ETV Bharat / sitara

ఇది మా 'గీతగోవిందం'.. డైరెక్టర్​ పరశురామ్ 'లవ్'​స్టోరీ - సర్కారు వారి పాట డైరెక్టర్

ఆ అమ్మాయిది సంపన్న కుటుంబం. అబ్బాయిది బతికిచెడ్డ దైన్యం. ఆమెది బంగారు పళ్లెంలో భోంచేసే జీవితమైతే... అతనిది బాటా చెప్పులూ కరవైన దారిద్య్రం. ఆ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అమ్మాయి ఓ అర్ధరాత్రి ఇల్లువిడిచి వచ్చేసింది. అతనేమో 'ఇది పద్ధతి కాదు...!' అని మందలించి వాళ్లింట్లోనే దింపి వచ్చేశాడు! 'గీతగోవిందం', మహేశ్‌బాబు 'సర్కారువారి పాట' సినిమాల దర్శకుడు పరశురామ్‌ (బుజ్జి)-అర్చనల వలపుకథలో ఓ మలుపు అది. ప్రేమభావన వ్యక్తిత్వాల్ని ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దుతుందో చాటే ఇద్దరు ప్రేమికుల కథ ఇది...

Director parasuram love story
డైరెక్టర్​ పరశురామ్ 'లవ్'​స్టోరీ
author img

By

Published : Feb 13, 2022, 8:25 AM IST

పరశురామ్‌: నాకు చిన్నప్పటి నుంచీ మా అమ్మ అంటే చాలా ఇష్టం! అయినా డిగ్రీ దాకా హాస్టల్స్‌లో ఉండడం వల్ల తనతో నేను గడిపిన సమయం చాలా తక్కువ. ఎంబీఏ చేస్తున్నప్పుడే అమ్మకు అకస్మాత్తుగా ఆరోగ్యం పాడైంది. హైదరాబాద్‌కు తీసుకొచ్చి పరీక్షలు చేయిస్తే బ్లడ్‌క్యాన్సర్‌ అని తెలిసింది... అమ్మ రెండుమూడు నెలలకంటే బతకదనీ తేలింది. అప్పటి నుంచీ అమ్మను పసిపాపలాగే చూసుకోవడం మొదలుపెట్టాను.. డాక్టర్లు చెప్పినట్లే - మూడునెలల్లో అమ్మ కన్నుమూయడం నన్ను బాగా కుంగదీసింది. దానికి తోడు నాన్న చేస్తూ వచ్చిన కోళ్లఫారం బిజినెస్‌లోనూ తీవ్రంగా నష్టాలొచ్చాయి. అమ్మ చనిపోయి ఏడాది తిరక్కుండానే అక్క పెళ్ళి జరిగింది. ఆ అప్పులు తీర్చడం కోసమే ఉద్యోగం చేయాలని నర్సీపట్నం వదిలి హైదరాబాద్‌ వచ్చాను. పూరీ జగన్నాథ్‌ స్ఫూర్తితో ఆయన దగ్గరే అసిస్టెంట్‌గా చేరాను. అప్పట్లో హైదరాబాద్‌లోని మా మేనమామ వాళ్లింట్లో ఉండేవాణ్ణి.

మా అత్తయ్య చెల్లెలు డయానా ఇంటర్‌ చదువుతుండేది. తనని కాలేజీలో డ్రాప్‌ చేయడానికి వెళ్లి వస్తున్నప్పుడే... తొలిసారి అర్చనను చూశాను. వందకు వందశాతం లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ నాది..! ‘అర్చనలో మీ అమ్మ పోలికలున్నాయి... అందుకే తను నీకు అంతగా నచ్చింది!’ అని మా ఫ్రెండ్స్‌ చెప్పాకే... నాకూ ఆ విషయం తెలిసింది. డయానా కోసం తను మా మేనమామ ఇంటికి వస్తుంటే పరిచయం పెంచుకున్నాను. ఓ రోజు ఫోన్‌ చేసి ‘ఐ లవ్యూ’ చెప్పాను. తను మరో ఆలోచనే లేకుండా ‘నో’ చెప్పింది.

అర్చన: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఎన్నోతరాలుగా ఉంటోన్న శ్రీమంతుల కుటుంబం మాది. నాన్న పోలీసు అధికారి. ఉమ్మడి కుటుంబం కాబట్టి అమ్మాయిలు అడుగు బయటకు వేయాలన్నా పది కళ్లు వెన్నాడుతుండేవి. మా కుటుంబంలో బంధువుల కుటుంబాల్లోకి తప్ప బయటకు పిల్లనిచ్చే ప్రసక్తే లేదు. అందుకే బుజ్జి ప్రేమిస్తున్నాననగానే ‘కుదర్దు’ అని ఫోన్‌ పెట్టేశాను. బుజ్జి ఎదురుపడితే ‘అమెరికాలోని మా చుట్టాలబ్బాయితో నాకు ఎంగేజ్‌మెంట్‌ అయిపోయింది!’ అని అబద్ధం చెప్పాను. అప్పుడే వాళ్లక్కయ్య సుధారాణి కాన్పుకి వచ్చింది. మనం తల్లి కాబోతున్నప్పుడే.. మన తల్లి విలువ తెలుస్తుందంటారు! కానీ, సుధక్కకు(నేను ఇలాగే పిలుస్తాను) తల్లే లేదు కదా అని బాధపడేదాన్ని. కానీ బుజ్జి ఆమెకి ఆ లోటు రానీయలేదు. ఉదయం లేచినప్పటి నుంచీ ఆమెకి కావాల్సిన సమస్తం చేసిపెట్టేవాడు. అప్పుడే అతనిపైన ఇష్టం కలిగింది. మొదట వాళ్లక్కయ్యనే అడిగాను ‘మీ తమ్ముడు నాకు ప్రపోజ్‌ చేస్తున్నాడు. ఏం చెప్పమంటారూ?’ అని. సుధక్క ‘అది నీ ఇష్టం అర్చనా... నీ పరిస్థితుల్ని బట్టి చెప్పు. నా తమ్ముడని కాదుకానీ... వాణ్ణి చేసుకునే అమ్మాయి అదృష్టవంతు రాలవుతుంది. అది మాత్రం చెప్పగలను!’ అంది. సుధక్కకి పాప పుట్టాక... అక్టోబర్‌ 2న.. అతని ప్రేమకి ఓకే చెప్పాను. ఆ తర్వాతొచ్చిన ప్రేమికుల దినోత్సవం మాత్రం చాలా టెన్షన్‌గా గడిచింది.

పరశురామ్‌: ఆ టెన్షన్‌ ఎందుకో నేను చెబుతాను... ఫిబ్రవరి మొదట్లో తను తన బంగారు గొలుసు పోగొట్టుకుంది. ‘ఇంట్లో తెలిస్తే... చంపేస్తారు!’ అంటూ ఏడుపు మొదలుపెట్టింది. దాంతో అలాంటిదే ఓ చెయిన్‌ కొనిపెడదామనుకున్నాను. నా దగ్గర చెయిన్‌ కొనేంత డబ్బులేదు. దాంతో ఊరికెళ్లి నాకు బైకు కొనివ్వాలని నాన్న ఎంతోకాలంగా దాచుకున్న డబ్బుని తెచ్చి ఇచ్చాను. మా అదృష్టం బావుండి షాపులో అలాంటి చెయిన్‌ దొరికింది. అది వేసుకున్న తను ‘థ్యాంక్స్‌ ఫర్‌ వాలెంటైన్స్‌ డే గిఫ్ట్‌’ అన్నాకే ఆ రోజు ప్రేమికుల దినోత్సవం అని గుర్తొచ్చింది నాకు. కొత్తగా మెరుస్తున్న ఆ చెయిన్‌ వాళ్ళింట్లో అనుమానం రేకెత్తించింది. దాంతో నిఘా పెట్టినట్లున్నారు... ఓ రోజు సడెన్‌గా కాలేజీ మాన్పించి ‘రేపే నీకు ఎంగేజ్‌మెంట్‌!’ అని చెప్పేశారు.

అర్చన: ఆ రోజు సాయంత్రం ఎంగేజ్‌మెంట్‌ కోసం నన్ను ముస్తాబు చేయడం మొదలుపెట్టారు. దాంతో తెగించి నా ప్రేమ విషయం చెప్పేశాను. అంతే... మా అమ్మమ్మ అపరకాళికే అయింది. గరిటె కాల్చి చేతికి వాతపెట్టింది. నిజం చెప్పాలంటే... ఆ రోజు మా ఇంట్లో నన్ను కొట్టని చేయి లేదు. రెండుమూడురోజుల తర్వాత ‘వాడు ఇక్కడ లేడు. మా బెదిరింపులకి వాళ్లూరు వెళ్లిపోయాడు... మళ్లీ రాడు’ అని చెప్పారు. కానీ ‘నన్ను అంతగా ప్రేమించినవాడు అలా చేయడు’ అన్న నమ్మకంతో ఎదురుచూస్తూనే వచ్చాను. ఓ రోజు ఇంట్లోవాళ్లు ఏమరుపాటున నా గది తలుపు గడియ పెట్టకుండా నిద్రపోయారు. అదే అదనుగా నైట్‌ డ్రెస్‌తోనే బయటకొచ్చేశాను.

రాత్రి 12 అవుతోంది అప్పుడు. ఓ షాపు నుంచి బుజ్జికి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా తీయలా! ‘మావాళ్లు చెప్పిందే నిజమైందా? తను పారిపోయాడా?’ అన్న ఆలోచనతో దుఃఖం ఆగలేదు. వాళ్లక్కకి ఫోన్‌ చేస్తే ఆమె తీసింది. మరో ఐదు నిమిషాలకి బుజ్జి బైక్‌ మీద వచ్చాడు. వాళ్లింటికి తీసుకెళ్లి... ‘మనం పెద్దల్ని ఒప్పించే పెళ్ళిచేసుకుందాం. అదీ- నువ్వూ నేనూ సెటిల్‌ అయ్యాకే... ఇప్పుడొద్దు... ఇది పద్ధతి కాదు!’ అని చెప్పాడు.

నాకు కోపం వచ్చినా... మావాళ్లు చెప్పినట్టు తను పారిపోయే రకం కాదు అన్న నిశ్చింత మిగిలింది. దాంతో ఇంటికెళ్లిపోయాను. అది ఎంత తప్పో ఆ తర్వాత అర్థమైంది. ఇంట్లో ఆంక్షలు మరింతగా పెరిగాయి..!

Director parasuram family
డైరెక్టర్ పరశురామ్ ఫ్యామిలీ

పరశురామ్‌: మా విషయం బయటకు రాగానే... తన అన్నదమ్ముల వరసైనవాళ్లందరూ మా అక్కయ్యవాళ్ల ఇంటిపైన పడ్డారు. ‘మా అమ్మాయికి దూరంగా ఉండు... లేదంటే, అంతే!’ అని నాకు వార్నింగ్‌ ఇచ్చారు. నేనేమీ భయపడలేదు. ఆవేశానికి గురై ఏ హీరోయిజమూ చూపలేదు. వాళ్ల కోపంలో వందశాతం న్యాయం ఉందనిపించింది..! వాళ్లని ఒప్పించి పెళ్ళి చేసుకుంటేనే మరింత గౌరవంగా ఉంటుందని భావించాను. ఈ గొడవలతో నేను డల్‌గా కనిపిస్తుంటే నా స్నేహితుడు దర్శకుడు దంతులూరి చైతన్య విషయమేంటని అడిగాడు. చెప్పాక ‘మూడేళ్ల తర్వాత చేసుకున్నా... ఇప్పుడు చేసుకున్నా పెళ్ళి పెళ్ళే. దానికీ సెటిల్‌కావడానికీ ముడిపెట్టకు. నీ ఆలస్యం తనకి అపాయంగా మారొచ్చు!’ అన్నాడు. నాకూ అదే సరి అనిపించింది. అర్చన స్నేహితురాలి సాయంతో తనని బయటకు రప్పించాను.

అర్చన: బుజ్జికి దూరమై బతికేకంటే... చావడమే మేలనుకుని వచ్చేశాను. నన్ను సుధక్క దంపతులే బస్సులో విశాఖ తీసుకెళ్లారు. గజగజ వణికించే హైదరాబాద్‌ చలిలో... నాకోసం సుధక్క అర్ధరాత్రిపూట చంటిబిడ్డతో రావడం చూసి కదిలిపోయాను. వాళ్ల పెద్దల సమక్షంలోనే శివాలయంలో పెళ్ళి చేసుకున్నాం. నెలదాకా విశాఖలోనే ఉన్నాం. ఆ తర్వాత పెద్దమనుషుల సాయంతో మావాళ్లు రాజీకొచ్చి రిసెప్షన్‌ ఏర్పాటుచేశారు. పెళ్ళి కథ అలా సుఖాంతమయ్యాకే... అసలు సమస్యలు మొదలయ్యాయి. ప్రేమించేదాకా ఎదుటివాళ్లలో మంచినే చూస్తుంటామేమో... పెళ్ళయ్యాకే లోపాలు బయటపడుతుంటాయి. విశాఖలో ఉన్నప్పుడు ఓసారి ఇద్దరం షాపింగ్‌కి వెళ్లాం. తను బైకుపైన ఉంటే... కొన్నబట్టలన్నీ వెనకాల తగిలించాను. ఆ వెయిట్‌కి నేను ఎక్కానేమో అనుకుని... తను స్టార్ట్‌ చేసుకుని మాట్లాడుకుంటూ వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత మళ్లీ వచ్చి... నాపైన కోపంతో చిందులేశాడు. నాకు ఊరు కొత్త, పైగా చేతిలో పైసాలేదు... ఏమైపోతానో అన్న జాలి కూడా లేకుండా ఇలా అరవడంతో అవాక్కయ్యాను. బుజ్జి ఇంత ముక్కోపి అని నాకు అప్పటికిగానీ తెలియలేదు..!

పరశురామ్‌: కోపాన్ని కోపంతోనే ఎదుర్కొని చల్లార్చడం తన ప్రత్యేకత! తొలినాటి ఆ చిర్రుబుర్రుల మధ్యే మేం హైదరాబాద్‌లోని అక్కయ్యవాళ్లింటికి చేరుకున్నాం. ఆ తర్వాత అక్కాబావలు ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడంతో ఆ ఇంట్లో మేమిద్దరమే మిగిలాం. కానీ నేను అద్దె కట్టలేకపోయాను. నా బడ్జెట్‌కి ఓ కాలనీలో వాచ్‌మ్యాన్‌ ఉండే పోర్షన్‌లాంటిది దొరికింది. ఆ ఇరుకింట్లో తను కష్టాలు పడుతున్నప్పుడే ‘యువరాణిలా బతికిన అమ్మాయి నాకోసం ఇన్ని కష్టాలు పడుతోందే!’ అనిపించింది. అన్ని కష్టాలని భరిస్తూ తను కురిపిస్తున్న ఆ ప్రేమలో మా అమ్మే గుర్తొచ్చింది! అప్పటి నుంచే నా జీవన దృక్పథం మారిపోయింది. తనని నలుగురి మధ్య గౌరవంగా నిలబెట్టడమే లక్ష్యంగా చేసుకున్నాను! ఆ ధ్యేయమే నన్ను ‘యువత’ సినిమాతో దర్శకుణ్ణి చేసింది.

అర్చన: ఇంటి ఇరుకు, పేదరికం నాకు పెద్ద సమస్యగా అనిపించలేదు. నేనెప్పుడూ తను నాతో ఎక్కువ సమయం స్పెండ్‌ చేయాలని కోరుకునేదాన్ని. అది కుదిరేది కాదు. షూటింగ్‌లలో తిన్నాడో లేదోనని కనుక్కుందామని ఫోన్‌ చేస్తే చిరాకుపడేవాడు. ‘నాపైన తనకి ప్రేమ తగ్గిపోయిందా!’ అంటూ అందరి అమ్మాయిల్లాగే బాధపడేదాన్ని. ఆ ఆలోచనని చెరిపేసిన ఘటనలు నా జీవితంలో మూడు జరిగాయి. మొదటిది, నా చదువు. నాలుగేళ్లదాకా పిల్లలు వద్దని నేను డిగ్రీ ముగించేలా చేశాడు. అప్పులు చేసి మరీ చదివించాడని చెప్పొచ్చు. ఆ తర్వాతి ఏడాదికి మా పెద్దవాడు రిషిత్‌ కడుపున పడితే నాకన్నీ తానయ్యాడు. నేను తినాల్సిన ఆహారం నుంచీ వేసుకోవాల్సిన మందుల దాకా సిద్ధం చేసిపెట్టాకే షూటింగ్‌కి వెళ్లేవాడు. ఆ ప్రేమని చూసి నాకు మా అమ్మావాళ్లింటికి కాన్పుకి పోవాలనిపించ లేదు! మా రెండో వాడు పుట్టాక... అకస్మాత్తుగా నాకు నోరు మొద్దుబారిపోయింది. మాట్లాడటం కష్టమైపోయింది. కాళ్లలో ఏ నొప్పీలేకున్నా అడుగువేయలేకపోయేదాన్ని. అప్పుడైతే హైదరాబాద్‌లోని అన్ని పెద్దాసుపత్రులకీ నన్ను చేతుల్లో మోసుకుంటూనే తిరిగాడు. ‘నీకు ఏమీ కాకూడదురా!’ అంటూ ఏడ్చేసేవాడు. ఓ వైపు పిల్లలు... మరోవైపు నేను... ముగ్గురి బాధ్యతా తనదే అయింది. చివరకు విశాఖలోని వైద్యులు విటమిన్‌ డెఫిషియన్సీ అని తేల్చడంతోనే సమస్యల నుంచి బయటపడ్డాను. ఆ సమస్య మా జీవితంలో అల్లకల్లోలం సృష్టిస్తేనేం... మా ఆయనలో అప్పుడు తల్లిని చూడగలిగాను నేను!

పరశురామ్‌: ఆ మాటకొస్తే... అర్చన నాకు ప్రతిరోజూ అమ్మని మరపిస్తుందనే చెప్పాలి! తనతోపాటూ తన పెద్ద కుటుంబాన్నీ నాకు సొంతం చేసింది. ప్రారంభంలో నాపైన కోప్పడ్డా... ఇప్పుడు ఆ కుటుంబం నన్ను పెద్ద కొడుకుగానే చూస్తోంది. వాళ్ల ఆప్యాయత సినిమాల్లో నేను సక్సెస్‌ అయినందువల్ల వచ్చింది కాదు... నా క్యారెక్టర్‌ నచ్చి వచ్చింది. వాళ్లతో ఆ అనుబంధాన్ని స్ఫూర్తిగా తీసుకునే ‘సోలో’ సినిమా కథ రాశాను. ‘సోలో’ సినిమాకి ప్రొడక్షన్‌, కాస్ట్యూమ్‌ బాధ్యతలు తనే చూసుకుంది. ఆ తర్వాత చేసిన రవితేజ ‘సారొచ్చారు’ సినిమా ఫ్లాపయింది. దాంతో మూడు సంవత్సరాలు ఖాళీగా ఉండిపోయాను... ఏ అవకాశాలూ రాలేదు. నేను కుంగుబాటుకు గురైతే ‘నువ్వు గొప్పగా రాయగలవు! మంచి స్క్రిప్టు రాయి...’ అంటూ తనే కాపాడింది. అప్పుడే అల్లు అరవింద్‌గారు శిరీష్‌తో ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా చేసే అవకాశం ఇచ్చారు. అదయ్యాక ‘గీతగోవిందం’ మొదలుపెట్టాం.

హీరోహీరోయిన్ల చిర్రుబుర్రులే ఈ కథకి ప్రధానం అనుకున్నాక... నాకు మా పెళ్లైన కొత్తల్లోని సంఘటనలే గుర్తొచ్చాయి. కాకపోతే నేను అర్చనని ‘అమ్మా’ అంటే నా హీరో ‘మేడమ్‌’ అనేవాడు... అంతే తేడా! ఆ సినిమాలో నాయికానాయకుల కాస్ట్యూమ్‌ డిజైనర్‌ కూడా మా ఆవిడే. ఆ హిట్టే... మా దశ తిరిగేలా చేసింది. అదే... నేడు మహేశ్‌బాబునీ డైరెక్ట్‌ చేసేదాకా తీసుకెళ్లింది!

చివరిగా ఓ విషయం చెప్పాలి... ప్రేమలో పడటం తప్పుకాదు, ఎదిరించి పెళ్ళిచేసుకోవడమూ తప్పుకాదు. మనల్ని నమ్మివచ్చిన వ్యక్తిని సమాజంలో సగౌరవంగా నిలబెట్టడమే నిజమైన ప్రేమ. అప్పుడే మన లవ్‌... సక్సెస్‌ అయినట్టు!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.