ETV Bharat / sitara

ఒకే రోజు 16 పాటలు.. అమ్మ మందలించింది: సింగర్ చిత్ర - ఆలీతో కె ఎస్ చిత్ర

20వేలకు పైగా పాటలతో సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసింది కె.ఎస్​.చిత్ర. దక్షిణ భారతంలో ఆమె ఓ స్వర శిఖరం. ఇటీవలే 'ఈటీవీ'లో 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి హాజరైన ఆమె.. తన సంగీత ప్రయాణంలో జరిగిన కొన్ని విశేషాలను పంచుకున్నారు.

alitho saradaga, ks chitra
కె.ఎస్​ చిత్ర
author img

By

Published : Aug 4, 2021, 4:03 PM IST

దక్షిణ భారత సంగీత ప్రపంచంలో ఆమె ఓ స్వర శిఖరం. సంగీత ప్రియుల హృదయాలలో ఆమె పాటలు కలకాలం పదిలం. పాడే పాట ఏదైనా, పలికే భావం ఏదైనా సుస్పష్టమైన ఉచ్ఛారణతో, అత్యద్భుతమైన గాత్ర నైపుణ్యంతో అనేక భాషల్లో 20వేలకు పైగా పాటలపై తన గాత్ర సంతకాన్ని చేశారు. ఆమే లివింగ్‌ లెజెండ్‌ ఆఫ్‌ ఇండియన్‌ మ్యూజిక్‌ ఆఫ్‌ పద్మభూషణ్‌ కె.ఎస్‌.చిత్ర. అలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు.

ఎలా ఉన్నారమ్మా.. ఇప్పటివరకూ 25వేల పాటలకు పైగా పాడినందుకు ముందుగా మీకు శుభాకాంక్షలు!

చిత్ర: చాలా బాగున్నానండీ. ఈ షోకు వస్తే మీరు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారా? అని కాస్త భయంగా ఉంది. ఇక నేను ఇప్పటివరకూ.. 25వేలు అంటే కొంచెం పెద్ద సంఖ్య, 20వేలకు పైగా పాటలు పాడా. నా కెరీర్‌ మలయాళంలో మొదలైంది. ఆ తర్వాత భారతీయ భాషల్లో చాలావరకు పాడాను. లాటిన్‌, అరబిక్‌ భాషల్లో కూడా ఒకట్రెండు గీతాలు ఆలపించా. (మధ్యలో ఆలీ అందుకుని, రూ.100 నోటుపై పలు భారతీయ భాషలు ఉంటాయి. వాటి కన్నా ఎక్కువే పాడేశారు) అరబిక్‌లో చిన్న లైన్‌ మాత్రమే పాడా.

మీ కుటుంబ సభ్యులు ఎంతమంది?

చిత్ర: నా తల్లిదండ్రులు ఇద్దరూ టీచర్లే. ఇంట్లో కాస్త కఠినంగానే ఉండేవాళ్లు. నాకు ఒక అక్క, తమ్ముడు ఉన్నారు. త్రివేండ్రంలో ఉంటారు. తమ్ముడు నైజీరియాలో పనిచేస్తున్నాడు.

మీ తల్లిదండ్రులు టీచర్లు. మరి సింగర్‌ అవ్వాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది?

చిత్ర: నేను మ్యూజిక్‌ మెయిన్‌గా తీసుకుని చదువుతున్నప్పుడు నేను కూడా టీచర్‌ అవ్వాలని అనుకున్నా. అందుకు నా తల్లిదండ్రులే స్ఫూర్తి. నాతో పాటు మ్యూజిక్‌ నేర్చుకుంటూ చదువుకున్న చాలా మంది మ్యూజిక్‌ కాలేజీలలో లెక్చరర్లుగా ఉన్నారు. నేను కూడా అలాగే ఒక పోస్టులో ఉంటానని అనుకున్నా. కానీ, మన తలరాత ఇక్కడకు రావాలని ఉంది. మా గురువుగారు కె.ఓమన్‌కుట్టి, వాళ్ల బద్రర్‌ ఎంజీ రాధాకృష్ణ కేరళలో పాపులర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్స్‌. వాళ్లే నన్ను గాయనిగా మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. అంతవరకూ రికార్డింగ్స్‌ అన్నీ చెన్నైలో జరిగేవి. ఆ సమయంలో 'చిత్రాంజలి' అనే స్టూడియోను కేరళలో నిర్మించారు. అక్కడ రికార్డింగ్‌ చేద్దామని స్థానికంగా ఉన్న సింగర్స్‌ను పిలిచి నాకు అవకాశం ఇచ్చారు. అది కూడా చాలామంది సింగర్స్‌తో కలిసి పాడా. ఆ తర్వాత జేసుదాసు గారితో పాటలు పాడటం వల్ల నా సినీ ప్రయాణం నెమ్మదిగా మొదలైంది. అప్పటి నుంచి సంగీత దర్శకులు నన్ను పిలవటం మొదలుపెట్టారు.

ఐదేళ్ల వయసులోనే మీ తమ్ముడికి మీరు జోల పాట పాడితే, ఒక సంగీత విద్వాంసుడు మిమ్మల్ని మెచ్చుకున్నారట!

చిత్ర: అయ్యో(నవ్వులు) ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు. నేను పాడిన పాట విని మా గురువుగారు ఓమన్‌కుట్టి మెచ్చుకున్నారు. మా ఇంటికి దగ్గరలో ఒక ఆలయం ఉంది. అక్కడ సంగీత కచేరి పెడితే ఓమన్‌కుట్టి గారు, రాధాకృష్ణ గారికి మా ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చారు. అప్పుడు మా తమ్ముడి కోసం పాడిన పాట విని మెచ్చుకున్నారు. ఎప్పటికైనా ఈ పాపకు నేనే సంగీతం నేర్పిస్తానని అన్నారట.

కె.ఎస్‌.చిత్ర అంటే పూర్తి పేరు ఏంటి?

చిత్ర: కృష్ణన్‌ నాయర్‌ శాంతకుమారి చిత్ర. కేరళలో నాన్న పేరుతో కలిపి పెట్టుకుంటారు. చిన్నప్పుడు నాన్న మాతో చాలా సరదాగా ఉండేవారు. అమ్మ మాత్రం కాస్త కఠినంగానే ఉండేవారు. ఆమె కూడా చాలా బాగా పాడతారు. అయితే, కేవలం ఇంట్లోనే పాడేవారు.

మీది ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన పెళ్లా?

చిత్ర: పెద్దలు కుదిర్చిన పెళ్లి. అయితే.. తెలిసిన వాళ్లు. నా భర్త విజయ శంకర్‌ సోదరి, నేనూ స్కూల్లో స్నేహితులం. ఆమె మంచి డ్యాన్సర్‌. స్కూల్లో పోటీలు జరిగితే రెండు కుటుంబాలు కలుస్తుండేవి. అలా పెళ్లి ప్రపోజల్‌ వచ్చింది. ఆయన ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌గా పని చేసేవారు. ఆ తర్వాత నాకోసం చెన్నై వచ్చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు, కన్నడ బెంగళూరుకు వెళ్లిపోవడం వల్ల అటూ ఇటూ ప్రయాణాలు చేయాల్సి వచ్చేది.

ఈ మధ్యకాలంలో మీరు తెలుగు రాయటం, చదవటం నేర్చుకుంటున్నారట!

చిత్ర: ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో నేర్చుకుంటున్నా. అసలు నాకు తెలుగు అక్షరాలు రాసి ఇచ్చింది బాలుగారు. ఇద్దరం కలిసి పాడేటప్పుడు చాలా సందేహాలకు సమాధానాలు చెప్పేవారు. ఆయనతో కలిసి పాడటం వల్లే నాకు తెలుగు వచ్చింది. నా కెరీర్‌ ఇంత గొప్పగా ఉండటానికి కారణమైన వాళ్లలో బాలుగారు, జేసుదాసుగారి పాత్ర ఎంతో ఉంది. ఆయన్ను దాసన్న అని పిలుస్తా. కేరళలో ఆయనకు తరంగణి అనే స్టూడియో ఉంది. అందులో సింగర్స్‌ బ్యాంకు ఉంది. కొత్త గాయనీ గాయకుల వాయిస్‌ రికార్డు చేసి పెడతారు. ఎవరైనా వచ్చి 'కొత్త సింగర్స్‌ కావాలి' అని అడిగితే, అప్పటికే రికార్డు చేసి ఉంచిన వాళ్ల పాటలు ప్లే చేసి వినిపిస్తారు.

'సింధు భైరవి'లో ఒక పాట పాడమని ఇళయరాజా అడిగితే పాడను అన్నారట నిజమేనా?

చిత్ర: అలా అనలేదండీ. 'నానురు సింధు' అనే పాట కోసం నన్ను పిలిచారు. ఆ పాట పాడాను కూడా. అది అయిపోయిన తర్వాత నేను త్రివేండ్రం వెళ్లిపోవాలి. ఎందుకంటే మరుసటి రోజు నాకు ఎం.ఎ మొదటి సంవత్సరం పరీక్షలు ఉన్నాయి. అయితే, రాజా సర్‌ వచ్చి, 'ఇంకొక పాట ఉంది పాడతారా' అని అడిగారు. పాటలకన్నా చదువు ముఖ్యమని మా అమ్మ చెప్పేవారు. దీంతో ఆయనకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. 'ఇంత పెద్ద మ్యూజిక్‌ డైరెక్టర్‌ వచ్చి అడుగుతున్నారు. పరీక్షలు తర్వాత రాయొచ్చులే' అని నాన్న చెప్పారు. దీంతో ఆ పాట పాడా. సినిమా విడుదలై మంచి పేరు వచ్చింది. జాతీయ అవార్డు కూడా తెచ్చి పెట్టింది. అసలు ఆ పాట సీనియర్‌ సింగర్స్‌ పాడాల్సింది. కానీ, రాజా సర్‌ నాకు అవకాశం ఇచ్చారు. తెలుగులో ఈ పాట పాడినప్పుడు నేను తప్పుగా పాడితే బాలుగారు సరిచేసేవారు.

ఇళయరాజా మీకు త్యాగరాజస్వామి ఫొటో ఇచ్చారట. దాని వెనుక కథ ఏంటి?

చిత్ర: మిగతవాళ్ల రికార్డింగ్స్‌ ఉంటే ముందే చెబుతారు. ఆ రోజు మలయాళ సంగీత దర్శకుడు శ్యామ్‌సర్‌ సినిమాకు నేను పాడాలి. నెల ముందే నా కాల్షీట్‌ తీసుకున్నారు. రాజాగారి సినిమాలకు మాత్రం రికార్డింగ్‌ రోజునే పిలుస్తారు. ఆ రోజు ఎవరు పాడతారన్న విషయాన్ని నిర్ణయిస్తారు. సడెన్‌గా రాజాసర్‌ మేనేజర్‌ పాట పాడాలని చెప్పారు. 'ఇంతకుముందే మరో పాట పాడటానికి ఒప్పుకొన్నా' అని ఆయనకు చెప్పాను. 'ఇదే విషయాన్ని రాజాసర్‌కు చెప్పండి' అని ఆయన అన్నారు. వెళ్లి జరిగింది చెప్పాను. 'సర్‌ ఆ పాట ఉదయం 11.30 గం.లకు అయిపోతుంది. మధ్యాహ్నం వచ్చేస్తా' అని రాజాసర్‌కు చెప్పాను. అయితే, అక్కడకు వెళ్లిన తర్వాత పాట మొదలు పెట్టగానే కరెంట్‌ పోయింది. సంగీతకళాకారులంతా బయటకు వచ్చేశారు. పాట పూర్తయ్యే సరికి 12.30 దాటిపోయింది. పైగా ఆరోజు బాలుసర్‌ రికార్డింగ్‌కు ముందే వచ్చేశారు. నా కోసం ఆయన వేచి చూస్తున్నారు. అప్పటికే రెండు, మూడుసార్లు అడిగారట. నేను రాగానే 'బాలుగారి లాంటి పెద్ద వ్యక్తి మీకోసం వేచి చూశారు. ఇది ఏమైనా బాగుందా..' అంటూ అనే సరికి నాకు కన్నీళ్లు ఆగలేదు. 'కోకిలా కోకో కోకిలా..' అంటూ సాగే ఆ పాటలో బాలుగారు ఏవో పదాలు చెబితే నేను నవ్వాలి. కానీ, రాజాసర్‌ అన్న మాట గుర్తుకు వచ్చి, నాకు ఏడుపు వచ్చేసింది. దాంతో పాడటం ఇంకొంత ఆలస్యమైంది. రికార్డింగ్‌ అయిన తర్వాత రాజాసర్‌ నా దగ్గరకు వచ్చి, 'ఇప్పటివరకూ నువ్వు ఏడవటం నేను చూడలేదు. ఇక నుంచి ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకోవద్దు' అని ఆయన గదిలో ఉన్న త్యాగరాజస్వామి ఫొటో నాకు ఇచ్చారు. అదే నాకు పెద్ద దీవెన. అది నా పూజగదిలో ఉంది.

