ETV Bharat / sitara

RRR movie: ఆర్​ఆర్​ఆర్​ ట్రీట్​.. 'దోస్తీ' సాంగ్​ వచ్చేసింది​ - RRR alia bhatt

రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్​ఆర్​ఆర్' సినిమా(RRR movie) నుంచి​ ఫస్ట్​ సాంగ్​(దోస్తీ) విడుదలైంది. ఈ పాట శ్రోతలను ఆకట్టుకునేలా ఉంది. ఐదు భాషల్లో ఐదుగురు ప్రముఖ గాయకులు ఈ పాటను ఆలపించడం విశేషం.

RRR
ఆర్​ఆర్​ఆర్​
author img

By

Published : Aug 1, 2021, 11:06 AM IST

Updated : Aug 1, 2021, 11:48 AM IST

యావత్‌ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR movie Dosti song) నుంచి తొలిపాట 'దోస్తీ' విడుదలైంది. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం విడుదలైన ఈ పాట ప్రతిఒక్కర్నీ ఎంతో ఆకట్టుకునేలా ఉంది. కీరవాణి సారథ్యంలో హేమచంద్ర (తెలుగు), అమిత్‌ త్రివేది (హిందీ), అనిరుధ్‌ (తమిళం), యాజిన్‌ నైజర్‌ (కన్నడ), విజయ్‌ ఏసుదాస్‌ (మలయాళం).. ఇలా ఐదు భాషలకు చెందిన ఐదుగురు సంగీత యువ కెరటాలు ఈ పాటను హుషారెత్తించేలా ఆలపించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో రామ్‌చరణ్‌-తారక్‌ల స్నేహానికి ప్రతీకగా ఈ పాటను రూపొందించినట్లు అర్థమవుతోంది. ఈ సాంగ్​ వీడియో చివర్లో తారక్​-చెర్రీ లుక్​ అదిరిపోయింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రముఖ దర్శకుడు రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అక్టోబరు 13న సినిమా విడుదల కానుంది. రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​ పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవల వచ్చిన 'రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్' పేరుతో వచ్చిన మేకింగ్ వీడియో అభిమానుల్ని అలరిస్తూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. ఆలియా భట్, ఒలీవియా మోరిస్​ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతమందిస్తున్నారు. డీవీవీ దానయ్య రూ.450 కోట్ల బడ్జెట్​తో నిర్మిస్తున్నారు.

ఇదీ చూడండి:

Last Updated : Aug 1, 2021, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.