వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల జీవితగాథల్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ స్ఫూర్తినివ్వడంలో నటుడు సూర్య ఎప్పుడూ ముందుంటారు. అలా ఈ ఏడాది ఆయన నటించిన చిత్రం 'జై భీమ్'. తమిళనాడుకు చెందిన జస్టిస్ చంద్రు కెరీర్‌లో కీలకంగా నిలిచిన ఓ కేసు ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. జ్ఞాన్‌వేల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని మణికందన్ (రాజన్న), లిజో మోల్ జోసే (చిన్నతల్లి) పాత్రలు ప్రేక్షకుల హృదయాల్ని హత్తుకున్నాయి.
చేయని తప్పునకు జైలుపాలై, మరణించిన రాజన్న దుస్థితి ఎవ్వరికీ రాకూడదని చిన్నతల్లి చేసిన పోరాటం కట్టిపడేస్తుంది. నిజజీవితంలో ఆ పోరాటం చేసిన వ్యక్తి పార్వతి అమ్మాళ్. ఆమె పరిస్థితి చూసి సూర్య చలించిపోయి ఆర్థిక సాయం అందించారు. ఆమె పేరుమీద రూ.10 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, ఆ మొత్తంపై ప్రతినెలా వచ్చే వడ్డీ ఆమెకు అందేలా చేశారు. ఇంతకుముందు.. గిరిజనుల సంక్షేమానికి సూర్య రూ. కోటి విరాళం అందించారు.
నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్.. పార్వతి అమ్మాళ్‌కు ఇల్లు కట్టిస్తానని ఇటీవల ప్రకటించారు. వాస్తవ సంఘటనల ఆధారిత కథల్లో నటించి, సంబంధిత వ్యక్తులకు సాయం చేస్తున్న సూర్యపై ఆయన అభిమానులు, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: