బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్, తాను(raveena tandon salman khan movie) ఎప్పుడూ గొడవపడేవారని గుర్తుచేసుకుంది నటి రవీనా టాండన్. వీరిద్దరూ జంటగా కలిసి నటించిన తొలి సినిమా 'పత్తర్ కే ఫూల్'(raveena tandon salman khan). దర్శకుడు అనంత్ బలానీ తెరకెక్కించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ భామ.. ఆ మూవీ షూటింగ్ సమయంలోని తన అనుభవాలను తెలుపుతూ సల్మాన్‌తో తనకున్న అనుబంధం గురించి చెప్పింది.
"నా తొలి సినిమా సమయానికి నా వయసు 16ఏళ్లు, సల్మాన్ వయసు 23. సినిమా షూటింగ్ సమయంలో చిన్న పిల్లల్లా ప్రతి విషయానికి గొడవ పడేవాళ్లం. మా ఇద్దరిదీ ఒకే మనస్తత్వం. సల్మాన్ తండ్రి సలీమ్, మా నాన్న కలిసి పనిచేసేవారు. అలా చిన్నప్పటి నుంచే అతను నాకు తెలుసు. కలిసి పెరిగాం. అప్పట్నుంచే మాకు పడేది కాదు. షూటింగ్లలోనూ తగాదా పడేవాళ్లం. దాంతో ఎప్పటికీ నాతో సినిమా చేయనని సల్మాన్ అనేవాడు. కానీ ఆ తర్వాత మా కాంబినేషన్లో కామెడీ క్లాసిక్ చిత్రాలు 'అందాజ్ అప్నా అప్నా', 'కహీ ప్యార్ నా హోజాయే' విడుదలై ఆకట్టుకున్నాయి."
-రవీనా టాండన్, నటి.
దీంతోపాటే హీరోలందరూ తన ఫేవరెట్ కోస్టార్స్ అని చెప్పింది రవీనా టాండన్. బీటౌన్ నటులు సల్మాన్ ఖాన్‌తో సహా సంజయ్ దత్, సునీల్, జగ్గు, గోవిందా తన బడ్డీస్ అని చెప్పింది(raveenatandon movies).
బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నటి రవీనా టాండన్. 'పత్తర్ కే ఫూల్'తోనే ఆమె వెండితెర అరంగేట్రం చేసింది. వచ్చే ఏడాదిలో కన్నడ స్టార్ యశ్ నటించిన 'కేజీఎఫ్ 2'తో(raveena tandon kgf 2 role) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో తాను ప్రధాన మంత్రి పాత్ర పోషించింది(raveena tandon kgf look). దీంతో పాటు నెట్ఫ్లిక్ రూపొందిస్తున్న 'Aranyak' వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది.
ఇదీ చూడండి: హిట్ కొట్టినా ఛాన్సే రాలేదు.. చాలా బాధపడ్డా: సల్మాన్