తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి అత్యవసర సమావేశాన్ని నిర్వహించి తమ వాణిని ఉభయ తెలుగురాష్ట్రాల ముఖ్యమంత్రుల దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు నిర్మాతల మండలి ప్రకటించింది. ఇప్పటికే ఏపీలో 100 శాతం అక్యుపెన్సీతో థియేటర్లు అనుమతిచ్చిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి, మంత్రి పేర్ని నానికి నిర్మాతల మండలి కృతజ్ఞతలు తెలిపింది. ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లో సినీ ప్రపంచం ఊపిరి తీసుకుని బతుకుతుందని నిర్మాత సి.కల్యాణ్ అన్నారు.
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సినీ పరిశ్రమకు తండ్రులులాంటివారని సి.కల్యాణ్ అన్నారు. అసాధ్యమయ్యే సమస్యలను పరిష్కరించాలని తాము అడగడంలేదని చెప్పారు. టికెట్‌ల రేట్లు విద్యుత్ బిల్లులు తదితర సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఫిలీం చాంబర్ అధ్యక్షులు నారాయణ్ దాస్ నారంగ్ కార్యదర్శి ప్రసన్న కుమార్, ముత్యాల రామదాసు,భరత్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: