ETV Bharat / sitara

ఆ విషయంలో తాప్సీ తర్వాత విద్యాబాలన్​ - vidya balan starts shooting

సినిమా చిత్రీకరణలకు సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో షూటింగ్​కు హాజరైనట్లు వెల్లడించింది బాలీవుడ్ నటి విద్యాబాలన్. ఆ ఫొటోలను ఇన్​స్టాలో పోస్ట్ చేసింది.

vidyabalan
విద్యాబాలన్​
author img

By

Published : Jul 8, 2020, 5:48 PM IST

కరోనాతో దాదాపు మూడునెలలపాటు నిలిచిపోయిన చిత్రీకరణలు, ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపుల్లో భాగంగా పునఃప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో బాలీవుడ్​ నటి విద్యాబాలన్​.. తాను షూటింగ్​లో పాల్గొన్నట్లు తెలిపింది. ఆ ఫొటోను ఇన్​స్టోలో పోస్ట్ చేసింది. 'బ్యాక్​ టు వర్క్' అనే వ్యాఖ్యను జోడించింది. ​ ఈ ఫొటోలో ఆమె మేకప్​ వేసుకుంటున్నట్లు కనిపించింది.

makep
మేకప్​ రూమ్​

దీంతో పాటు ప్రముఖ నిర్మాత శాంతి శివరామ్​ కూమార్తె 'అగస్త్య అకా గుస్తొ' ఫొటోను పోస్ట్​ చేసింది. 'నా ఆత్మీయురాలిని మరిచిపోను' అని విద్యాబాలన్ రాసుకొచ్చింది.

agustya
అగస్ట్య అకా గుస్తొ

అయితే తాను ఏ సినిమా షూటింగ్​లో పాల్గొన్నది విద్యాబాలన్ చెప్పలేదు. ఈమె నటించిన 'శకుంతలా దేవి' సినిమా జులై 31 నుంచి అమెజాన్ ప్రైమ్​లో స్ట్రీమింగ్ కానుంది. దీనిని ప్రముఖ గణిత శాస్త్రవేత్త శకుంతలదేవీ జీవితం ఆధారంగా తెరకెక్కించారు.

కరోనా నేపథ్యంలో ఇప్పటివరకు బాలీవుడ్​ నటీనటులు ఎవరూ షూటింగ్​ల్లో పాల్గొనలేదు. అయితే తొలిసారిగా తాప్సీ సెట్​లో అడుగుపెట్టగా.. తాజాగా విద్యాబాలన్ తన సినిమా చిత్రీకరణకు​ హాజరైంది.

ఇది చూడండి : కరోనాకు భయపడని తాప్సీ.. షూటింగ్​కు హాజరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.