ETV Bharat / sitara

నా పేరుతో వస్తున్న వార్తలు అవాస్తవం: నాగార్జున - naga chaitanya samantha akkineni

Nagarjuna: సమంత-నాగచైతన్య విడాకుల విషయంలో తన పేరుతో వస్తున్న వార్తలన్నీ అవాస్తమని అన్నారు అక్కినేని నాగార్జున. ఇలాంటి పుకార్లను వార్తలుగా మలచవద్దని మీడియాను కోరారు.

Nagarjuna
నాగార్జున
author img

By

Published : Jan 27, 2022, 6:26 PM IST

Updated : Jan 28, 2022, 9:05 AM IST

Nagarjuna: సమంత-నాగచైతన్య విడాకుల అంశంపై తన పేరుతో వివిధ సామాజిక మాద్యమాలు, మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని అక్కినేని నాగార్జున స్పష్టం చేశారు. వారిద్దరి విడాకుల అంశంపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని పేర్కొన్నారు.

సమంత కోరితేనే నాగచైతన్య విడాకులకు ఒప్పుకొన్నారని నాగార్జున పేరుతో ఉదయం నుంచి సామాజిక మాద్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ విషయం నాగార్జున దృష్టికి వెళ్లడం వల్ల ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. మీడియా పుకార్లను వార్తలుగా మల్చవద్దని విజ్ఞప్తి చేసిన నాగార్జున.. మీడియా న్యూస్ ఇవ్వాలి కానీ.. పుకార్లను కాదని కోరారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: అందుకు నన్ను క్షమించండి: అనసూయ

Last Updated : Jan 28, 2022, 9:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.