కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో వలస కూలీలు అనుభవించిన కష్టాలు కొత్తగా చెప్పనక్కర్లేదు. అటువంటి సమయంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఎందరో కార్మికులకు అండగా నిలబడి.. వారి పాలిట దైవంగా మారాడు. తాజాగా, లాక్‌డౌన్‌తో కిర్గిస్థాన్‌లో చిక్కుకున్న దాదాపు 3 వేల మంది విద్యార్థులను తమ స్వస్థలాలకు చేర్చేందుకు సిద్ధమయ్యాడు సోనూ. వీరిలో 20 మంది బిహార్, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.
జులై 14న ఆసియా మెడికల్ ఇన్స్టిట్యూట్(ఏఎమ్ఐ)లో వైద్య శాస్త్రం చదువుతున్న ఒక విద్యార్థి తాము ఇంటికి వెళ్లేందుకు సాయం కావాలని కోరాడు. ఈ క్రమంలోనే ట్వీట్ చేస్తూ.. విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ట్యాగ్ చేశాడు. విషయాన్ని తెలుసుకున్న సోనూ.. సాయం చేసేందుకు ముందుకొచ్చాడు.
-
This is to inform to all the students of Kyrgyzstan that it’s time to come home ❣️we are operating the first charter Bishkek -Varanasi on 22nd July.The details of which will be sent to your email id and mobile phones in a while. Charters for other states will also fly this week.
— sonu sood (@SonuSood) July 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">This is to inform to all the students of Kyrgyzstan that it’s time to come home ❣️we are operating the first charter Bishkek -Varanasi on 22nd July.The details of which will be sent to your email id and mobile phones in a while. Charters for other states will also fly this week.
— sonu sood (@SonuSood) July 21, 2020This is to inform to all the students of Kyrgyzstan that it’s time to come home ❣️we are operating the first charter Bishkek -Varanasi on 22nd July.The details of which will be sent to your email id and mobile phones in a while. Charters for other states will also fly this week.
— sonu sood (@SonuSood) July 21, 2020
"కిర్గిస్థాన్‌లో చిక్కుకున్న విద్యార్థులందరూ ఇంటికి తిరిగి వచ్చే సమయం వచ్చేసింది. జులై 22న ఛార్టర్ విమానాన్ని బిష్కెక్- వారణాసి మధ్య నడపనున్నాం. వివరాలను విద్యార్థుల ఈ-మెయిల్, మొబైల్ ఫోన్లకు పంపిస్తాం. ఇతర రాష్ట్రాలకూ ఈ వారంలోనే విమానాలు పంపిస్తాం".
సోనూ సూద్, సినీ నటుడు
తమకు అండగా నిలబడిన సోనూకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.
"కిర్గిస్థాన్‌లోని ఏఎమ్ఐలో వైద్య శాస్త్రం చదువుతున్న 3 వేల మందిని స్వస్థలాలకు చేర్చేందుకు సిద్ధమైన సోనూకు మా హృదయపూర్వక ధన్యవాదాలు" అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు.