Salmankhan Sonakshi Sinha marriage: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, హీరోయిన్ సోనాక్షి సిన్హా రహస్యంగా పెళ్లి చేసుకున్నారంటూ కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. నెట్టింట్లో ఓ ఫొటో కూడా వైరల్‌గా మారింది.
తాజాగా దీనిపై స్పందించిన సోనాక్షి.. నెటిజన్లపై మండిపడింది. రియల్ ఫొటోకు మార్ఫింగ్ ఫొటోకు తేడా తెలియదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, ప్రస్తుతం 'టైగర్ 3'లో నటిస్తున్న సల్మాన్..చిరంజీవి 'గాడ్‌ఫాదర్', షారుక్ 'పఠాన్' చిత్రాల్లో అతిథి పాత్రల్లో కనపించనున్నారు. సోనాక్షి.. 'కకుడా', 'డబుల్ ఎక్స్ఎల్' చిత్రాల్లో నటిస్తోంది.
ఇదీ చూడండి: 'రెడ్ హాట్'గా పూజా.. కరిష్మా, సాక్షిమాలిక్ న్యూ లుక్స్