ETV Bharat / sitara

బోల్డ్​ హెయిర్​స్టైల్​లో శిల్పాశెట్టి.. అభిమానులు ఫిదా! - shilpa shetty new haircut

బాలీవుడ్​ ఫ్యాషన్​ క్వీన్​ శిల్పాశెట్టి(shilpa shetty new haircut) ఎరోబిక్​ వర్కౌట్స్​​ చేస్తున్న వీడియోను పోస్ట్​ చేసింది. ఇందులో ఆమె కొత్త హెయిర్​ స్టైల్​తో కనిపించి ఆకట్టుకుంది. ఈ వీడియో అభిమానులను తెగ అలరిస్తోంది.

shilpashilpa
శిల్పాశెట్టి
author img

By

Published : Oct 18, 2021, 5:21 PM IST

ఎప్పుడూ స్టైల్​గా, ఫిట్​గా కనిపిస్తూ(shilpa shetty new hairstyle) సోషల్​మీడియాలో అభిమానులను అలరించే బాలీవుడ్​ ఫ్యాషన్​ క్వీన్​ శిల్పాశెట్టి ఈసారి సరికొత్త అవతారంలో దర్శనమిచ్చి ఆకట్టుకుంది. సోమవారం(అక్టోబర్​ 18) ఎరోబిక్​ వర్కౌట్స్​​ చేస్తున్న వీడియోను పోస్ట్​ చేసింది. ఈ వీడియోలో పోని స్టైల్​లో ఉన్న తన కొత్త హెయిర్​స్టైల్​తో ఫ్యాన్స్​ను అలరించింది(shilpa shetty latest news). వెనకాల జుట్టును చిన్నగా ట్రిమ్​ చేసింది. బూడిద రంగు టాప్​, ట్రాక్​ ధరించి వర్కౌట్స్​ చేసింది.

"రిస్క్​ తీసుకోకుండా, కంఫర్ట్​ జోన్​ నుంచి బయటకు రాకుండా ఒక్క రోజు కూడా జీవించలేము." అంటూ వర్కౌట్ వీడియోకు వ్యాఖ్య జోడించింది శిల్పా. అలాగే తన కొత్త ఎరోబిక్​ వర్కౌట్స్​ గురించి ప్రస్తావిస్తూ.. దీనిని 'ట్రైబల్​ స్క్వాట్స్​' అంటారు అని రాసింది. ఇలా చేయడం వల్ల చురుకుదనం పెరుగుతుందని, మెదడు పనితీరు బాగుంటుందని చెప్పింది. ఈ వీడియో చూసిన నెటిజన్లకు ఫిదా అవుతున్నారు. విపరీతంగా లైక్స్​, కామెంట్స్​ పెడుతున్నారు.

విక్టరీ వెంకటేశ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన 'సాహస వీరుడు సాగర కన్య'(shilpashetty telugu movies) సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శిల్పాశెట్టి. 'సాగర కన్య'గా ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న శిల్పా(shilpa shetty super dancer 4) దక్షిణాది చిత్రాలతోపాటు బాలీవుడ్‌ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం ఆమె 'సూపర్​ డ్యాన్సర్​ 4'కు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. దీంతో పాటే సోషల్​మీడియాలోనూ ఫిట్​నెస్​పై అభిమానులకు అవగాహన పెంచే వీడియోలను పోస్ట్​ చేస్తుంటుంది.

shilpa
శిల్పాశెట్టి

ఇదీ చూడండి: Shilpa Shetty: ఆ ఐదుసార్లు శిల్పాశెట్టి వివాదాల్లో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.