ETV Bharat / sitara

18 ఏళ్ల కిందట ఇదే రోజు విడుదలై రికార్డుల ప్రభంజనం

బాలీవుడ్​ బాద్​షా షారుక్ ఖాన్, అందాల తార ఐశ్వర్య రాయ్​ నటించిన 'దేవదాస్'​ చిత్రం విడుదలై నేటితో 18 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలు మీకోసం.

sharukh
షారుక్​
author img

By

Published : Jul 12, 2020, 6:01 AM IST

Updated : Jul 12, 2020, 11:38 AM IST

1917 నాటి ప్రేమకథ. బెంగాలీ రచయిత శరత్‌చంద్ర ఛటోపాధ్యాయ విరచిత విషాదాంత కాల్పనిక కథ. అలాంటి ఓ కథ కాలాల్ని జయించి... కోట్లాది హృదయాల్ని జ్వలించి... శాశ్వతత్వాన్ని సముపార్జించుకోవడం నిజంగా ఓ చరిత్రే. పుంఖానుపుంఖాలుగా పుట్టుకొచ్చే ఎన్నో ప్రేమ కథల నడుమ కాలం మరువని కన్నీటి కథగా దేవదాసు ఇంకా ఇప్పటికీ నిలిచి ఉందంటే... అదంతా శరత్‌ ఇంద్రజాలమే. ఆయన సృష్టించిన పాత్రల మాయాజాలమే. ఆ పాత్రలన్నీ రక్తమాంసాలతో మన కళ్లెదురుగానే సజీవంగా కదలాడుతున్నాయనే ఊహ కలిగించడమే దేవదాస్‌ రచయితగా శరత్‌ అనుసరించిన విజయ సూత్రం. కేవలం నవలగానే కాకుండా ప్రేక్షకుల మనస్సులపై కదిలే బొమ్మల ప్రపంచం కడు నైపుణ్యంగా విసిరిన రంగుల వలగా కూడా 'దేవదాస్‌'ని అభివర్ణించవచ్చు. భారతీయ భాషల్లో ఇప్పటికీ పునర్నిర్మితమవుతున్న ఒకే ఒక కథ 'దేవదాస్‌'.

sharukh
షారుక్​

షారుక్​‌ 'దేవదాస్​'

బాలీవుడ్‌ బాద్​షాగా తన ప్రత్యేక గుర్తింపుతో హిందీ సినిమాను శాసిస్తున్న షారుక్​ ‌ఖాన్‌ కూడా దేవదాసు ప్రేమలో పడిపోయాడు. మెగా బాలీవుడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థతో కలసి స్వీయ నిర్మాణ సంస్థ రెడ్‌ చిల్లీస్‌ ద్వారా 'దేవదాస్‌'ను నిర్మించి తనలోని నటుడిని సంతృప్తి పరిచాడు. అదే సమయంలో విజయాన్ని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు, పురస్కారాలను అందుకున్నాడు. 2002లోనే 50 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించి బాలీవుడ్‌ స్టామినాని మరో స్థాయికి తీసుకెళ్లాడు షారుక్​. దేశ, విదేశాల్లోనూ అత్యధిక వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం పద్దెనిమిదేళ్ల క్రితం ఈ రోజే విడుదలైంది.

బ్రిటిష్‌ అకాడమీ ఆఫ్‌ ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌ అనే ప్రతిష్టాత్మక సంస్థ ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో షారుక్‌ 'దేవదాస్​' నామినేట్‌ అయింది. అదే విభాగంలో అకాడమీ అవార్డుకూ నామినేట్‌ అయింది. 2010లో 'ది హండ్రెడ్‌ బెస్ట్‌ ఫిలిమ్స్‌ ఆఫ్‌ వరల్డ్‌ సినిమా' అనే అంశంపై ఎంపైర్‌ సినిమా మ్యాగజైన్‌లో ప్రచురితమైన ఆర్టికల్‌లో ఈ చిత్రం చోటు చేసుకోవడం విశేషం. ఇటీవలి కాలంలో టైమ్స్‌ టాప్‌ టెన్, 'మూవీస్‌ ఆఫ్‌ ది మిలీనియం'‌లో కూడా చోటు చేసుకుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

అలరించిన పాటలు

'దేవదాస్‌' చిత్రంలోని పాటలు శ్రోతలను విశేషంగా అలరించాయి. సిల్‌ సిలా ఏ చాహత్‌ కా, మార్‌ డాలా, బైరి పియా, చలక్‌ చలక్, హమేషా తుమ్‌ కో చాహా, వో చాంద్‌ జైసీ లడ్‌ కీ, డోలారే డోలా... ఇలా అన్ని పాటలు జనరంజకంగా రూపొందాయి. ఇప్పటికీ ఈ పాటలు ఎక్కడో అక్కడ వినిపిస్తూనే ఉంటాయి. 'దేవదాస్‌' చిత్రాన్ని సంగీత ప్రధాన చిత్రంగా రూపొందించడంలో దర్శకుడు సంజయ్‌ లీలా బన్సాలీ చూపిన శ్రద్ధ ప్రశంసనీయం.

