Urvashi rautela gold dress: తన వ్యాఖ్యలతో పలుమార్లు వివాదాల్లో నిలిచిన బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండే ఈ భామ.. ఎప్పటికప్పుడు తన ఫొటోలు, వీడియోలతో నెటిజన్లను అలరిస్తూ ఉంటుంది. ఇప్పుడు బాగా ఖరీదైన డ్రస్‌లో కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసింది.
ఆ డ్రస్ సంగతేంటి?
అరబ్ ఫ్యాషన్ వీక్‌లో ఇప్పటికే పాల్గొన్న ఊర్వశి రౌతేలా.. మన దేశం నుంచి అందులో పార్టిసిపేట్ చేసిన ఏకైక సెలబ్రిటీగా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఆ ఈవెంట్లో ర్యాంప్‌వాక్ చేసి రికార్డు సృష్టించింది! శనివారం జరిగిన ఈ ఈవెంట్లో ధగధగ మెరిసే బంగారు రంగు డ్రస్‌లో మైమరపించింది. అయితే ఈ ఔట్ఫిట్ ఖరీదు దాదాపు రూ.40 కోట్లు విలువ చేస్తుందని సమాచారం.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఈ డ్రస్ వేసుకుని తీసిన మూడు వీడియోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది ఊర్వశి రౌతేలా. ప్రస్తుతం ఈమె 'ఇన్స్పెక్టర్ అవినాష్' వెబ్ సిరీస్, ద్విభాషా చిత్రం 'బ్లాక్ రోజ్'లో కథానాయికగా చేస్తోంది. వీటితో పాటు శరవణన్ సరసన నటిస్తూ తమిళంలోకి ఎంట్రీ ఇస్తుంది. జియో స్టూడియోస్‌తో మూడు సినిమాలు చేసేందుకు ఒప్పందం కూడా కుదుర్చుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: