు బ్రేక్ చేసిన ఈనాటి స్టార్ మహిళ, నువ్వురెడీ – నేను రెడీ, క్యాచీ క్యాష్, వండర్ ఫుల్ వావ్, అద్భుతమైన ఆలీతో సరదాగా, సంగీతానికి పట్టాభిషేకం చేసే స్వరాభిషేకం, డాజిలింగ్ డాన్స్ షో ఢీ, రేటింగ్స్ లో రాకెట్​ని తలపించే సూపర్ హిట్ షో జబర్దస్త్ వరకూ.. ఈటీవీ షోలు అన్నీ ప్రేక్షకులకు ఆనంద మాలికలే!

డిజిటల్ మాధ్యమంలోనూ దేదీద్యమానంగా..

యూట్యూబ్‌ డిజిటల్‌ వేదికపై ఈటీవీ ఛానళ్లు దుమ్మురేపుతున్నాయి. 3.6 కోట్ల మందికిపైగా సబ్‌స్క్రైబర్లను సొంతం చేసుకుని ఇప్పటికే 90 కోట్లకు పైగా వీక్షణలతో ఈటీవీ ఛానళ్లు అప్రతిహతంగా దూసుకుపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు అనునిత్యం వినోదాన్ని పంచుతూ రంజింపజేస్తున్నాయి. ప్రస్తుతం ప్రాచుర్యం పొందుతున్న డిజిటల్‌ ఓటీటీపైనా ఈటీవీ తనదైన ముద్రను ఘనంగా వేసింది. 'ఈటీవీ విన్‌' రూపంలో జనానికి చేరువైంది. ఇప్పటికే ఈ యాప్‌ను పది లక్షల మందికి పైగా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. పాతికేళ్ల ప్రస్థానంలో ఇది ఈటీవీకి లభిస్తున్న ప్రేక్షక జన ఘననీరాజనం!

రెండున్నర దశాబ్దాల ప్రయాణం పూర్తి చేసుకున్న మీటీవీ- ఈటీవీ ఇప్పుడు జరుపుకుంటోంది ‘రజతోత్సవం...’

ఇదీ చూడండి: 'ఈటీవీ'కి మహేశ్​ రజతోత్సవ శుభాకాంక్షలు

Last Updated : Aug 27, 2020, 9:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.