ETV Bharat / sitara

సన్నీ ప్రేమ కహానీ.. మీటుతుంది మీ హృదయాన్ని - సన్నీ ప్రేమ కహానీ.. మీటుతుంది మీ హృదయాన్ని

జీవితంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది బాలీవుడ్ హాట్ గర్ల్ సన్నీ లియోనీ. తన లవ్​లైఫ్​ కూడా అంత సాఫీగా సాగలేదు. ఈ భామ ప్రేమ కహానీపై ఫూర్తి కథనం మీకోసం.

సన్నీ, వెబర్
సన్నీ, వెబర్
author img

By

Published : Jun 7, 2020, 8:00 AM IST

Updated : Jun 7, 2020, 8:53 AM IST

సన్నీ లియోనీ.. ఈ పేరు ఓ సెన్సేషన్. ప్రస్తుతం బాలీవుడ్​లో బిజీ నటిగా ఉంటూనే కుర్రకారు కలల రాణిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే జీవితంలో ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొని.. శృంగార తారగా పేరు తెచ్చుకుని.. ఆ తర్వాత నటిగా అవకాశాలు దక్కించుకోవడం సాధారణ విషయం కాదు. ఈమె అమేజింగ్ డ్యాన్సర్, ఎంతో ప్రతిభగల నటి, అంతకుమంచి మంచి మనసున్న వ్యక్తి. జీవితంతో పాటే తన ప్రేమలోనూ చాలా ట్విస్టులు ఉన్నాయి. ప్రస్తుతం డేనియల్ వెబర్​ను పెళ్లి చేసుకున్నా, అంతకు ముందు ఇద్దరితో సహజీవనం చేసింది.

సన్నీ
సన్నీ

తొలి సహజీవనం

సన్నీ లియోనీ తొలుత ప్లేబాయ్ మ్యాగజైన్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ మ్యాట్ ఎరిక్సన్​తో రిలేషన్​షిప్​లో ఉంది. బిజినెస్​ కోసం అయిన పరిచయం.. కొద్దిరోజుల్లో మరో మెట్టు ఎక్కింది. మ్యాట్​ సహాయంతో సన్నీ ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఇందులో పలు శృంగార చిత్రాలను నిర్మించింది. తద్వారా డబ్బు బాగానే సంపాదించింది. అయితే 2007లో వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకుందామని అనుకున్నారు. కానీ అప్పుడే బిగ్​బాస్​ షోలో పాల్గొన్న సన్నీకి ఫేమ్ వచ్చింది. తర్వాత మ్యాట్.. డబ్బు కోసం ఈమె వీడియోలను ఆన్​లైన్​లో అమ్మకానికి పెట్టాడు. ఫలితంగా వీరి మధ్య బ్రేకప్ అయింది.

సన్నీ, వెబర్
సన్నీ లియోనీ

రెండో సహజీవనం

మ్యాట్​తో విడిపోయాక తనకు చాలారోజుల నుంచి పరిచయమున్న రసెల్ పీటర్స్​తో సహజీవనం చేసింది సన్నీ. కానీ కొంతకాలం తర్వాత విడిపోయారు. దీని గురించి ఓ సందర్భంలో మాట్లాడింది.

"మీకు తెలుసు మేం చాలా కాలంగా స్నేహితులం. కానీ ఎవరైనా కొన్నిసార్లు విడిపోవాల్సిందే. కొంతకాలం సహజీవనం చేశాక మా ఇద్దరి ఆలోచనలు విభిన్నం అని అర్థమైంది. అందుకే బ్రేకప్​ చెప్పుకున్నాం. అయితే ఇప్పటికీ తాను కలిస్తే హగ్ చేసుకుండా, తన ఫ్యామిలీ గురించి అడుగుతుంటా"

-సన్నీ లియోనీ, హీరోయిన్

వెబర్​ను కలిసిన క్షణం

ప్రతి అమ్మాయి జీవితంలోనూ ఓ సందర్భంలో నిజమైన ప్రేమ పుట్టే క్షణం వస్తుంది. అలాగే సన్నీకి డేనియల్ వెబర్​ పరిచయమయ్యాడు. అతడు వంట చేస్తాడు. మూడు బాలేకపోతే గిటార్ వాయిస్తాడు. ఆమె రోజూవారీ ప్రణాళికల్ని రూపొందిస్తాడు. తను నవ్వేలా చేస్తాడు. అందువల్ల అతడితో గడిపిన సమయంలో సన్నీ ఎప్పుడూ ఒత్తిడికి గురవలేదు. రేపు లేదు అంటూ.. ఉన్న క్షణాన్ని అనుభవిస్తూ ప్రేమలో మునిగితేలారు వీరిద్దరూ. కానీ సన్నీ మనసులో స్థానం సంపాదించేందుకు రెండు నెలలు ఓపిక పట్టాడు వెబర్.

