ETV Bharat / sitara

'సోలో'గా ఓటీటీలో విడుదలకు సిద్ధమైన సాయితేజ్​!

మెగాహీరో సాయి తేజ్​ నటిస్తున్న చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్​' త్వరలో ఆన్​లైన్​ వేదికగా విడుదల కానుందని సమాచారం. ఈ చిత్రబృందం ఇటీవల ఓ ప్రముఖ ఓటీటీ సంస్థతో చర్చలు జరిపినట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

author img

By

Published : Aug 13, 2020, 8:23 PM IST

Sai Tej's next for OTT release-To come out during this time
'సోలో'గా ఓటీటీలో విడుదలకు సిద్ధమైన సాయితేజ్​!

టాలీవుడ్​ హీరో సాయిధరమ్​ తేజ్​ నటిస్తున్న చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్​'. ఈ సినిమాను ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఓ ప్రముఖ ఓటీటీతో నిర్మాణ సంస్థ ఇటీవల చర్చలు జరిపిందని సమాచారం. అక్టోబరులో సినిమాను రిలీజ్​ చేయడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్​ తుదిదశకు చేరుకుంది. మిగిలిన సన్నివేశాల్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్​కు సిద్ధం చేయనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం రొమాంటిక్​ కామెడీ కథాంశంతో తెరకెక్కుతోంది. రావు రమేశ్​ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. సుబ్బు అనే నూతన దర్శకుడు పరిశ్రమకు పరిచయమవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రబృందం త్వరలోనే వెల్లడించనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.