Aryan Khan Bollywood Debut: స్టార్ హీరో షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్.. బాలీవుడ్లో అరంగేట్రం చేయనుందనే వార్తలు కొద్దికాలంగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే అతని కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా సినిమాల్లో నటిస్తాడా అనే అంశంపై చిత్రసీమలో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆర్యన్ మాత్రం.. కెరీర్‌ను భిన్నంగా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
![aryan khan bollywood debut](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14538052_1.jpg)
సినిమా ప్రపంచంలోకి ఆర్యన్ అడుగుపెట్టినా.. నటుడిగా మాత్రం కాదని సమాచారం. ఆర్యన్ వద్ద కొన్ని ఐడియాలు ఉన్నాయట. సినిమా లేదా వెబ్‌సిరీస్ కోసం వాటిని కథలుగా మలిచే అవకాశం ఉంది. ఆర్యన్ ఇప్పటికే.. అమెజాన్ ప్రైమ్, మరో పూర్తి స్థాయి సినిమా కోసం కథలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దానిని షారుక్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. అంతా సవ్యంగా జరిగితే.. ఈ ఏడాదే అతడు కథా రచయితగా అరంగేట్రం చేస్తాడు!
![suhana khan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14538052_2.jpg)
ఇవీ చూడండి:
Aryan Drug Case: ఆర్యన్ ఖాన్‌కు ఊరట.. హైకోర్టు కీలక తీర్పు