కేన్స్‌ చిత్రోత్సవంలో

కేన్స్‌ చిత్రోత్సవం (2002)లో ‘దేవదాస్‌’ సృష్టించిన హల్​చల్​‌ అంతాఇంతా కాదు. 2014 ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియాలోనూ ‘దేవదాస్‌’ సెక్షన్‌ వెలిసి అభిమానులని అలరించింది. ఉత్తమ చిత్రంగా ఫిలిం ఫేర్‌ అవార్డుతో పాటు మరో పది విభాగాలనూ కైవసం చేసుకుంది. అదే వరుసలో 5 జాతీయ అవార్డులను అందుకుంది.

తెరముందూ...తెర వెనుక

అన్ని విజయాలు నమోదు చేసుకుని ప్రపంచవ్యాప్తంగా కీర్తినార్జించిన 'దేవదాస్‌' చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరూ ప్రతిభావంతులే. లబ్ధప్రతిష్టులే. కథానాయకుడు షారుక్​‌ గురించి చెప్పాల్సిన పని లేదు. నాయకిగా మాజీ విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌ అందాలతో కనువిందు చేస్తూనే... పార్వతిని కళ్లముందు సాక్షాత్కరింపచేసింది.

ఈ చిత్రంలో మరో ముఖ్య భూమిక చంద్రముఖి. ఎంతగానో ప్రేమించిన ప్రేయసి పార్వతి నుంచి విడివడిన తరువాత 'దేవదాసు'ను అక్కున చేర్చుకుని మనసుకు ఊరట కలిగించిన చంద్రముఖి పాత్రలో మాధురిదీక్షిత్‌ కనిపించి కవ్వించింది. ‘దేవదాస్‌’ మనసెరిగిన నేస్తం చున్నీలాల్‌గా జాకీ ష్రాఫ్, పార్వతి తల్లి సుమిత్ర చక్రవర్తిగా కిరణ్‌ ఖేర్, దేవదాస్‌ తల్లి కౌసల్య ముఖర్జీగా స్మిత జయకర్‌... ఇలా ముఖ్యమైన పాత్రల్లో ప్రతిభావంతులు నటించారు. ఈ చిత్రంలోని పాటల్ని జనరంజకంగా మలచిన సంగీత దర్శకుడు ఇస్మాయిల్‌ దర్బార్, మోంతీ శర్మ.

ఇతివృత్తం

కులం, బలం, ధనం, మతం... ఇవే ప్రతి ప్రేమకథలోనూ ప్రధాన విలన్లు. అలాంటి అన్ని ప్రేమకథల్లానే దేవదాసు పార్వతి కథ కూడా. ఇంగ్లాండ్‌లో లాయర్‌ విద్యనభ్యసించి తిరిగి సొంతూరు వస్తాడు కథానాయకుడు దేవదాసు. చిన్నతనంలో పక్కింటి పార్వతితో సన్నిహితంగా ఉండేవాడు. తిరిగి వచ్చిన తరువాత వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. దేవదాస్‌ కుటుంబం ధనిక కుటుంబం. పార్వతి పేదరాలు. అదే...వారి ప్రేమకు అడ్డంకి అయింది. విడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. పార్వతి వివాహం భువన్‌ చౌదరితో కుదురుతుంది. ఆయన తన పిల్లలకు తల్లిగా, ఎస్టేట్‌కి యజమానిగానే పార్వతిని పెళ్లాడుతాడు తప్ప... భార్యగా కాదు. పార్వతి నుంచి విడిపోయిన దేవదాసు వేశ్య చంద్రముఖి చెంతకు చేరుతాడు. తాగుడుకు బానిసవుతాడు. చివరికి తండ్రి మరణించాక అంత్యక్రియలకూ తిరిగి రాకపోవడంతో ఆయన పరువు పోతుంది. ప్రేమను గెలిపించుకోలేని అసమర్థ ప్రేమికుడు దేవదాసు. ప్రేయసి జ్ఞాపకాల్లోనే మగ్గుతూ విపరీతంగా తాగుతూ జీవితాన్ని విషాదాంతం చేసుకుంటాడు.

ఇది చూడండి : మన్మథుడితో కలసి 'మహానటి'కి సామ్ సవాల్ ​​

Last Updated : Jul 12, 2020, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.