సన్నీ, వెబర్
సన్నీ, వెబర్

సన్నీ, వెబర్ మొదటగా లాస్ వేగాస్​లో కలిశారు. సన్నీ అందం చూడగానే వెబర్ అవాక్కయిపోయాడట. మొదటి చూపులోనే తనకు ఆమెపై ప్రేమ కలిగిందట. అయితే సన్నీని కలిసి తన ప్రేమను వ్యక్తం చేసినా హుందాగా తిరస్కరించిందట. కానీ వెబర్ మాత్రం ఆమె ప్రేమ కోసం తపించిపోయి.. ప్రతిరోజూ మెయిల్ చేస్తూ ఫ్లవర్​ బొకేలు సన్నీ ఇంటికి పంపేవాడట.

అయితే సన్నీ లియోనీ మాత్రం వెబర్​తో డేట్​కు ఇష్టపడలేదు. కానీ ఓసారి అతడి బాధ పడలేక డేట్​కు వెళ్లింది. అతడిని ఇబ్బంది పెట్టాలనే ఆలస్యంగా వెళ్లింది. కానీ అక్కడ జరిగింది మాత్రం పూర్తి విరుద్ధం. వెబర్ మాత్రం ఓ జెంటిల్​మెన్​లా ప్రశాంతంగా తనకోసం ఎదురుచూశాడు. అతడితో మూడు గంటల సేపు మాట్లాడినా.. సన్నీకి బోర్​ కొట్టలేదట. ఓ సందర్భంలో ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది. ఆ డేట్ తన జీవితంలో మర్చిపోలేదని తెలిపింది. ఆ తర్వాత అతడిని ఇబ్బందిపెట్టినందుకు ఓ ఫ్లవర్​ బొకేతో పాటు సారీ లెటర్​ను పంపినట్లు వెల్లడించింది.

సన్నీ, వెబర్
సన్నీ, వెబర్

చివరకు పెళ్లి

వెబర్​తో డేటింగ్ చేస్తున్న సమయంలోనే సన్నీ వాళ్ల తల్లి మరణించింది. అలాంటి కష్టకాలంలో సన్నీకి మద్దుతుగా నిలిచి, తన కుటుంబానికి అండగా ఉన్నాడు వెబర్. ఈ విషయాన్ని ఓసారి సన్నీనే చెప్పుకొచ్చింది.

సన్నీ, వెబర్
సన్నీ, వెబర్

"కొన్నిసార్లు రాత్రి లేచి ఏడ్చేదానిని. ఆ సమయంలో అతడు నన్ను ఓదారుస్తూ ఉండేవాడు. అమ్మలేని లోటును భర్తీ చేయడం కాదు.. ఆ పరిస్థితుల్లో అతడు నాకు తోడుగా ఉన్నాడు అదే ముఖ్యం. నేను అడల్ట్​ చిత్రాల్లో వేరొకరితో కలిసి నటించడాన్ని వెబర్ తట్టుకోలేకపోయాడు. అందుకే తనే నాతో నటించడానికి సిద్ధమయ్యాడు. తర్వాత మేమిద్దరం ఓ కంపెనీ కూడా మొదలుపెట్టాం"

-సన్నీ, హీరోయిన్

మరికొన్ని రోజుల సహజీవనం​ తర్వాత చివరికి 2011లో సన్నీ, వెబర్ పెళ్లి చేసుకున్నారు. సిక్కు, జెవిష్​ పద్ధతుల్లో వీరి వివాహం జరిగింది.

కానీ కొందరు మాత్రం వారి బ్యాక్​డ్రౌండ్​ను చూసి వీరి పెళ్లిని ప్రశ్నించేవారు. కానీ ఇద్దరూ ఒకరికొకరు మద్దతుగా నిలబడ్డారు. వెబర్​.. సన్నీకి ఎప్పుడూ సపోర్టివ్​గా ఉంటూ తన నిర్ణయాన్ని గౌరవిస్తాడట.

సన్నీ, వెబర్
సన్నీ, వెబర్

పిల్లలు నిషా, నోహ్, ఆషర్

2017లో సన్నీ.. నిషా కౌర్ అనే బేబీ గర్ల్​ను దత్తత తీసుకుంది. 2018లో ఈ దంపతులకు కవల పిల్లలు పుట్టారు. వారి పేర్లు నోహ్, ఆషర్. ఆ పిల్లల గురించి మాట్లాడుతూ సన్నీ.. "ఇది పూర్తిగా దేవుడి ప్రణాళిక. మాకు ఇంత అందమైన పిల్లలు లభిస్తారని అనుకోలేదు. నా సంతోషానికి అవధులు లేవు. ఈ ముగ్గురు పిల్లలతో మా కుటుంబం సంపూర్ణమైంది" అంటూ చెప్పింది.

సన్నీ, వెబర్
నిషాతో సన్నీ, వెబర్
సన్నీ, వెబర్
నోహ్, ఆషర్​లతో సన్నీ, వెబర్

Last Updated : Jun 7, 2020, 8:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.