ETV Bharat / sitara

SIIMA2021: సైమా అవార్డుల వేడుక.. ఎప్పుడంటే? - సైమా ఫంక్షన్​

సినీలోకం ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) ఫంక్షన్ తేదీ వచ్చేసింది. హైదరాబాద్​లోనే ఈ అవార్డుల కార్యక్రమం నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.

siima awards
సైమా అవార్డులు
author img

By

Published : Aug 6, 2021, 4:14 PM IST

Updated : Aug 6, 2021, 4:41 PM IST

సినీ రంగానికి సంబంధించి ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డుల్లో సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా) ఒకటి. కరోనా కారణంగా గతేడాది ఈ వేడుకలు నిర్వహించలేదు. దాంతో మళ్లీ ఎప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న నటులు, ప్రేక్షకులకు తీపి కబురు వినిపించింది సైమా. 2021 అవార్డుల కార్యక్రమం ఎప్పుడుంటుందో సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేసింది.

SIIMA2021
సైమా అవార్డులు

'మీ నిరీక్షణకు తెరపడింది! సైమా అవార్డ్స్‌ వేడుకలు తిరిగి వచ్చాయి. సెప్టెంబరు 11, 12న సినిమా పండగ జరుపుకొందాం' అని పేర్కొంది. ఈ వేడుకలకు హైదరాబాద్‌ వేదిక కానుంది. 2012లో ఈ అవార్డుల కార్యక్రమం మొదలైంది.

హైదరాబాద్​లోనే..

తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రారంభమైంది. ఇప్పటి వరకు 8 సార్లు అట్టహాసంగా ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించారు.

ఆ కార్యక్రమాలన్నీ విదేశాల్లో నిర్వహించగా ఇప్పుడు తొలిసారి హైదరాబాద్‌లో నిర్వహిస్తుండటం విశేషం. మరి ఈ సారి అవార్డులు అందుకునేదెవరో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ఇదీ చదవండి: ఓటీటీలోనే 'టక్ జగదీష్'.. డీల్ కుదిరింది!

Last Updated : Aug 6, 2021, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.