నగరంలో ఓ క్యాబ్ డ్రైవర్ హత్య కేసు నేపథ్యంగా యువ కథానాయకుడు సత్యదేవ్ న్యాయవాదిగా నటించిన చిత్రం 'తిమ్మరుసు'. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేశ్ కోనేరు నిర్మించారు. ఈ నెల 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసి దర్శక నిర్మాతలకు అభినందనలు తెలిపారు. 'తిమ్మరుసు' చిత్రాన్ని థియేటర్లలో ఆస్వాదించాలని ప్రేక్షకులకు ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ చిత్రంలో సత్యదేవ్‌కు జోడీగా ప్రియాంక జావల్కర్ నటించగా.. బ్రహ్మాజీ, ఝాన్సీ కీలక పాత్రలు పోషించారు.


ఉత్కంఠగా సాగిన ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. 'ఎవరైనా కేసు గెలిస్తే బైక్ నుంచి కారుకు వెళ్తారు.. కానీ రామ్ కారు నుంచి బైక్‌కు వచ్చాడు', 'నువు కొడితే సౌండ్ వస్తుందేమో.. ఈ లాయర్ కొడితే లైఫంతా రీసౌండే', 'నువు సగం బలం లాక్కునే వాలివైతే'.. నేను దండేసి దండించే రాముడిలాంటోడ్ని' అంటూ సాగే డైలాగ్స్ అలరిస్తున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">