ETV Bharat / sitara

జూ.ఆర్టిస్ట్​గా పనికిరావని విజయ్ సేతుపతిని తిట్టేవారు! - విజయ్ సేతుపతి న్యూస్

జీవితంలో నటుడిగా మారే క్రమంలో తాను పడిన కష్టాల గురించి, ఆ ప్రయాణంలో ఎదుర్కొన్న అనుభవాల గురించి ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి వెల్లడించారు. హిజ్రా పాత్ర చేయడమే తనకు దక్కిన పెద్ద అవార్డు అని చెప్పారు.

VIJAY SETHUPATHI CAREER AND HIS LIFE STORY
జూ.ఆర్టిస్ట్​గా పనికిరావని విజయ్ సేతుపతిని తిట్టేవారు!
author img

By

Published : Apr 18, 2021, 9:01 AM IST

సందేహమే అక్కర్లేదు... దక్షిణాదికి దక్కిన మరో సూపర్‌స్టార్‌ అతను! మన ఐదు రాష్ట్రాలవాళ్లూ తమ భాషలకతీతంగా ప్రేమిస్తున్న నటుడు. స్టార్‌ అంటే తమ ఇమేజ్‌ను ఆకాశమంత పెంచే 'సూపర్‌హీరో'గానే కనిపించాల్సిన అవసరం లేదంటూ తనదైన పాత్రలతో కొత్త నిర్వచనం ఇస్తున్నాడు. విలన్‌, సహాయ నటుడు, హిజ్రా... ఏది చేసినా విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్నాడు. ఇటీవల జాతీయ అవార్డు కూడా అందుకున్న విజయ్‌ సేతుపతి జీవిత గమనం ఏ సినిమా స్క్రిప్టుకూ తీసిపోదు...

ఆరోజు దర్శకుడు బాలుమహేంద్రను చూడాలనుకున్నాను. కొన్ని నెలల ప్రయత్నం తర్వాత ఆవాళే అపాయింట్‌మెంట్‌ దొరికింది. వెళుతున్నప్పుడే 'వసంతకోకిల', 'నిరీక్షణ' వంటి ఎన్నో సినిమాలు కళ్లముందు కదలాడి ఉద్విగ్నానికి లోనయ్యాను. ఆయన ముందుకెళ్లగానే 'బాబూ! నేను ఇప్పటికిప్పుడు చేసే సినిమాలంటూ ఏమీ లేవు. నువ్వు ఛాన్స్‌ కోసం వస్తే మళ్లీరా!' అన్నారు. ‘మీ దగ్గరకి నేను అందుకోసం రాలేదండీ!’ అన్నాను. ‘మరి..?’ అన్నట్టు చూశారు తన నళ్లకళ్లద్దాలని కాస్త పైకెత్తి. ‘నటుడిగా ఛాన్స్‌ అడగడానికి నాకంటూ మంచి పోర్ట్‌ఫోలియో ఫొటోలు లేవు. నా దృష్టిలో మీరు గొప్ప ఫొటోగ్రాఫర్‌ కూడా. నా ఫొటోలు తీసిపెడతారా!’ అని అడిగాను. మన సినీరంగానికి ఆణిముత్యాల్లాంటి చిత్రాలనిచ్చిన అంతపెద్ద దర్శకుణ్ణి అలా ఫొటోలు తీయమనడం తప్పే అయినా... అప్పట్లో అదో పెద్ద కల నాకు. నా కోరిక వినగానే ‘నన్నెవరూ ఇలా అడగలేదయ్యా!’ అంటూ పెద్దగా నవ్వేశారు. అప్పటికప్పుడు తన కెమెరా సిద్ధం చేసి రకరకాల యాంగిల్స్‌లో ఫొటోలు తీశారు. వాటి ప్రింట్లను నాకు ఇస్తూ ‘నేను చూసిన చక్కటి ఫొటోజెనిక్‌ ఫేస్‌లలో నీదీ ఒకటి. మంచి నటుడివి అవుతావ్‌!’ అని ఆశీర్వదించారు. నటుడిగా నాపైన నాకు నమ్మకం వచ్చిన తొలి సందర్భం అది. నాకు నమ్మకం వస్తే చాలా... ప్రపంచం నమ్మొద్దూ... కనీసం నా భార్యయినా నమ్మొద్దూ! నా సమస్య అదే అప్పట్లో. నా భార్య జెస్సీకి నా సినిమా ప్రయత్నాలు అస్సలు నచ్చేవి కావు. అందుకే బాలుమహేంద్రగారు తీసిన ఫొటోలను తనకు కనిపించకుండా మా ఇంట్లో అద్దం వెనక భద్రంగా దాచాను. అవసరమైనప్పుడు వాటిని తీసుకుని వెళుతుండేవాణ్ణి. ఓ రోజు అవి జెస్సీ కంటపడ్డాయి. ఆరోజు మా అమ్మానాన్నా ఇంట్లోనే ఉన్నారు. వాళ్ల ఎదుట గొడవపడటం బావుండదనేమో... ‘నీతో మాట్లాడాలి. బయటకొస్తావా!’ అంది. అప్పటికి మావాడు సూర్య కడుపులో ఉన్నాడు... నాలుగో నెల. నేను తన వెనకే వెళ్లాను. ఇద్దరం ఇంటి నుంచి కాస్త దూరంగా వెళ్లగానే చటుక్కున నా కుడిచేతిని తీసుకుని తన పొట్టపైన పెట్టి ‘పుట్టబోయే మన బిడ్డపైన ఒట్టేసి చెప్పు విజీ... మరోసారి సినిమాలకి ప్రయత్నించనూ అని!’ అంది. తన కళ్లలోకి చూశాను. కోపం, భయం, ఆవేదనా... అన్నీ కలగలిసి కన్నీళ్లుగా ఉబుకుతున్నాయి. నాకళ్లలోనూ నీళ్లు తిరిగాయి. నా చేతిని తన పొట్టపైన అలాగే ఉంచి ‘ఒట్టు... ప్రయత్నించను!’ అన్నాను. అనడమే కాదు తన చేతిలో ఉన్న ఫొటోలని తీసుకుని ముక్కలుగా చించేసి ‘పద ఇంటికి పోదాం!’ అన్నాను. తనని మెల్లగా ఇంటివైపు నడిపిస్తూ... నా చేతిలో ఉన్న ఫొటో ముక్కల్ని చెత్త బుట్టలో పడేశాను...

VIJAY SETHUPATHI
విజయ్ సేతుపతి

ఎందుకు పనికొస్తానబ్బా...

మా ఆవిడ జెస్సీకి సినిమాలపైనున్న ఆ భయం... ఓ రకంగా మనందరిదీ కూడా. కాలికింద ఉన్న ఆధారాన్ని కాదనుకుని ఆకాశానికి ఎగరాలన్న ప్రయత్నంగానే దాన్ని ఓ మధ్యతరగతి మనస్తత్వం భావిస్తుంది. జెస్సీ భయం అర్థంలేనిదేమీ కాదు. అప్పట్లో మా ఆర్థిక పరిస్థితి కూడా ఏమంత బావుండేది కాదు. మా నాన్న కాళిముత్తు... సివిల్‌ ఇంజినీరు. చిన్న చిన్న బిల్డింగ్‌ కాంట్రాక్టులకి పనిచేస్తుండేవాడు. సంఘసంస్కర్త పెరియార్‌ ఈవి రామస్వామిగారి ‘ద్రవిడ’ సిద్ధాంతాలని వంటపట్టించుకున్నవాడు. సంఘసంస్కరణల్లో పోరాడినవాడు... పరమ నాస్తికుడు. ఇంట్లో నలుగురం పిల్లలం... మా అన్నయ్యా, తర్వాత నేనూ, నా తర్వాత ఓ తమ్ముడూ, ఓ చెల్లెలూ. మాకంటూ ఆయన ఏ ఆస్తీ సంపాదించినవాడు కాదు. ‘సివిల్‌ ఇంజినీర్‌వై ఉండి ఒక్క ఇల్లైనా సంపాదించలేకపోయావ్‌!’ అని మేం ఎగతాళిగా మాట్లాడితే చిరునవ్వుతో చూస్తుండిపోయేవాడు. ఆయన ఏదీ సీరియస్‌గా తీసుకోడు. అదేమిటో సంపాదనంటే ఆయనకి చాలా చిన్నచూపు. జీవితంలో మేమెంత ధైర్యంగా, గౌరవంగా బతకాలో పదేపదే చెప్పినా... పొదుపు మాట మాత్రం ఎత్తేవాడు కాదు. సహజంగానే అమ్మకి నాన్న తీరు నచ్చేది కాదు. పాపం... డబ్బులేక ఎన్ని కష్టాలు పడిందో ఏమో, ‘డబ్బే అన్నింటికీ మూలం’ అని చెబుతుండేది. మా స్వస్థలం తమిళనాడులోని రాజపాళయం అయినా... నా పదకొండో ఏట చెన్నై వచ్చేశాం. చదువులో బిలో యావరేజీ విద్యార్థిని... స్పోర్ట్స్‌, కల్చరల్స్‌ వంటివాటిలోనూ పెద్దగా ఆసక్తిలేదు. ‘అటు చదువూలేదు... ఇటు ఇతర వ్యాపకాలూ లేవు. నేను ఎందుకు పనికొస్తానబ్బా!’ అన్న ప్రశ్నతోనే టీనేజీ గడిచిపోయింది. నేను డిగ్రీ ముగించేనాటికి అన్నయ్య పీజీ చేస్తున్నాడు. తమ్ముడూ, చెల్లెళ్లిద్దరూ చదువుతున్నారు. నాన్న ఒక్కడి జీతంతోనే ఇంతమంది కడుపునిండటం కష్టమయ్యేది. అందువల్ల డిగ్రీ పూర్తయిన వారం రోజులకి ఓ సిమెంటు కంపెనీలో అకౌంట్స్‌ అసిస్టెంట్‌గా చేరాను. అప్పట్లో సీఏ, ఐసీడబ్ల్యూఏల్లో చేరానుకానీ... వాటిల్లో ఫౌండేషన్‌ కోర్సు కూడా దాటలేకపోయాను! ఓ ఏడాదిపాటు సిమెంటు కంపెనీలో పనిచేశాక... అక్కడివాళ్లు ఎవరో చెప్పారు దుబాయ్‌కి వెళితే ఇప్పుడు వస్తున్న దానికంటే నాలుగురెట్లు ఎక్కువ జీతం వస్తుందని. దాంతో నా ఫ్రెండ్స్‌ దగ్గర తలాకొంత అప్పుతీసుకుని దుబాయ్‌ వెళ్లాను. రాత్రీపగలూ అని లేకుండా పనీ... అంతంతమాత్రం భోజనం... విపరీతమైన వేడి... ఇన్ని సమస్యలు ఉంటేనేం, అక్కడ నేను ఊహించినదానికన్నా ఎక్కువ జీతమే వచ్చింది. మూడేళ్లలో మా కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేశాను. అన్నయ్యా, తమ్ముడూ సెటిలైపోయారు. ఆ ఆనందంలో ఉండగానే నాకు ఆన్‌లైన్‌లో జెస్సీ పరిచయమైంది.

ఆన్‌లైన్‌ ప్రేమ పండింది...

కాలేజీలో చదువుకునేటప్పుడు ఓసారీ, ఉద్యోగానికి వెళ్లేటప్పుడు మరోసారీ నేను ప్రేమలో పడ్డా... అవన్నీ వన్‌సైడ్‌ లవ్వులే. ఆ అమ్మాయిలకి నా ప్రేమని చెప్పేంత ధైర్యం చాలలేదు. కానీ జెస్సీ ‘యాహూ మెసెంజర్‌’లº పరిచయమైన వారానికే ప్రపోజ్‌ చేసేశాను. ఆ రోజే తను ఓకే చెప్పింది కూడా! మరో ఐదు నెలలకి కేరళకి చెందిన జెస్సీ మా ఇంటి కోడలైంది. పెళ్ళిలోనే తనని మొదటిసారి నేను నేరుగా చూడటం! పెళ్ళయ్యాక నాన్న నన్ను దుబాయ్‌ వెళ్లొద్దనడంతో ఇక్కడే ఉండిపోయాను. మా ఫ్రెండ్స్‌తో కలిసి ఇంటీరియర్‌ డెకరేషన్‌ బిజినెస్‌ చేశాను కానీ... అది సరిగ్గా సాగక ఆపేశాను. ఆ తర్వాత రెడీమేడ్‌ కిచెన్‌లు తయారుచేసే ఓ కంపెనీలో మార్కెటింగ్‌ విభాగంలో చేరాను. ఆ సంస్థ కోసం ఓసారి వ్యాన్‌లో వెళ్తుండగానే... ఆ వెనక ఓ పోస్టర్‌ కనిపించింది. అదో రంగస్థల నాటకం ప్రదర్శనకి సంబంధించిన ప్రకటన. చెన్నైకి చెందిన ‘కూత్తుపట్టరై’ అనే సంస్థది. ఆరోజు నా డ్యూటీ కాగానే ప్రదర్శనకెళ్లాను. రంగస్థలంపైన సహజంగా మనకుండే చిన్నచూపునంతా ముక్కలుముక్కలు చేసిందా నాటకం. నటనంటే ఇంత సహజంగా గొప్పగా ఉంటుందా అనిపించింది. అప్పుడే నేనూ వాళ్లలా నటుణ్ని కావాలనుకున్నాను. ఆ సంస్థ నిర్వాహకుడి దగ్గరకెళ్లి నా కోరిక చెబితే ‘మాకు నటులు అక్కర్లేదు కానీ... అకౌంటెంట్‌ కావాలి. వస్తారా!’ అన్నారు. ‘సరే’ అన్నాను. అలా వాళ్లు నాటకాలేస్తుంటే నేను అకౌంట్స్‌ రాస్తుండేవాణ్ణి. ఏడాది తర్వాత నా ఉత్సాహం చూసి నన్నూ నటించమన్నారు. ‘నాకు ఎవ్వర్నీ అనుకరించడం రాదు... మిమిక్రీ అయినా చేయలేను. నాకు నటన వస్తుందా!’ అని అడిగితే ‘అదీ మంచిదే. నీపైన ఎవరి ప్రభావమూ ఉండదు... నీలోని నువ్వే బయటకొస్తావు’ అని చెప్పారు. అదీ ప్రారంభం. మరో ఆరునెలల తర్వాతే బాలుమహేంద్రగారి దగ్గరకెళ్లి ఫొటోలు తీయించుకున్నాను. జెస్సీ మొదట్లో నటనపట్ల నా ఆసక్తిని పెద్దగా పట్టించుకోకున్నా... రాన్రానూ తనలో ఆందోళన పెరిగింది. గర్భిణి అయ్యాక అది ఇంకా ఎక్కువైంది. ఫలితమే ఆ రోజు నా చేత అలా ఒట్టేయించుకోవడం!

VIJAY SETHUPATHI
విజయ్ సేతుపతి

ఓ సంఘర్షణ..

మా ఆవిడా, అమ్మా నా నటనని వ్యతిరేకించినా... నాన్న ప్రోత్సహించాడు. ‘డబ్బులు రావేమోనని భయపడితే... నీకు జీవితంలో నటించే అవకాశం మళ్లీ రాకపోవచ్చు. కాబట్టి ధైర్యంగా వెళ్లు!’ అనేవాడు. నాకూ జెస్సీకీ మధ్య ఘర్షణని అర్థం చేసుకుని తనే కోడలికి అతికష్టంపైన నచ్చజెప్పాడు. అలా నాన్న ఇచ్చిన ధైర్యంతో మళ్లీ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించడం మొదలుపెట్టాను. ధనుష్‌ హీరోగా పుదుప్పేట్టై(తెలుగులో ధూల్‌పేట) అనే సినిమాకి ఆడిషన్‌కి వెళ్లి సెలెక్టయ్యాను. ఆ తర్వాత, ఎం.కుమరేశన్‌ సన్నాఫ్‌ మహలక్ష్మి(తెలుగు ఇడియట్‌) సినిమాలో, వర్ణం అని మరో సినిమాలోనూ నటించాను. రోజుకి రూ.250 ఇచ్చేవారు కానీ ఆ మూడు సినిమాల్లోనూ టైటిల్స్‌లో నా పేరు కనిపించదు. విలన్‌ గ్రూపులో ఒకడిగా, హీరో ఫ్రెండ్స్‌ మధ్య వెనక నిల్చున్న వ్యక్తిగా... ఇలా నేను చేసినవి చాలా చిన్న పాత్రలు మరి! అప్పట్లో ప్రతిరోజూ అవమానాలతోనే ఇంటికి వచ్చేవాణ్ణి. జూనియర్‌ ఆర్టిస్టుగా కూడా పనికిరావు పొమ్మని తిట్టేవారు. అప్పుడే ఓ టీవీ సీరియల్‌లో హీరో పాత్ర వచ్చింది. ఓ ప్రైవేటు టీవీ ఛానెల్‌లో కొత్త దర్శకులకి పోటీపెడుతుంటే ఆ కొత్తవాళ్ల కోసం కొన్ని షార్ట్‌ఫిల్మ్స్‌లో నటించాను. కార్తిక్‌ సుబ్బరాజ్‌, శీనూ రామస్వామి, నలన్‌ కుమారస్వామి వంటి యువదర్శకులు అలా పరిచయమయ్యారు. వాళ్లలో శీను రామస్వామి 2010లో నాకో స్క్రిప్టు ఇచ్చి చదవమన్నాడు. మూడు రోజుల తర్వాత ఫోన్‌ చేసి ఆ కథలో హీరోని నేనేనని చెప్పాడు. ఏదో ఒకటి ఓ మంచి అవకాశం వస్తే చాలనుకుని చేశాను. ‘తెన్‌ మేర్కు పరువకాట్రు’ అన్న ఆ సినిమా కమర్షియల్‌గా హిట్టు సాధించడమే కాదు... మూడు జాతీయ అవార్డులు అందుకుంది. ఆ తర్వాత నా దశ తిరిగిపోయింది... అనే అనుకున్నాను కానీ, అలా జరగలేదు...

‘కథ చెప్పాలా తమరికి!’

నా సినిమా హిట్టయ్యాక కొంతమంది నిర్మాతలొచ్చారు. నేను ఎంత తక్కువ రెమ్యూనరేషన్‌ అడిగినా ‘నీకు అంత మార్కెట్‌లేదు!’ అనేవారు. ‘సరే సార్‌! కథ నచ్చితే ఫ్రీగా చేస్తాను’ అనేవాణ్ణి. ‘నీ మొహానికి కథ కూడా చెప్పాలా. కావాలనుకుంటే చెయ్‌...!’ అనేవారు కానీ నేను మాత్రం కథ చెప్పాలనే పట్టుబట్టేవాణ్ణి. ఆ నేపథ్యంలోనే ‘పిజ్జా’ కథతో వచ్చాడు నాకు టీవీల్లో పరిచయమైన కార్తిక్‌ సుబ్బరాజ్‌. తెలుగులో కూడా డబ్‌ అయి మంచి హిట్‌ అందుకున్న ఆ సినిమానే... నన్ను స్టార్‌ని చేసింది. దానితో మొదలుపెట్టి ఈ ఏడేళ్లలో 45 సినిమాలు చేసేశాను. ప్రతి పాత్రా జీవితంలో నుంచి వచ్చిందై ఉండేలా చూసుకున్నాను. ప్రతిదాన్నీ ఓ పరీక్షలాగే అనుకుని నటిస్తున్నాను. మరో వందేళ్ల తర్వాత నా పేరుకన్నా నా పాత్రలే నిలవాలనీ... అవి వీలున్నంత ఎక్కువగా ఉండాలనే నేను ఆశపడుతున్నాను. చిన్నదైనా సరే ‘సైరా’లోనూ, విలన్‌గానైనా ‘ఉప్పెన’లోనూ ఆ కోరికతోనే చేశాను. ఇక, ‘సూపర్‌ డీలక్స్‌’ సినిమాలోని శిల్ప అన్న హిజ్రా పాత్ర కూడా నేను కోరుకుని... ప్రాథేయపడి మరీ చేసిందే. దానికోసం నాలుగు నెలలపాటు మనసావాచా ఓ మహిళగానే మారిపోయాను. స్త్రీ ఔన్నత్యాన్ని అర్థం చేసుకున్నాను. ఆ పాత్రే నాకు దక్కిన పెద్ద అవార్డు... దానికి జాతీయ అవార్డూ వస్తే అంతకన్నా ఏం కావాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.