ETV Bharat / sitara

sam chaitanya divorce: ట్వీట్​ వైరల్​పై స్పందించిన సిద్ధార్థ్​ - All News

సమంత- నాగచైతన్య (Samantha Chaitanya) విడిపోతున్నట్లు ప్రకటించన తర్వాత నటుడు సిద్ధార్థ్‌ చేసిన ట్వీట్​ చర్చనీయాంశమైంది(siddharth tweet samantha). దానిపై స్పందించిన సిద్ధార్థ్​.. చైతూ-సామ్​ విషయంలోకి తనను లాగొద్దని అన్నారు. అది ఎందుకంత వైరల్‌గా మారిందో తనకు కూడా తెలియడం లేదని చెప్పారు.

nagachaitanya
చైతూ
author img

By

Published : Oct 10, 2021, 6:53 AM IST

నాగచైతన్య - సమంత(sam chaitanya divorce) విషయంలోకి తనను లాగొద్దని నటుడు సిద్ధార్థ్‌ అన్నారు(siddharth tweet samantha). చాలా సంవత్సరాల విరామం తర్వాత ఆయన నేరుగా తెలుగులో నటిస్తున్న చిత్రం 'మహాసముద్రం'(siddhartha mahasamudram movie). అజయ్‌ భూపతి దర్శకత్వం వహించిన ఈ ఇంటెన్స్‌ ప్రేమ కథాచిత్రం అక్టోబర్‌ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న సిద్ధార్థ్‌ తన సినీ కెరీర్‌ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. అనంతరం ఇటీవల సామ్‌-చై విడిపోతున్నట్లు(sam chaitanya divorce) ప్రకటించిన సమయంలో తాను చేసిన ట్వీట్‌పై స్పందించారు. అది ఎందుకంత వైరల్‌గా మారిందో తనకు కూడా తెలియడం లేదని అన్నారు.

"గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రతిరోజూ నాకు నచ్చిన ఓ అంశంపై మంచి సందేశాన్ని ట్వీట్‌ చేస్తూనే ఉన్నాను. అదే విధంగా అక్టోబర్‌ 2న సాయంత్రం ట్వీట్‌ చేశాను. మోసం చేసేవాళ్ల గురించి ఆ ట్వీట్‌ సారాంశం. అయితే, ఆ ట్వీట్‌ను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. వేరే వాళ్ల గురించి నేను ఆ ట్వీట్‌ చేయలేదు. ఆ వ్యవహారంలోకి నన్ను లాగకండి"

-సిద్ధార్థ్‌, నటుడు.(siddharth tweet samantha)

కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్న చై-సామ్‌(samantha chaitanya wedding) 2017లో వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ ఈ నెల 2న తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. చై-సామ్‌ ట్వీట్ చేసిన కొన్ని గంటల తర్వాత సిద్ధూ ఓ ట్వీట్‌ చేశారు. "మోసం చేసేవాళ్లు జీవితంలో ఎప్పుడూ అభివృద్ధి చెందరు. ఈ విషయాన్ని స్కూల్‌లో ఉన్నప్పుడు మా టీచర్‌ చెప్పింది" అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నాడు. దీంతో సామ్‌ను ఉద్దేశిస్తూనే సిద్ధూ ఆ ట్వీట్‌ చేశారని అందరూ చెప్పుకున్నారు.

ఇదీ చూడండి: సామ్‌, సిద్ధార్థ్‌, జుకల్కర్‌.. ఈ ముగ్గురి పోస్ట్స్​పైనే చర్చ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.