ETV Bharat / sitara

ఫ్యాన్స్​కు సూర్య సర్​ప్రైజ్.. నేరుగా ఓటీటీలోనే

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన 'సూరారై పోట్రు' చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. అమెజాన్ ప్రైమ్ వేదికగా అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.

author img

By

Published : Aug 22, 2020, 2:03 PM IST

ప్రైమ్​లో సూర్య 'సూరారై పోట్రు'.. విడుదల ఖరారు

కరోనా లాక్​డౌన్​ కారణంగా తమిళ స్టార్​ హీరో సూర్య నటించిన తమిళ చిత్రం 'సూరారై పోట్రు' విడుదల వాయిదా పడింది. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లు చాలారోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా అదే నిజమైంది. ఈ చిత్రాన్ని నేరుగా అమెజాన్ ప్రైమ్​లో విడుదల చేసేందుకు అంగీకరించింది చిత్రబృందం. అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.

ఈ చిత్రంలో టాలీవుడ్​ విలక్షణ నటుడు మంచు మోహన్​బాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. సుధా కొంగర దర్శకత్వం వహించగా.. సూర్య, బాలీవుడ్​ నిర్మాత గుణీత్​ మోంగ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్​ స్వరాలను సమకూరుస్తున్నారు.

తెలుగులో ఈ చిత్రం 'ఆకాశమే హద్దురా' పేరుతో తెరకెక్కింది. అయితే తమిళంతో పాటే తెలుగులోనూ విడుదల చేస్తారా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.