ఇదీ చదవండి: పిల్లల కోసమే అక్కడికి వెళ్తా..!

తెలుగు ప్రజలకు మీ పాటలంటే ఎంతో ఇష్టం. మరి మీకు ఎవరి పాటలంటే ఇష్టం?

చిత్ర: సుశీల, జానకిగార్ల పాటలంటే నాకు ప్రాణం. వాళ్ల పాటలు వినే నేను పెరిగా. వాళ్ల ప్రభావం నాపై ఎంతో ఉంది. అప్పుడప్పుడు వాళ్లిద్దరినీ అనుకరించడానికి ప్రయత్నిస్తుంటా.. కానీ నాకు రావడం లేదు. జానకిగారు నాకు అమ్మలాంటి వారు. చాలా క్లోజ్‌గా ఉంటారు. ఎక్కువ పాటలు వాణీ జయరామ్‌గారితో పాడా!

ఒకే రోజు ఇద్దరు మ్యూజిక్‌ డైరెక్టర్లతో పాటలు పాడాలంటే ఎలా మేనేజ్‌ చేసేవారు?

చిత్ర: నాకంటే బాలుగారు ఎక్కువ కష్టపడేవారు. ఆలస్యమవుతుందని తెలిస్తే ముందే ట్రాక్స్‌ తీస్తారు. కొందరు వేచి చూస్తారు. అప్పుడప్పుడు చాలా టెన్షన్‌ పడాల్సి వచ్చేది. ఒక్కోరోజు భోజనం చేసేందుకు సమయం కూడా ఉండేది కాదు. ఇక సంగీత దర్శకుల్లో.. చెప్పింది చెప్పినట్లు కచ్చితంగా పాడాలని పట్టుబట్టే వ్యక్తుల్లో ఇళయరాజా సర్‌ ఉంటారు. ఆయన చెప్పింది పాడితే సంతోషపడతారు. ఏఆర్‌ రెహమాన్‌ అందుకు పూర్తి భిన్నం. ఆయన చెప్పింది.. మనం ఇంకాస్త డెవలప్‌ చేసి పాడతానంటే ఓకే అంటారు. కీరవాణిగారు కూడా ఆయనకు కావాల్సినట్టే పాడమంటారు. అయితే, పాటను పూర్తిగా అర్థమయ్యేలా చెబుతారు. ఎక్కడ ఏ ఎక్స్‌ప్రెషన్‌ ఇవ్వాలో వివరిస్తారు.

సాధారణంగా కొత్తవాళ్లు పాడటానికి కాస్త భయపడతారు. సీనియర్లు త్వరగా పాడేస్తారు. కానీ, 'తెలుసా.. మనసా' పాట కోసం నాలుగు రోజులు ప్రాక్టీస్‌ చేశారట!

చిత్ర: కీరవాణిగారు నాకు ఒక ట్రాక్‌ వినిపించారు. అందులో సింగర్‌ పాడిన వాయిస్‌లాగానే మీరు కూడా పాడాలి అని సూచించారు. అప్పటి వరకూ నేను ఎప్పుడూ ప్రయత్నించని స్టైల్‌ అది. ఆ పాటకు బాగా పేరొచ్చింది.

ఇటీవల కాలంలో మీరు పాడిన తెలుగు పాట ఏది?

చిత్ర: తెలుగులో తక్కువగా పాడుతున్నా. వీణాపాణిగారి కోసం రెండు పాటలు పాడా. ఎక్కువగా మలయాళంలో పాడుతున్నా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

మీ పాప పేరుతో ట్రస్ట్‌ పెట్టారు కదా! అది ఇప్పుడెలా ఉంది?

చిత్ర: బాగానే ఉంది. 22మంది సభ్యులకు లైఫ్ టైమ్‌ పెన్షన్‌ నెలకు రూ.5వేలు ఇస్తున్నాం. 60 ఏళ్లు దాటి, అనారోగ్యంతో బాధపడుతున్న సంగీతకళాకారులకు కూడా పెన్షన్‌ అందిస్తున్నాం. 'స్నేహస్పర్శం' అనే ప్రోగ్రాం ద్వారా వైద్యం అవసరమైన వారికి ఆర్థికసాయం చేస్తున్నాం. ఇల్లులేని వారికి ఇల్లు కట్టి ఇస్తున్నాం. ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారుల చదువుకోసం కూడా సాయం చేస్తున్నాం. పాప పేరు నందన.

మీకు బాగా కష్టంగా అనిపించిన పాట ఏది?

చిత్ర: అన్ని పాటలు సంగీత దర్శకుడు ఓకే చెప్పేవరకూ పాడతా. ఎంఎస్‌ రెడ్డిగారి సినిమాలో ఓ పాట కోసం చాలా కష్టపడ్డా. అందులో విజయశాంతి గారు నటించినట్లు ఉన్నారు. భర్త ప్రాణాలు కాపాడాలని దేవుడిని ప్రార్థిస్తూ పాడాల్సిన పాట. ఆ రోజు నేను పాట పాడకుండా వెళ్లిపోయా. ఎందుకంటే మరుసటి రోజు పుట్టపర్తిలో సంగీత కచేరి ఉంది. ఈ పాట పాడితే వారం రోజులు గొంతు స్వాధీనంలోకి రాదు. అందుకే సగం పాడి వెళ్లిపోయా. మామూలుగా కూడా నేను పెద్దగా మాట్లాడను. ఈ విషయం తెలిసి బాలుగారు నన్ను ఆటపట్టిస్తారు. 'ఈమె ఏమీ మాట్లాడరు. ఎనర్జీ అంతా సేవ్‌ చేసుకుంటారు' అని సరదాగా అంటుండేవారు.

తెలుగు పాటలు పాడుతున్న సమయంలో ఎస్పీబీ మీకేదో భాష నేర్పించారట ఏంటది?

చిత్ర: అది కూడా తెలుగే. సుజాత స్టూడియోలో ఉదయం నుంచి బాలుగారు పాటలు పాడుతున్నారు. అందులో నాతో కలిసి ఒక పాట పాడాలి. నేను వెళ్లే సరికి ఆయన రెడీగా ఉన్నారు. నాకోసం తెలుగు లిరిక్స్‌ వివరించి చెబితే, నేను మలయాళంలో రాసుకున్నా. ఇక పాడటం మొదలు పెట్టిన తర్వాత అందరూ ఒకటే నవ్వులు. 'నేను కరెక్ట్‌గానే పాడుతున్నానే. ఎందుకు నవ్వుతున్నారు' అని అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే బాలుగారు కుర్చీలో కూర్చొని ముఖానికి చేయి అడ్డం పెట్టుకుని నవ్వుతున్నారు. అసలు జరిగింది ఏంటంటే.. పాటలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పదాలు మార్చి 'వెధవా.. మూర్ఖుడా' అని అర్థం వచ్చేలా మాటలు పెట్టి బాలుగారు లిరిక్స్‌ ఇచ్చారు. నేను పాడే సరికి అందరూ ఒక్కసారిగా నవ్వారు. నేను కొన్ని నిమిషాల పాటు ఆశ్చర్యపోయా. ఆ తర్వాత సరదాగా ఆటపట్టించేందుకు అలా చేశానని బాలుగారు చెప్పారు. స్టేజ్‌పై కూడా బాలుగారు చాలా సరదాగా ఉండేవారు.

చిత్ర పాడినట్లు ఈ పాట ఉండకూడదు అని అన్నారట!

చిత్ర: 'ఊ. లల్లా.. ఊహూ లలల్లా..' (మెరుపు కలలు) పాట చిత్ర పాడినట్లు ఉండకూడదని అన్నారు. ఇలా పాడితే త్వరగా అలసిపోతాం. అయినా కూడా ప్రయత్నించా. ఇక రెహమాన్‌ పూర్తి స్వేచ్ఛనిస్తారు. అందరితోనూ ఒక సాధారణ వ్యక్తిలా ఉంటారు. అందరికీ గౌరవం ఇస్తారు.

రెహమాన్‌ సంగీత సారథ్యంలో ఒక పాట పాడితే అమెరికాలోని టైమ్‌ స్వ్కేర్‌లో ప్రదర్శించారట!

చిత్ర: ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ విచారంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌పై ఆశ కల్పించేలా ఒక ఆల్బమ్‌ చేశారు. గుల్జార్‌గారు రాశారు. అల్కయాజ్ఞిక్‌, సాధన సర్గమ్‌జీ, శ్రేయా ఘోషల్‌, సాక్షా తిరుపతి, అర్మాన్‌ మాలిక్‌తో పాటు మరొక అమ్మాయి పాడారు. ఆ పాట బాగా హిట్టయింది.

'బొంబాయి' సినిమాలో ఒక పాట పాడారు కదా!

చిత్ర: అవును మంచి పేరు వచ్చింది. చనిపోయేలోపు వినాల్సిన 1000 పాటల జాబితాలో ఆ పాట చేర్చారు.

గాయకుల్లో జేసుదాసు, ఎస్పీబీ కాకుండా మీకు ఎవరి వాయిస్‌ అంటే ఇష్టం!

చిత్ర: హరిహరన్‌గారి వాయిస్‌ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. ఆయన సింగింగ్‌ కూడా ఇష్టం.

గాయకుల విషయంలో అప్పటికీ, ఇప్పటికీ తేడా ఏంటి?

చిత్ర: నేను వచ్చిన సమయంలో ఎక్కువమంది గాయనీ, గాయకులు లేరు. సుశీలమ్మ, జానకిగారు, వాణీ జయరాం, జిక్కీ, జమునరాణి, ఎల్‌ఆర్‌ ఈశ్వరి గారు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు మ్యూజిక్‌ షోలు చాలా వచ్చాయి. కొత్త టాలెంట్‌ వస్తోంది.

మీ కెరీర్‌లో ఒకరోజులో అత్యధికంగా ఎన్ని పాటలు పాడారు?

చిత్ర: ఒక రోజు మలయాళంలో 16 పాటలు పాడా. ఆ రోజు ఇంటికి వెళ్లిన తర్వాత అమ్మ తిట్టారు. ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కదా! అని మందలించారు. అప్పుడు యంగ్‌ ఏజ్‌ కదా! అన్ని పాటలు పాడినా పెద్దగా కష్టం అనిపించలేదు. వేరే భాషల్లో ఒక రోజు 10 పాటలు పాడిన సందర్భాలూ ఉన్నాయి.

మీకు ఏ విషయంలో కోపం వస్తుంది?

చిత్ర: ఎక్కడెక్కడ ఏయే వస్తువులు ఉండాలో అవి అక్కడ ఉండాలి. అలా కాకుండా వేరే చోటకు మార్చితే కోపం వస్తుంది. ఇల్లంతా శుభ్రంగా ఉండాలి.

మీ సక్సెస్‌ మీ తల్లిదండ్రులు చూశారు కదా!

చిత్ర: సినిమాల్లో పాటలు పాడాలని నాకంటే ఎక్కువగా మా నాన్న పరితపించారు. మొదటిసారి జాతీయ అవార్డు వచ్చినప్పుడు బాధ కలిగించే ఘటన ఒకటి జరిగింది. అప్పుడు మా తండ్రిగారికి ఓరల్‌ క్యాన్సర్‌ వచ్చింది. నేను అవార్డు తీసుకునే కార్యక్రమానికి ఆయన రాలేకపోయారు.

బ్రిటిష్‌ పార్లమెంట్‌లో సన్మానం పొందిన మొదటి భారతీయ మహిళ మీరేనట!

చిత్ర: రాయల్‌ ఆల్బర్ట్ హాల్‌లో లతా మంగేష్కర్‌గారి తర్వాత నేను పాడాను. అదొక పెద్ద అచీవ్‌మెంట్‌. అందుకు సన్మానం చేశారు. చైనాలో ఎల్లో రివర్‌ వద్ద జరిగిన కచేరీలో పాట పాడా!

ఇదీ చదవండి: చిరు, బాలయ్య డైలాగ్స్​తో అలరించిన గాయని చిత్ర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.