ETV Bharat / sitara

ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టిన సమంత - samantha business

హీరోయిన్​ సమంత 'సాకి వరల్డ్'​ పేరుతో బట్టల వ్యాపారం ప్రారంభించింది. త్వరలోనే దీనిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.

samanta
సమంత
author img

By

Published : Sep 5, 2020, 5:24 PM IST

తన నటనతో మైమరిపించి.. అందంతో కుర్రాళ్ల మనసు దోచిన హీరోయిన్​ సమంత. ఓ వైపు సినీ పరిశ్రమలో రాణిస్తూనే.. తన అభిరుచికి తగిన వ్యాపారాలపై దృష్టి సారిస్తోందీ అమ్మడు. ఇటీవలే తన ఇంటి డాబాపై పెరటి తోట ఏర్పాటు చేసి.. క్యారెట్లను పెంచిన సామ్​ ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్​స్టాగ్రామ్​లోనూ పోస్ట్​ చేసింది. జూబ్లీహిల్స్​లో స్నేహితులతో కలిసి 'ఏక్కం' అనే ప్రీ స్కూల్​నూ ప్రారంభించింది.

ఇప్పుడు బట్టల వ్యాపారంలోనూ అడుగుపెట్టింది. యువతకు రకరకాల దుస్తులను పరిచయం చేస్తూ.. 'సాకి వరల్డ్'​ పేరుతో ఈ బిజినెస్​ ప్రారంభించింది.

"ఎప్పటి నుంచో నేను కన్న కల ఇది. ఫ్యాషన్​ రంగంపై నాకున్న ప్రేమను 'సాకి వరల్డ్'​ తెలియజేస్తుంది. త్వరలోనే దీనితో మీ ముందుకు వస్తున్నా."

-సమంత, సినీ నటి

తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న ఈ భామ 'ది ఫ్యామిలి మ్యాన్ 2' సిరీస్​లో నటించింది. ఇందులో నెగిటివ్​ రోల్​లో అలరించనుంది సామ్​. త్వరలోనే ఈ సిరీస్ విడుదలకానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.