Samantha liger song: విడాకులు అనంతరం కెరీర్‌లో స్పీడ్ పెంచారు నటి సమంత. వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూ మరోసారి ప్రేక్షకుల మది గెలుచుకునేందుకు ఆమె తాపత్రయపడుతున్నారు. ఈ క్రమంలో ఆమె తొలిసారి ఓ ఐటమ్ సాంగ్‌లో తళుక్కున మెరిశారు. 'పుష్ప' సినిమా కోసం 'ఊ అంటావా మావ' అంటూ బన్నీతో కలిసి స్టెప్పులేశారు. సమంత వేసిన స్టెప్పులతో ఈ పాటకు మరింత క్రేజ్ వచ్చింది. సుమారు రెండు వారాల క్రితం విడుదల చేసిన ఈ పాట ఫుల్ వీడియో 73 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది.
Vijay devarakonda liger movie: ఇప్పుడు సమంతను మరో క్రేజీ ఆఫర్ వరించినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమాలో సామ్‌కు ఛాన్స్ వచ్చినట్లు సమాచారం. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఆ పాట కోసం ఎవరైనా స్టార్ హీరోయిన్‌ను ఎంచుకోవాలని పూరీ జగన్నాథ్, ఆయన టీమ్ భావిస్తోందట.
ఈ సమయంలో 'ఊ అంటావా' పాట సూపర్‌హిట్ కావడం వల్ల తమ సినిమాలోనూ ఐటమ్ సాంగ్‌ను సమంతకు అప్పచెబితే బాగుంటుందని చిత్రబృందం అనుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే చిత్రబృందం సామ్‌తో సంప్రదింపులు జరపడం సహా విజయ్ దేవరకొండ సైతం తనకున్న చనువుతో ఆమెను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మరి సామ్.. విజయ్ దేవరకొండ, పూరీ మాటలకు ఓకే చెప్పిందా?లేదా? తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరోవైపు, 'మహానటి' కోసం సమంత-విజయ్ దేవరకొండ కలిసి పనిచేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇవీ చదవండి: