ETV Bharat / sitara

One Movie Review: మమ్ముట్టి మరోసారి సీఎంగా మెప్పించారా? - వన్​ సినిమా ఆహా ఓటీటీ

మలయాళ స్టార్​ కథానాయకుడు మమ్ముట్టి మరోసారి ముఖ్యమంత్రి పాత్రలో నటించిన చిత్రం 'వన్​'. పొలిటికల్​ డ్రామాగా రూపొందిన ఈ సినిమా.. మలయాళంలో ఈ ఏడాది మార్చిలోనే ప్రేక్షకుల ముందుకు రాగా.. ఇప్పుడా చిత్ర డబ్బింగ్​ వర్షెన్​ను 'ఆహా' ఓటీటీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో అసలు సినిమా కథేంటి? మమ్ముట్టి మరోసారి సీఎంగా మెప్పించారా? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ సమీక్ష(One Movie Review) చదివేయండి.

Mammootty's Political Drama ONE Movie Review
One Movie Review: మమ్ముట్టి మరోసారి సీఎంగా మెప్పించారా?
author img

By

Published : Jul 30, 2021, 4:23 PM IST

చిత్రం: వన్‌;

నటీనటులు: మమ్ముట్టి, మురళీగోపి, జోజు జార్జ్‌, మాథ్యూ థామస్‌ తదితరులు;

సంగీతం: గోపీ సుందర్‌;

ఎడిటింగ్‌: నిషద్‌ యూసఫ్‌;

సినిమాటోగ్రఫీ: వైద్య సోమసుందరమ్‌;

రచన: బాబీ, సంజయ్‌;

నిర్మాత: శ్రీలక్ష్మి;

దర్శకత్వం: సంతోష్‌ విశ్వనాథ్‌;

విడుదల: ఆహా

Mammootty's Political Drama ONE Movie Review
మమ్ముట్టి 'వన్​' సినిమా పోస్టర్​

ఇటీవల కాలంలో మలయాళంలో విజయం సాధించిన పలు చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక మలయాళంతో పాటు, తెలుగువారికి కూడా సుపరిచితమైన నటుడు మమ్ముట్టి. గతంలోనూ ఆయన ఒకట్రెండు తెలుగు చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం ఆయన నటించిన పొలిటికల్‌ డ్రామా 'వన్‌'. ఈ ఏడాది మార్చిలో మలయాళంలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు 'ఆహా' ఓటీటీ వేదికగా తెలుగులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అసలు సినిమా కథేంటి? మమ్ముట్టి సీఎంగా ఎలా నటించారు?

కథేంటంటే?

దాస్‌ ఓ హోటల్‌లో వెయిటర్‌గా పనిచేస్తుంటాడు. ఫుడ్‌ డెలివరీ ఇవ్వడానికి ఓ అపార్ట్‌మెంట్‌కు వెళ్తాడు. కరెంటు పోవడం వల్ల సెక్యూరిటీకి ఇచ్చి వెళ్తానని చెప్పినా, ఫుడ్‌ ఆర్డర్‌ చేసిన వ్యక్తి అందుకు ఒప్పుకోడు. దీంతో 12 అంతస్తులు ఎక్కి, ఆర్డర్‌ చేతికి ఇచ్చే సరికి తీవ్ర అస్వస్థతకు గురవుతాడు. దీంతో అతని కుమారుడు సంజయ్‌(మాథ్యూ థామస్‌), కుమార్తె సీనా (గాయత్రి అరుణ్‌) కలిసి తండ్రిని ఆస్పత్రిలో చేర్చి, ఫుడ్‌ డెలివరీ తీసుకున్న వ్యక్తి ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకుంటారు. అక్కడి నుంచి ఆస్పత్రికి తిరిగొచ్చే సరికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్లూరి రామచంద్రం(మమ్ముట్టి) వైద్య పరీక్షల నిమిత్తం అప్పటికే ఆస్పత్రికి వచ్చి ఉంటాడు.

దీంతో సంజయ్‌, అతని అక్కని పోలీసులు లోపలికి వెళ్లనివ్వక పోగా, సంజయ్‌పై దాడి చేస్తారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా సంజయ్‌ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెడతాడు. అది కాస్తా వైరల్‌గా మారడం వల్ల ప్రతిపక్షం ఆ పోస్ట్‌ పట్టుకుని ధర్నాలకు, ఆందోళనలకు పిలుపునిస్తుంది. ఆ పోస్ట్‌ కాస్తా చినికి చినికి గాలి వానలా ఎలా మారింది? అప్పుడు సీఎం కల్లూరి రామచంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి పునాది ఎలా పడింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే?

స్థానిక కార్పొరేటర్‌ నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకూ జరిగే రాజకీయాల నేపథ్యంలో ఎన్నో చిత్రాలు వచ్చాయి. 'ఒకే ఒక్కడు', 'లీడర్‌', 'నేనే రాజు నేనే మంత్రి', 'భరత్‌ అనే నేను' ఇలా చెప్పుకొంటూ పోతే చాలా చిత్రాలే ఉన్నాయి. ఒక్కో చిత్రంలో ఒక్కో పాయింట్‌ను దర్శకులు టచ్‌ చేశారు. గతంలో వచ్చిన చిత్రాలకు పూర్తి భిన్నమైన పాయింట్‌ను దర్శకుడు సంతోష్‌ విశ్వనాథ్‌ ఎంచుకున్నారు. రిప్రజెంటేషన్‌ ఆఫ్‌ ది పీపుల్‌ అమెండ్‌మెంట్‌ బిల్లు 'ఆర్‌ రైట్‌ టు ది రీకాల్‌'.. తమ నాయకుడి పనితీరు సంతృప్తిగా లేకపోతే ఐదేళ్లు పూర్తికాకముందే ఆ నాయకుడిని రీకాల్ చేసే అవకాశం ఓటర్లకు ఉండాలి. ఒక నియోజకవర్గంలో 50శాతం లేదా అంతకంటే ఎక్కువమంది ఓటర్లు తమ నాయకుడు పనితీరు సరిగాలేదని స్పీకర్‌కు లేఖ ఇస్తే, ఆ ప్రాంతంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి. ఈ పాయింట్‌ కొత్తగా ఉన్నా, దాన్ని తెరపై చూపించడంలో అంచనాలను అందుకోలేకపోయారు. తర్వాత ఏం జరుగుతుందో సినిమా ప్రేక్షకుడికి అర్థమైపోతుంటుంది.

ఫుడ్‌ డెలివరీ చేసే వ్యక్తి అస్వస్థతకు గురవడం వల్ల కథను మొదలు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్‌కు రావడానికి చాలా సమయం తీసుకున్నాడు. ప్రథమార్ధం దాదాపు అయిపోతుంది. కీలక పాత్రధారి, ముఖ్యమంత్రి కల్లూరి రామచంద్రం పాత్ర తెరపై కనిపించడానికి అరగంటపైనే పడుతుంది. అయితే, సీఎంకు వ్యతిరేకంగా పోస్ట్‌ చేసిన సంజయ్‌ను ఏం చేస్తారన్న ఉత్కంఠతో ఆసక్తి కలిగించేలా ఆయా సన్నివేశాలను తీర్చిదిద్దాడు దర్శకుడు. అక్కడి నుంచి సీఎం చుట్టూ ఎలాంటి రాజకీయాలు జరుగుతాయి? ప్రభుత్వంలో ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పదవులు కాపాడుకోవటం కోసం ఎలాంటి బెదిరింపులకు పాల్పడతారు? ప్రభుత్వాన్ని విమర్శల పాలు చేయడానికి ప్రతిపక్షం ఎలాంటి కుట్రలు చేస్తుందన్న విషయాలను చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు.

ఆయా సన్నివేశాలన్నీ 'లీడర్‌' మూవీకి దగ్గరగా ఉంటాయి. అయితే, సొంత పార్టీ నేతలతో సీఎం జరిపే సమావేశం నేడు ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలకు ఎదురయ్యే పరిస్థితులను చక్కగా ప్రతిబింబించింది. 'ఎటు అవకాశం ఉంటే అటు మారడమే సీనియారిటీ అనుకుంటే, నాకు ఈయనపై చెప్పేలేనంత గౌరవం ఉంది' వంటి డైలాగ్‌లు నేటి రాజకీయ నాయకుల కప్పదాట్లను సూటిగా ప్రశ్నించాయి. ద్వితీయార్ధం మొత్తం 'రైట్‌ టు రీకాల్‌', ప్రతిపక్షాలు చేసే కుట్రల చుట్టూ తిరుగుతుంది. ప్రతి సన్నివేశం తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకుడు సులభంగా ఊహించగలడు. సీఎం ఆటోలో వెళ్లడం, యూనివర్సిటీలో స్పీచ్‌ తదితర సన్నివేశాలు మాత్రం చప్పట్లు కొట్టిస్తాయి. క్లైమాక్స్‌ కూడా ఊహించేదే.

ఎవరెలా చేశారంటే?

మలయాళంలోనే కాదు, తెలుగు ప్రేక్షకులకు తెలిసిన నటుడు మమ్ముటి. ఈ కథకు ఆత్మ ఆయనే. కథ మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతుంది. ముఖ్యమంత్రి పాత్రలో హుందాగా కనిపించారు. ఆయన నటనకు పేరు పెట్టాల్సిన పనిలేదు. మమ్ముటి పాత్రను ఇంకాస్త బలంగా తీర్చిదిద్దాల్సింది. మురళి గోపీ, జోజు జార్జ్‌, మాథ్యూ థామస్‌ ఇలా ఎవరి పాత్రలో వారు ఒదిగిపోయారు. గోపీ సుందర్‌ నేపథ్య సంగీతం ప్రేక్షకుడిని కథలో లీనం చేస్తుంది. వైద్య సోమసుందర్‌ సినిమాటోగ్రఫీ ఓకే.

వైవిధ్యం చూపించడానికి పెద్దగా ఆస్కారం లేదు. నిషాద్‌ యూసఫ్‌ ఎడిటింగ్‌కు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఒక పాయింట్‌ చుట్టూ తిరిగే కథకు 152 నిమిషాల నిడివి ఎక్కువ. థియేటర్‌లో చూసే ప్రేక్షకుడు బోర్‌ ఫీలవుతాడు. అలాంటిది ఎక్కడికి కావాలంటే అక్కడకు స్కిప్‌ చేసుకునే వెసులుబాటు ఉన్న ఓటీటీల్లో ఇక పరిస్థితి చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడు సంతోష్‌ విశ్వనాథ్‌ ఎంచుకున్న పాయింట్‌ బాగున్నా, ప్రభావవంతంగా చూపించలేకపోయారు. సగటు ప్రేక్షకుడు ఆశించే కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ ఉండవు. కేవలం ఒక పొలిటికల్‌ డ్రామాగా మాత్రమే కథ, కథనాలు నడుస్తాయి. నిడివి విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది.

'ప్రభుత్వాన్ని విమర్శించడానికి దారులు వెతుక్కోవడం, 'లా అండ్‌ ఆర్డర్‌'ను ఎలా చెడగొట్టాలా? అని చూడటం నేటి రాజకీయాల్లో ప్రతి పక్షాలు పోషిస్తున్న పాత్ర ఇది. ప్రజల్లో మీపై విశ్వాసం పెరగాలంటే చేయాల్సింది.. ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయేలా చేయటం అని మీరు అనుకుంటున్నారు. కానీ, ప్రతిపక్షం వ్యతిరేక పక్షం కాదు.. మరో పక్షం అంతే' వంటి సంభాషణలు బాగున్నాయి.

బలాలు బలహీనతలు
+ మమ్ముటి- నిడివి, ఊహించే సన్నివేశాలు
+ దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌- నెమ్మదిగా సాగే కథనం
+ అక్కడక్కడా మెరుపు సంభాషణలు

చివరిగా: ఎంచుకున్న పాయింట్‌ నెం.'వన్‌' కానీ, ప్రజెంటేషన్‌ 'జీరో'.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.