ETV Bharat / sitara

మన్మథుడితో కలసి 'మహానటి'కి సామ్ సవాల్ ​​ - గ్రీన్​ ఇండియా ఛాలెంట్​ సమంత నాగార్జున

టాలీవుడ్​ సీనియర్​ హీరో నాగార్జున విసిరిన 'గ్రీన్​ ఇండియా ఛాలెంజ్​'ను స్వీకరించిన హీరోయిన్​ సమంత తన నివాసంలో మూడు మొక్కలను నాటారు. అనంతరం కథానాయికలు కీర్తి సురేష్, రష్మికకు ఛాలెంజ్ విసిరారు.

sam
సమంత
author img

By

Published : Jul 11, 2020, 8:05 PM IST

'గ్రీన్ ఇండియా ఛాలెంజ్' ఒక యజ్ఞంలా ముందుకు సాగుతుంది. ఈ కార్యక్రమంలో పలువురు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులతో పాటు అన్ని వర్గాల ప్రజలు మొక్కలు నాటుతూ తమ సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నారు. ఇటీవల ఇందులో భాగంగా మొక్కలు నాటిన టాలీవుడ్​ మన్మథుడు అక్కినేని నాగార్జున తన కోడలు సమంతకు ఛాలెంజ్ విసిరారు.

అయితే తాజాగా తన మామ ఇచ్చిన ఛాలెంజ్​ను స్వీకరించిన అక్కినేని కోడలు సమంత ఈ రోజు జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో నాగార్జునతోనే కలిసి మూడు మొక్కలు నాటారు.

సమంత

"ఈ కార్యక్రమం చాలా గొప్పది. పెరిగిపోతున్న కాలుష్యానికి బ్రేక్ వేయడానికి ఇది ఒక ఆయుధంలా పనిచేస్తుంది. నా అభిమానులందరూ మూడు మొక్కలు నాటి ఈ ఛాలెంజ్​ను మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాను."

-సమంత, కథానాయిక.

తన కోస్టార్స్ మహానటి కీర్తి సురేష్, బ్యూటీ రష్మికకు ఈ ఛాలెంజ్ విసిరారు సమంత. ప్రస్తుతం బాలీవుడ్​లో 'ది ఫ్యామిలీ మెన్​ 2' వెబ్​సిరీస్​లో నటిస్తోంది సమంత.

ఇది చూడండి : 'వర్చువల్​ స్క్రిప్ట్​ రీడింగ్'​ చేస్తున్న కంగన.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.