ETV Bharat / sitara

కిరాణా దుకాణం పెట్టిన దర్శకుడు.. కరోనానే కారణం - corona latest news updates

లాక్​డౌన్​ కారణంగా దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమ మూతపడిపోవడం వల్ల దర్శకులు, సినీ తారలు, కళాకారులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కొంతమందికి జీవనోపాధి కష్టమైంది. ఈక్రమంలోనే చెన్నైకి చెందిన ఓ దర్శకుడు కిరాణా దుకాణం తెరిచారు.

Tamil filmmaker opens grocery store to earn a living during pandemic
ఆనంద్
author img

By

Published : Jul 4, 2020, 8:22 PM IST

కరోనా లాక్​డౌన్​తో అన్ని రంగాలతో పాటు సినీ పరిశ్రమపై భారీ ప్రభావం పడింది. దీంతో ఇండస్ట్రీపైనే ఆధారపడిన చాలామంది జీవనోపాధి ప్రశ్నార్థకంగా తయారైంది. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన సినీ దర్శకుడు ఆనంద్.. తన కుటుంబ పోషణ కోసం​ కిరాణా దుకాణం ప్రారంభించారు. ఇప్పటివరకు తాను పోగు చేసుకున్న డబ్బుతో.. స్నేహితుడి భవనంలో చిన్న గదిని అద్దెకు తీసుకొని షాప్ తెరిచినట్లు చెప్పారు. ప్రస్తుతం చెన్నైలోని మౌలివాక్కంలో దీనిని నడుపుతున్నారు.

పదేళ్లకుపైగా తమిళ చిత్రపరిశ్రమలో ఉన్న ఆనంద్​.. దేశంలో సినిమా థియేటర్లు వచ్చే ఏడాది వరకు మూసివేసే ఉంటాయని అభిప్రాయపడ్డారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాతే తిరిగి సినిమాల్లో అడుగు పెట్టాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

"లాక్​డౌన్​ సమయంలో నేను ఇంటికే పరిమితమయ్యా. తమిళనాడులో కిరాణా షాపులను మాత్రమే తెరవడానికి అనుమతులు ఇచ్చినట్లు తెలుసుకొని.. నేనూ ఓ దుకాణాన్ని పెట్టాలని నిర్ణయించుకున్నా. ఇందులో భాగంగా నూనె, పప్పుధాన్యాలు, బియ్యం ఇలా అన్ని రకాల నిత్యవసర సరకులను తక్కువ ధరకే అమ్ముతున్నా. ఇలా చేయడం వల్ల కొనుగోలుదారులు పెరుగుతారని నా నమ్మకం. ప్రస్తుతం సంతోషంగానే ఉన్నా"

ఆనంద్​, సినీ దర్శకుడు

తమిళ్​లో 'ఓరు మజాయ్​ నాంగు సారల్'​, 'మౌన మజాయ్​' తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు ఆనంద్​. చివరగా 'తునింతు సీ'ను తెరకెక్కించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిర్మాణనంతర దశలో ఉంది. రెండుపాటల చిత్రీకరణ జరపాల్సి ఉంది.

ఇదీ చూడండి:ప్రియాంక 20 ఏళ్ల కెరీర్​ ఏడున్నర నిమిషాల వీడియోలో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.