ETV Bharat / sitara

సల్మాన్​ ఫామ్​హౌస్​లో 'బిగ్​బాస్' షూటింగ్​! - bigboss season 14 latset news

హిందీ బిగ్​బాస్​ కొత్త సీజన్​ ప్రోమో చిత్రీకరణకు అంతా సిద్ధం చేస్తున్నారు. అయితే దీనిని సల్మాన్​ ఫామ్​హౌస్​లో తీయనున్నట్లు సమాచారం.

Salman Khan to shoot Bigg Boss 14 promo at his farmhouse?
సల్మాన్​ ఫామ్​హౌస్​లో 'బిగ్​బాస్​ సీజన్​ 14' షూటింగ్​?
author img

By

Published : Jun 15, 2020, 12:21 PM IST

టెలివిజన్​ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'బిగ్​బాస్​ 14' ప్రోమో షూటింగ్​కు బాలీవుడ్​ కండలవీరుడు సల్మాన్​ఖాన్​ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై అధికారిక ప్రకటన రానప్పటికీ.. ఈ షో తర్వాతి సీజన్​ గురించి చాలా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నిర్మాతలు​ సన్నాహాలు ప్రారంభించినట్లు పరిశ్రమ అంతర్గత వర్గాలు వెల్లడించాయి.

సల్మాన్​ ఫామ్​హౌస్​లో త్వరలోనే ప్రోమోను చిత్రీకరించనున్నారట. కరోనా వల్ల సామాజిక దూరం పాటిస్తున్నందున ప్రోమో థీమ్​ కూడా ఈ నేపథ్యంలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. కొత్త సీజన్​ అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.

అయితే సీజన్​లో పోటీదారులెవరనేది ఇంకా స్పష్టత లేదు. శుభంగి అట్రే, షగున్​ పాండేలను ఈ షో కోసం సంప్రదించగా.. వారు అంగీకరించినట్లు టాక్. చాపత్ ఖన్నా కూడా పోటీదారుల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.